మైక్రోమ్యాక్స్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌ ‘యూ ఏస్‌’ | Micromax launches new smartphone U S | Sakshi
Sakshi News home page

మైక్రోమ్యాక్స్‌ కొత్త స్మార్ట్‌ఫోన్‌ ‘యూ ఏస్‌’

Published Fri, Aug 31 2018 12:44 AM | Last Updated on Fri, Aug 31 2018 12:44 AM

Micromax launches new smartphone  U S - Sakshi

న్యూఢిల్లీ: హ్యాండ్‌సెట్స్‌ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్‌ ఇన్ఫర్మేటిక్స్‌ సంస్థ తాజాగా తమ సబ్‌ బ్రాండ్‌ యూ కింద కొత్త స్మార్ట్‌ఫోన్‌ ‘యూ ఏస్‌‘ని ఆవిష్కరించింది. దీని ధర రూ. 5,999. సెప్టెంబర్‌ 6 నుంచి ఆన్‌లైన్‌ షాపింగ్‌ పోర్టల్‌ ఫ్లిప్‌కార్ట్‌లో విక్రయాలు ప్రారంభమవుతాయని సంస్థ చీఫ్‌ మార్కెటింగ్‌ అండ్‌ కమర్షియల్‌ ఆఫీసర్‌ శుభదీప్‌ పాల్‌ తెలిపారు.

5.45 అంగుళాల హెచ్‌డీ స్క్రీన్, 18:9 యాస్పెక్ట్‌ నిష్పత్తి, 2జీబీ ర్యామ్, 16 జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ, ఆండ్రాయిడ్‌ ఓరియో ఓఎస్‌ మొదలైనవి ఇందులో ప్రత్యేకతలు. ఫోన్‌ వెనుకవైపు 13 ఎంపీ, ముందువైపు 5 ఎంపీ కెమెరాలు ఉంటాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement