న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ కంపెనీ కాన్వాస్ సిరీస్‌లో కొత్త ఫోన్, కాన్వాస్ బ్లేజ్‌ను బుధవారం భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ డ్యుయల్ సిమ్ ఫోన్ ధర రూ.11,000. ఈ ఫోన్‌ను ఎంటీఎస్ సీడీఎంఏ నెట్‌వర్క్‌ను, ఏ ఇతర జీఎస్‌ఎం నెట్‌వర్క్‌నైనా సపోర్ట్ చేసే విధంగా రూపొందించామని మైక్రోమ్యాక్స్ సహ-వ్యవస్థాపకుడు వికాస్ జైన్ తెలిపారు. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో పనిచేసే ఈ ఫోన్‌లో 3జీ ఈవీడీవో(సీడీఎంఏ టెక్నాలజీ) ప్రత్యేక ఆకర్షణ అన్నారు. యూజర్లు తమ జీఎస్‌ఎం నం బర్‌తో పాటు ఎంటీఎస్ 3జీ ఈవీడీవో నెట్‌వర్క్ ప్రయోజనాలను పొందవచ్చని వివరించారు. ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఓఎస్‌పై పనిచేసే ఈ ఫోన్‌లో 5 అంగుళాల స్క్రీన్, 8 మెగా పిక్సెల్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 768 ఎంబీ ర్యామ్, 4జీబీ మెమెరీ, 32జీబీ వరకూ ఎక్స్‌పాండబుల్ మెమరీ వంటి ప్రత్యేకతలున్నాయి.
ఆర్నెళ్లు డేటా, వాయిస్ ప్రయోజనాలు
ఈ ఫోన్ కొనుగోలు చేసిన వారికి 2జీ మొబైల్ ఇంటర్నెట్, ఎంటీఎస్ నుంచి ఎంటీఎస్‌కు 1,000 నిమిషాల లోకల్ కాలింగ్, 120 నిమిషాల ఇతర లోకల్, ఎస్‌టీడీ కాల్స్ ఉచితమని వికాస్‌జైన్ పేర్కొన్నారు. ఈ ఆఫర్ ఆర్నెళ్ల పాటు వర్తిస్తుందని తెలిపారు. కాన్వాస్ బ్లేజ్‌తో ఆర్నెళ్ల పాటు డేటా, వాయిస్ ప్రయోజనాలు ఉచితమని ఎంటీఎస్ ఇండియా చీఫ్ మార్కెటింగ్, సేల్స్ ఆఫీసర్ లియోనిద్ ముసతోవ్ చెప్పారు.
మైక్రోమ్యాక్స్ కాన్వాస్ బ్లేజ్ @ రూ.11,000
Published Thu, Dec 19 2013 2:42 AM | Last Updated on Sat, Sep 2 2017 1:45 AM
Advertisement
Advertisement