
ఆఫ్‌లైన్‌లోకి యూ టెలీవెంచర్స్!
మైక్రోమ్యాక్స్ అనుబంధ సంస్థ యూ టెలీవెంచర్స్ కూడా షావోమి, మోటరోలా దారిలోనే నడుస్తోంది.
రిలయన్స్ రిటైల్‌తో జట్టు
న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ అనుబంధ సంస్థ యూ టెలీవెంచర్స్ కూడా షావోమి, మోటరోలా దారిలోనే నడుస్తోంది. యూ టెలీవెంచర్స్ తన యూ బ్రాండ్ మొబైల్ హ్యాండ్‌సెట్లను ఆఫ్‌లైన్ మార్కెట్‌లో విక్రయించడానికి సన్నద్ధమయ్యింది. ఆఫ్‌లైన్ విక్రయాల కోసం రిలయన్స్ రిటైల్‌తో జతకడుతున్నట్లు యూ టెలీవెంచర్స్ ప్రకటించింది.
ఈ భాగస్వామ్యం వల్ల యూఫోరియా, యురేకా ప్లస్, యూనిక్యూ వంటి హ్యాండ్‌సెట్లు దేశవ్యాప్తంగా 30,000 రిటైల్ ఔట్‌లెట్ల ద్వారా వినియోగదారులకు అందుబాటులోకి రానున్నాయి. వినియోగదారులకు యూ బ్రాండ్ హ్యాండ్‌సెట్లను మరింత చేరువచేసే లక్ష్యంతోనే తాము ఈ చర్య తీసుకున్నామని యూ టెలీవెంచర్స్ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ తెలిపారు. రిలయన్స్ రిటైల్ ఇటీవలే 1.5 లక్షల రిటైల్ ఔట్‌లెట్స్, 1,200 డిస్ట్రిబ్యూటర్ల ఏర్పాటు ద్వారా తన నెట్‌వర్క్‌ను మరింత బలోపేతం చేసుకుంది.