మైక్రోమ్యాక్స్ నుంచి అతి పలుచని స్మార్ట్‌ఫోన్ | The thin smartphone from Micromax | Sakshi
Sakshi News home page

మైక్రోమ్యాక్స్ నుంచి అతి పలుచని స్మార్ట్‌ఫోన్

Published Fri, Jun 19 2015 2:20 AM | Last Updated on Tue, Nov 6 2018 5:26 PM

మైక్రోమ్యాక్స్ నుంచి అతి పలుచని స్మార్ట్‌ఫోన్ - Sakshi

మైక్రోమ్యాక్స్ నుంచి అతి పలుచని స్మార్ట్‌ఫోన్

న్యూఢిల్లీ : ప్రముఖ దేశీ ఫోన్ల తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ ప్రపంచంలోనే అతి పలుచనైన ‘కాన్వాస్ సిల్వర్ 5’ స్మార్ట్‌ఫోన్‌ను గురువారం ఆవిష్కరించింది. దీని ధర రూ.17,999. బంగారు, నలుపు రంగుల్లో లభ్యంకానున్న ఈ స్మార్ట్‌ఫోన్ ప్రపంచలోనే అతి పలుచనైనది (5.1 మిల్లీమీటర్లు), అతి తక్కువ బరువు (97 గ్రాములు) కలది.

ఆండ్రాయిడ్ లాలీపాప్ ఓఎస్‌పై పనిచేసే ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4.8 అంగుళాల తెర, 4జీ, 1.2 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరీ, డబుల్ డేటా ఆఫర్‌తో కూడిన ఉచిత 4జీ ఎయిర్‌టెల్ సిమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ చివరి నుంచి వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement