
రూ. 699కే మైక్రోమ్యాక్స్ ‘జాయ్’ ఫోన్
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ సంస్థ మైక్రోమ్యాక్స్ అతి తక్కువ ధరలకే జాయ్ సీరిస్‌లో రెండు రకాల ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. 1.76 అంగుళాల తె ర, 750 ఎంఏహెచ్ బ్యాటరీ, 0.08 ఎంపీ కెమెరా వంటి ప్రత్యేకతలున్న ‘జాయ్ ఎక్స్-1800’ ఫోన్ ధర రూ. 699. ఇదే ప్రత్యేకతలతో 1,800 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉన్న మరో ఫోన్ ‘జాయ్ ఎక్స్-1850’ ధర రూ.749. దీర్ఘకాల మన్నిక, అధిక బ్యాటరీ సామర్థ్యం వంటి త దితర ప్రత్యేకతల వల్ల వినియోగ దారుల ఎంపికలో మా ఫోన్లు అగ్రస్థానంలో నిలుస్తాయని మైక్రోమ్యాక్స్ ఒక ప్రకటనలో తెలిపింది.
ఎక్స్-1800 రకం ఫోన్లు ఇప్పటికే వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయని, ఎక్స్-1850 రకం ఫోన్లను మరో వారంలో అందుబాటులోకి తెస్తామని పేర్కొంది. మైక్రోమ్యాక్స్ శుభాజిత్ సెన్‌ను ఛీప్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా నియమించుకుంది. గతంలో ఈయన గ్లాక్సో స్మిత్‌క్లైన్ హెల్త్‌కేర్ లిమిటెడ్‌లో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు నిర్వర్తించారు.