సాక్షి, న్యూఢిల్లీ : భారత్ - చైనా సరిహద్దు వివాదం, చైనా దిగుమతులు, వస్తువులను బ్యాన్ చేయాలన్న డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో రీ ఎంట్రీకి సిద్ధ మవుతోంది. తాజాగా మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను దేశీయంగా విడుదల చేయాలని యోచిస్తోంది.
ఒకప్పుడు భారతదేశంలో ప్రసిద్ధ బ్రాండ్‌గా ఉన్న మైక్రోమాక్స్ చైనా ఫోన్ల కంపెనీల దూకుడుతో వెనక్కి తగ్గింది. అయితే ప్రస్తుత పరిస్థితులలో బడ్జెట్ ఫోన్లతో వినియోగదారులను ఆకర్షించనుంది. మోడ్రన్ లుక్, ప్రీమియం ఫీచర్లతో మూడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ల ధర 10వేల రూపాయల లోపు ఉంటుందని అంచనా గత అక్టోబర్ లో సంస్థ లాంచ్ చేసిన చివరి స్మార్ట్‌ఫోన్ ఐఓన్ నోట్. దీని ధర 8,199 రూపాయలు.
కొత్త ఫోన్లలో ప్రీమియం ఫీచర్లతో కూడిన బడ్జెట్ ఫోన్ కూడా ఉందని సంస్థ తన అధికారిక సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపింది. త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నామని మైక్రోమ్యాక్స్ వెల్లడించింది. అంతర్గతంగా చాలా కృషి చేస్తున్నాం..త్వరలోనే ఒక బిగ్ లాంచింగ్ తో వస్తున్నాం...వేచి ఉండండి! అంటూ వినియోగదారుల్లో ఒకరికి మైక్రోమాక్స్ సమాధానం ఇచ్చింది. మేడ్ బై ఇండియన్, మేడ్ ఫర్ ఇండియన్ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ట్వీట్ చేసింది. ఇంతకు మించి వివరాలను వెల్లడించలేదు.
A device with premium features, thoroughly modern look and budget friendly, how does that sound Nani Kishor?🙂 Stay tuned. #Micromax #MadeByIndian #MadeForIndian
— Micromax India (@Micromax_Mobile) June 18, 2020
Comments
Please login to add a commentAdd a comment