మైక్రోమ్యాక్స్ డివైస్‌లపై ఉచితంగా ఇంటర్నెట్ | BSNL, Micromax partner to drive data usage in India | Sakshi
Sakshi News home page

మైక్రోమ్యాక్స్ డివైస్‌లపై ఉచితంగా ఇంటర్నెట్

Published Wed, Sep 17 2014 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:28 PM

మైక్రోమ్యాక్స్ డివైస్‌లపై ఉచితంగా ఇంటర్నెట్

మైక్రోమ్యాక్స్ డివైస్‌లపై ఉచితంగా ఇంటర్నెట్

న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ సంస్థ విక్రయించే ఆరు ఎంపిక చేసిన డివైస్‌ల ద్వారా ఉచిత ఇంటర్నెట్ యాక్సెస్ పొందవచ్చు. ఈ మేరకు ప్రభుత్వ రంగ టెలికాం సర్వీసుల సంస్ధ, బీఎస్‌ఎన్‌ఎల్‌తో ఒప్పందం కుదుర్చుకున్నామని మైక్రోమ్యాక్స్ సీఈఓ వినీత్ తనేజా చెప్పారు. ఈ ఒప్పందంలో భాగంగా 3 నెలలకు 2జీబీ డేటా చొప్పున ఏడాది పాటు ఇంటర్నెట్ ఉచితమని వివరించారు.

ఫీచర్ ఫోన్లపై ఉచిత వాయిస్ కాల్స్(నెట్‌పై) పొందవచ్చని పేర్కొన్నారు. మైక్రోమ్యాక్స్ ఎక్స్070, ఎక్స్088 (ఫీచర్ ఫోన్లు), ఏ37, ఏ37బి (స్మార్ట్‌ఫోన్‌లు), పీ410ఐ (ట్యాబ్లెట్), ఎంఎంఎక్స్377జీ(డేటాకార్డ్)లకు ఈ ఆఫర్‌లు వర్తిస్తాయని వివరించారు. ఈ ఆఫర్‌తో వినియోగదారులకు హై స్పీడ్ 3జీ డేటాను అందిస్తామని బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీ ఏఎన్ రాయ్ చెప్పారు. ఇప్పటికే 2,300కు పైగా నగరాల్లో 3జీ సర్వీసులందిస్తున్నామని, మరిన్ని నగరాలకు ఈ సర్వీసులందజేస్తామని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement