న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం కంపెనీ ‘బీఎస్‌ఎన్‌ఎల్’ తాజాగా కొత్త ప్లాన్‌ను ఆవిష్కరించింది. నెలకు రూ.97కే అపరిమిత కాల్స్‌తో పాటు కొంత డేటాను అందిస్తోంది. అయితే ఇది అందరికీ కాదండోయ్.. మైక్రోమాక్స్ 4జీ వీవోఎల్‌టీఈ ఫీచర్ ఫోన్ ‘భారత్–1’ను కొన్నవారికే.
ఈ ఫోన్ ధర 2,200. తాజా కొత్త పథకాల వల్ల బీఎస్‌ఎన్‌ఎల్ సబ్‌స్క్రైబర్లు మరింత పెరుగుతారని, అలాగే సంస్థ ఆర్థికంగా కూడా బలోపేతమౌతుందని టెలికం మంత్రి మనోజ్ సిన్హా ధీమా వ్యక్తంచేశారు. ‘దన్‌తేరాస్ సందర్భంగా దేశీ మొబైల్ హ్యాడ్‌సెట్స్ తయారీ కంపెనీ మైక్రోమాక్స్‌తో జతకట్టడం ఆనందంగా ఉంది.
గ్రామీణ ప్రాంతాల్లోని యూజర్లకు చేరువకావడానికి ఈ భాగస్వామ్యం దోహదపడుతుంది’ అని బీఎస్‌ఎన్‌ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనుపమ్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ఒప్పందంలో భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్.. అపరిమిత కాల్స్, డేటాతోపాటు రోమింగ్‌లో ఉన్నప్పుడు ఉచిత ఇన్‌కమింగ్, ఔట్‌గోయింగ్ కాల్స్‌ను కూడా అందిస్తుందని మైక్రోమాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ తెలిపారు.
మైక్రోమాక్స్ ఫోన్లు అక్టోబర్ 20 నుంచి వినియోగదారులకు అందు బాటులో ఉంటాయని చెప్పారు. కాగా బీఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుతం 3జీ సర్వీసులనే అందిస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి 4జీ సేవలను ప్రారంభించనుంది. డిజిటల్ కంటెంట్ ప్రొవైడర్ ఎక్స్‌ట్రామార్క్స్‌తో భాగస్వామ్యంతో బీఎస్‌ఎన్‌ఎల్ ఆన్‌లైన్ ఎడ్యుకేషన్ సేవలను అందిస్తోంది. మనోజ్ సిన్హా ఈ సేవలను ఆవిష్కరించారు.
Comments
Please login to add a commentAdd a comment