సాక్షి, న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ సరికొత్త టీవీని మార్కెట్లోకి విడుదల చేసింది. భారత మార్కెట్‌లో 40 ఇంచుల ఒక నూతన ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీని లాంచ్ చేసింది. మైక్రోమాక్స్ సబ్‌బ్రాండ్ యు టెలివెంచర్స్ యు యుఫోరియా పేరిట బుధవారం ఈ స్మార్ట్ టీవీని అందుబాటులోకి తెచ్చింది. అమెజాన్‌ద్వారా ప్రత్యేకంగా విక్రయించనుంది. దీని ధర రూ. 18,999. అలాగే ఎక్సేంజ్ ఆఫర్లో (పాత టీవీ మార్చుకుంటే) రూ. 7,200 డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.
యు యుఫోరియా స్మార్ట్ టీవీ ఫీచర్లు
40-అంగుళాల ఫుల్ హెచ్‌డీ(1920x1080 పిక్సల్స్) డిస్‌ప్లే
5000: 1 కాంట్రాస్ట్ రేషియో
60 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్
డ్యూయల్ కోర్ గ్రాఫిక్స్ కో ప్రోసెసర్ కూడిన క్వాడ్-కోర్ ప్రాసెసర్
వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కంట్రోల్ ఫీచర్
మూడు హెచ్‌డీఎం పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఒక వీజీఏ పోర్ట్
24 వాట్స్ ఆడియో అవుట్‌పుట్
ముఖ్యంగా స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న మీడియా ఫైల్స్‌ను నేరుగా టీవీలో ప్లే చేసుకోవచ్చు. యూజర్లు తమకు కావల్సిన అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ కంట్రోల్ అనే ఆప్షన్‌తో స్మార్ట్‌ఫోన్‌తోనే టీవీని ఆపరేట్ చేయవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment