దూసుకుపోతున్న మైక్రోమాక్స్
న్యూఢిల్లీ: మొబైల్స్ తయారీ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న మైక్రోమాక్స్ తన వ్యాపార విస్తరణలో దూసుకుపోతోంది. ప్రముఖ దేశీయ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల కంపెనీ మైక్రోమాక్స్ స్మార్ట్ ఫోన్ల తయారీలో మరింత విజృంభిస్తోంది. ఈ క్రమంలో మైక్రో మాక్స్ లోగోను కూడా బుధవారం కొత్తగా లాంచ్ చేసింది. భారతదేశంలో స్మార్ట్ ఫోన్ల తయారీలో రెండవ స్థానాన్ని ఆక్రమించిన మైక్రో మాక్స్ రెండు ఫ్లాగ్షిప్ ఫోన్లతో సహా, 15 కొత్త మోడళ్లను లాంచ్ చేసింది. తన సరికొత్త కాన్వాస్ 6, కాన్వాస్ 6 ప్రో లతో మార్కెట్లో హల్ చల్ చేయనుంది. దీంతోపాటుగా ఎల్ ఈడీ టీవీలను, 4జీ టాబ్లెట్స్ ను విడుదల చేసింది. కొత్తగా విడుదల చేసిన లోగో ప్రకారం 'నట్స్ గట్స్, గ్లోరీ' అనే టాగ్ లైన్ తో మైక్రోమాక్స్ బ్రాండ్స్ ఇక ముందు మనముందుకు రానున్నాయి.
హీలియో ప్రాసెసర్ తో 4జీ రామ్ గల దేశంలోనే మొట్టమొదటి స్మార్ట ఫోన్ కాన్వాస్ 6 ప్రో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. అలాగే ఫింగర్ ప్రింట్ కెమెరా, ఫుల్ మెటల్ బాడీ, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా, 3 జీబీ రామ్ 32 జీబీ ఎక్స్పాండబుల్ స్టోరేజీ కెపాసిటీ స్పెసిఫికేషన్స్ తో కాన్వాస్ 6 లాంచ్ అయింది. ఇదే కార్యక్రమంలో ఈ కామర్స్ పోర్టల్ ని లాంచ్ చేసింది. ఫ్లాగ్షిప్ ఫోన్ల ఆర్డర్లను తక్షణమే స్వీకరించి, ఓపెన్ సేల్స్ ఏప్రిల్ 20 నుంచి మొదలు పెట్టనుంది. మిగిలిన అన్ని వస్తువుల ఆర్డర్లను త్వరలోనే స్వీకరించేందుకు ఏర్పాటు చేస్తోంది.
టెలివిజన్ అమ్మకాల్లో 5వ స్తానంలోఉన్న ఈ సంస్థ 40, 50 అంగుళాల ఎల్ఈడీ టీవీలను కూడా కొత్తగా లాంచ్ చేసింది. విదేశాల్లో కూడా హవా చాటుతున్న మైక్రోమాక్స్ మొబైల్ అమ్మకాల్లో రష్యాలో మూడవ స్థానాన్ని కొట్టేసింది. దీంతో విదేశాల్లో తమ వ్యాపారాన్ని మరింత విస్తరించుకోనే ప్రయత్నాల్లో ఉంది. దేశంలో లార్జెస్ట్ సర్వీసెస్ కంపెనీగా మైక్రోమాక్స్ ను తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని కంపెనీ కో ఫౌండర్ రాహుల్ శర్మ తెలిపారు. 2017 సం.రానికి 5కోట్ల వినియోగదారులను సాధించే లక్ష్యంతో ఉన్నామన్నారు. ఈనేపథ్యంలో తెలంగాణా, మధ్యప్రదేశ్ , రాజస్థాన్ లలో నాలుగు కొత్త ప్లాంట్ లను నిర్మించ తలపెట్టినట్టు వెల్లడించారు. 2017 కల్లా 300 వందల కోట్ల పెట్టుబడితో 10 వేల సిబ్బందితో తమ సేవలను మరింత విస్తరించేందుకు ప్రణాళికలు రచిస్తోంద.