Smart lock
-
దొంగలూ.. ఇక మీ పప్పులు ఉడకవూ
-
Smart Lock: అరచేతిని చూపిస్తేనే తెరుచుకుంటుంది
మామూలు తాళాలను ఆరితేరిన దొంగలు ఇట్టే తెరిచి, ఇల్లంతా దోచుకునే ప్రమాదం ఉంది. ఇది స్మార్ట్లాక్. ఎంత ఆరితేరిన దొంగలైనా దీనిని తెరవలేరు. దీనిని తెరవడానికి తాళం చెవితో పనిలేదు. దీనికి తెలిసిన వారి అరచేతిని చూపిస్తేనే తెరుచుకుంటుంది. ఇందులో యాభై వరకు అరచేతి ముద్రలను నమోదు చేసుకునే వీలుంది. సాధారణంగా అన్ని నమోదు చేసుకోనవసరం ఉండదు గాని, ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులందరి అరచేతి ముద్రలను నమోదు చేసుకుంటే, ఇది భేషుగ్గా ఉపయోగపడుతుంది. అమెరికన్ కంపెనీ ఫిలిప్స్ కార్పొరేషన్ దీనిని రూపొందించింది. దీనిని తెరవాలంటే దీనికి అమర్చి ఉన్న స్కానర్ వద్ద అరచేతిని చూపిస్తే చాలు. దీని ధర 359.99 డాలర్లు (రూ.29,925) మాత్రమే! -
ఇక తాళంచెవి అవసరం లేదోచ్!
వాషింగ్టన్: ఇక ముందు మీ బైక్కు ఎలాంటి తాళం చెవులూ అవసరం లేదు.. మీరు బైక్ దగ్గరికి వెళ్లగానే దానంతట అదే అన్లాక్ అయిపోతుంది.. అంతేకాదు ఎవరైనా మీ బైక్ను చోరీ చేయడానికి ప్రయత్నిస్తే మీ స్మార్ట్ఫోన్కు సందేశం పంపి హెచ్చరిస్తుంది. ఒకవేళ ప్రమాదానికి గురైతే వెంటనే అవసరమైనవారికి సమాచారాన్నీ అందిస్తుంది.. అమెరికాకు చెందిన వెలో లాబ్స్ సంస్థ వ్యవస్థాపకులు జాక్ అల్కహ్వతి, గెరార్డో బరోటా రూపొందించిన ‘స్కైలాక్’ ప్రత్యేకతలివి. బైకుల్లో ఏర్పాటు చేసే ఈ ‘స్కైలాక్’ వ్యవస్థ బ్లూటూత్, వైఫై వంటివాటి ద్వారా మీ స్మార్ట్ఫోన్తో అనుసంధానం అవుతుంది. మీరు దగ్గరికి వెళ్లగానే బైక్ను అన్లాక్ చేస్తుంది. దీనిలో ఏర్పాటు చేసిన యాక్సిలరోమీటర్ సహాయంతో ప్రమాదం జరిగినప్పుడు గుర్తించి.. వెంటనే హెచ్చరిస్తుంది. అన్నింటికంటే విశేషం ఏమిటంటే ఈ ‘స్కైలాక్’కు ఎలాంటి అదనపు విద్యుత్ అవసరం లేదు. బైక్పై ఏర్పాటు చేసే సౌరవిద్యుత్ ఫలకాల ద్వారా దీన్లో ఏర్పాటు చేసే బ్యాటరీని నింపుకొంటుంది. అదీ ఒక గంటపాటు చార్జ్ అయితే.. నెలరోజులు పనిచేస్తుందట. ఇంతకీ దీని ధర ఎంతో తెలుసా..? జస్ట్ రూ. 15 వేలు మాత్రమే.