అదరగొట్టే ఫీచర్లతో మైక్రోమ్యాక్స్‌ కొత్త ఫోన్‌ | Micromax launches 'Canvas Infinity Pro' | Sakshi
Sakshi News home page

అదరగొట్టే ఫీచర్లతో మైక్రోమ్యాక్స్‌ కొత్త ఫోన్‌

Published Tue, Dec 5 2017 9:15 AM | Last Updated on Tue, Dec 5 2017 12:05 PM

Micromax launches 'Canvas Infinity Pro' - Sakshi

దేశీయ మొబైల్ తయారీ సంస్థ మైక్రోమ్యాక్స్ తన కొత్త స్మార్ట్‌ఫోన్ 'కాన్వాస్ ఇన్ఫినిటీ ప్రొ'ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఎడ్జ్‌-టూ-ఎడ్జ్‌ డిస్‌ప్లే, డ్యూయల్‌ సెల్ఫీ కెమెరాలతో రూ.13,999కు ఈ స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్ సైట్‌పై ఈ నెల 6 నుంచి విక్రయానికి రానుంది. ఈ ఫోన్‌లో 5.7 ఇంచ్ భారీ డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. మరోవైపు ఇది బెజెల్ లెస్ డిస్‌ప్లే అయినందున యూజర్లకు ఫోన్ తెరను చూసేటప్పుడు ఫుల్ వ్యూ అనుభూతి కలుగుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో కీ ఫీచర్లుగా పోర్ట్రైట్‌ మోడ్‌, ఫేస్‌ బ్యూటీ, ఆటో సీన్‌ డిటెక్షన్‌, ఫేస్‌ గ్యాలరీ, టేల్‌ ఆల్బమ్‌లున్నాయి. 

మైక్రోమ్యాక్స్ కాన్వాస్ ఇన్ఫినిటీ ప్రొ ఫీచర్లు...
5.7 అంగుళాల ఫుల్‌ విజన్‌ డిస్‌ప్లే
1440 X 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్
1.5 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 430 ప్రాసెసర్
4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్
128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 7.1 నోగట్
డ్యుయల్ సిమ్
16 మెగాపిక్సల్ వెనుక కెమెరా
20, 8 మెగాపిక్సల్‌తో డ్యుయల్ సెల్ఫీ కెమెరాలు
 ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2
 3000 ఎంఏహెచ్ బ్యాటరీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement