మైక్రోమ్యాక్స్ కొత్త స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేసింది. ఫేస్‌బుక్ లైవ్ ద్వారా ‘కాన్వాస్ ఇన్ఫినిటీ’ పేరుతో కొత్త డివైస్‌ను మంగళవారం విడుదల చేసింది. దీని ధరను 9,999గా నిర్ణయించింది. రిజిస్ట్రేషన్లను ఈ రోజునుంచే ప్రారంభమయ్యాయి. అలాగే అమెజాన్‌లో ప్రత్యేకంగా సెప్టెంబరు 1నుండి అందుబాటులో ఉంటుంది. అనంతరం దేశవ్యాప్తంగా రిటైల్ స్టోర్లలో అందుబాటులో ఉంటుంది.
తమ కొత్త డివైస్ సునామీ సృష్టిస్తుందనీ , హైలీ డిస్‌రప్టివ్ అని మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ పేర్కొన్నారు. 18.9 డిస్‌ప్లే తో వస్తున్న అతి చవకైన ఫోన్ ఇదే అన్నారు. శ్యామ్సంగ్ గెలాక్సీ ఎస్8 84.2 శాతం బాడీ రేషియో స్క్రీన్ అందిస్తుందగా తమ ఇన్ఫినిటీ 83 శాతం అందిస్తోందని శర్మ చెప్పారు. అలాగే ఆండ్రాయిడ్ నౌగట్ అప్‌డేటెడ్ వెర్షన్ 8.0 ఓరియో అందుబాటులోకి రాగానే ఈడివైస్ కూడా అప్‌డేట్ అవుతుందని ఆయన చెప్పారు.
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ
5.77 అంగుళాల డిస్ ప్లే పూర్తి విత్ ఫుల్ విజన్ 18: 9
స్నాప్ డ్రాగన్ 425 ప్రాసెసర్,
1440 x 720 రిజల్యూషన్
ఆండ్రాయిడ్ నౌగట్ 7
3 జీబీ ర్యామ్
32 జీబీ స్టోరేజ్
13ఎంపీ రియర్ కెమెరా
16 సెల్ఫీ కెమెరా
128 జీబీదాకా విస్తరించుకునే అవకాశం
2900 ఎంఏహెచ్ బ్యాటరీ
It is time to #ExpandYourView with the #CanvasInfinity. pic.twitter.com/bKBnoPRjOB
— Micromax India (@Micromax_Mobile) August 22, 2017
Canvas Infinity Launch Event: https://t.co/g1IDC8Vg7N
— Micromax India (@Micromax_Mobile) August 22, 2017