![Godrej Launches New Smart Lock Range Advantis Iot9 in Hyderabad](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/01/8/godreg.jpg.webp?itok=JCzpCLYw)
గోద్రెజ్ (Godrej) ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్ వ్యాపార విభాగం అయిన లాక్స్ అండ్ ఆర్కిటెక్చరల్ సొల్యూషన్స్ తమ అడ్వాంటిస్ ఐఓటీ9 (Advantis IoT9) స్మార్ట్ లాక్‌ను తెలుగురాష్ట్రాల్లో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాదులో జరిగిన కార్యక్రమంలో అడ్వాంటిస్ IoT9 స్మార్ట్ లాక్‌ను ప్రారంభించినట్లు ప్రకటించింది.
ఐఓటీ (ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్) సాంకేతికతతో అత్యాధునిక ఫీచర్లతో రూపొందించిన ఈ స్మార్ట్ లాక్ శ్రేణి ఇంటికి మెరుగైన భద్రతను అందిస్తుంది. డిజిటల్ లాక్‌లలో IoT9ని పరిచయం చేసిన మొదటి బ్రాండ్ ఇదే. ఈ డిజిటల్ లాక్‌లు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాలలో 100 కుపైగా రిటైల్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉంటాయని కంపెనీ తెలిపింది.
గోద్రెజ్ ఎంటర్‌ప్రైజెస్ గ్రూప్‌లో భాగమైన లాక్స్ అండ్ ఆర్కిటెక్చరల్ సొల్యూషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ & బిజినెస్ హెడ్ శ్యామ్ మోత్వాని మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో అడ్వాంటిస్ IoTని ప్రారంభించడం పట్ల సంతోషిస్తున్నామని, ఈ నగరం డిజిటల్ లాక్‌లకు కీలకమైన మార్కెట్‌గా ఉద్భవించిందని పేర్కొన్నారు.
అడ్వాంటిస్ ఐఓటీ9 ముఖ్య ఫీచర్లు
బ్లూటూత్, వైఫై, ఎన్‌ఎఫ్‌సీ, స్మార్ట్‌వాచ్‌లు, ఫింగర్‌ప్రింట్, ఆర్‌ఎఫ్‌ఐడీ కార్డ్‌లు, పాస్‌కోడ్‌లు, మెకానికల్ కీ లేదా రిమోట్ కంట్రోల్ ద్వారా ఈ లాక్‌ను అన్‌లాక్ చేయొచ్చు. ఇంగ్లీష్, హిందీతోపాఉట ప్రాంతీయ భాషలలో వాయిస్-గైడెడ్ ఆదేశాలతో పని చేస్తుంది. లాక్ చేయకుండా సౌకర్యవంతమైన కదలిక కోసం పాసేజ్ మోడ్ ఉంది. అత్యవసర సమయంలో ఫైర్ అలారం మోగుతుంది. ఎవరైనా ట్యాంపర్ చేయడానికి ప్రయత్నిస్తే మూడు తప్పు ప్రయత్నాల తర్వాత యాప్ నోటిఫికేషన్‌లను పంపుతుంది. దేశంలోనే హోస్ట్ చేసే ఇంటిగ్రేటెడ్ క్లౌడ్ స్టోరేజ్ వినియోగదారు డేటా భద్రతను నిర్ధారిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment