మైక్రోమ్యాక్స్ కాన్వాస్‌లో తొలి ట్యాబ్లెట్ పీసీ
మైక్రోమ్యాక్స్ సంస్థ కాన్వాస్ సిరీస్‌లో తొలి ట్యాబ్లెట్ పీసీ. కాన్వాస్ ట్యాబ్ పి650ని బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది.
న్యూఢిల్లీ: మైక్రోమ్యాక్స్ సంస్థ కాన్వాస్ సిరీస్‌లో తొలి ట్యాబ్లెట్ పీసీ. కాన్వాస్ ట్యాబ్ పి650ని బుధవారం మార్కెట్లోకి విడుదల చేసింది. 8 అంగుళాల ఐపీఎస్ డిస్‌ప్లే ఉన్న ఈ ట్యాబ్లెట్ ధర రూ.16,500, ఆండ్రాయిడ్ 4.2 జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే ఈ ట్యాబ్లెట్‌లో 1.2 గిగాహెర్ట్స్ క్వాడ్ కోర్ ప్రాసెసర్, 1జీబీ ర్యామ్, 16 జీబీ ఇన్‌బిల్ట్ మెమరీ, 32 జీబీ వరకూ ఎక్స్‌పాండ్ చేసుకోగల మెమరీ, 5 మెగా పిక్సెల్ ఆటో ఫోకస్ రియర్ కెమెరా, 2 మెగా పిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయి.
సిమ్ సపోర్ట్ ఉన్న ఈ ట్యాబ్లెట్ పీసీలో వాయిస్ కాలింగ్ ఫీచర్ ఉంది. వై-ఫై, బ్లూటూత్, జీపీఎస్, 3జీలను సపోర్ట్ చేస్తుంది. కాన్వాస్ 4 స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న కొన్ని ఫీచర్లు-వీడియో పిన్నింగ్, పాప్-అప్ బ్రౌజర్ వంటివి ఉన్నాయి. స్పుల్, ఎం సెక్యూరిటీ, మ్యూజిక్ హబ్, ఒపెరా మిని వంటి యాప్స్ ప్రి లోడెడ్‌గా ఉన్నాయి. నీలం, తెలుపు రంగుల్లో ఈ ట్యాబ్లెట్‌లు లభ్యమవుతాయి. ఈ తాజా ట్యాబ్లెట్‌తో భారత ట్యాబ్లెట్ మార్కెట్లో తమ వాటా మరింత పెరుగుతుందని మైక్రోమ్యాక్స్ కో-ఫౌండర్ రాహుల్ శర్మ అభిప్రాయపడ్డారు.