న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 14 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పరిధిలో, 50 పట్టణాల్లో 5జీ సేవలు నవంబర్ 26 నాటికి అందుబాటులోకి వచ్చాయని కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి దేవసిన్హ చౌహాన్ రాజ్యసభకు తెలిపా రు.
అక్టోబర్ 1 నుంచి 5జీ సేవలను టెలికం కంపెనీలు ప్రారంభించినట్టు చెప్పారు. 5జీ టెలికం సేవలు వేగంగా విస్తరించేందుకు తగిన చర్యలను ప్రభుత్వం తీసుకున్నట్టు పేర్కొన్నారు.
అలాగే, ప్రభుత్వరంగ టెలికం కంపెనీ బీఎస్‌ఎన్‌ఎల్ ఒక లక్ష 4జీ సైట్ల కోసం అక్టోబర్‌లో టెండర్ విడుదల చేసినట్టు తెలిపారు. బీఎస్‌ఎన్‌ఎల్ కోసం 5జీ స్పెక్ట్రమ్‌ను రిజర్వ్ చేసి ఉంచినట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment