indo-china
-
కాలి నడకన ఇళ్లకు.. 18 మంది మిస్సింగ్! ఒకరు మృతి
అరుణాచల్ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో భారత్-చైనా సరిహద్దు సమీపంలో 19 మంది కార్మికులు అదృశ్యమయ్యారు. వీరిలో ఓ కార్మికుడు విగతజీవుడై కనిపించాడు. వీరంతా ఈనెల 5వ తేదీన అరుణాచల్ ప్రదేశ్‌లోని కురుంగ్ కుమే జిల్లాలో రోడ్డు నిర్మాణ పనులకు వెళ్లి కనిపించకుండాపోయారు. అదృశ్యమైన కార్మికులు అసోం రాష్ట్రానికి చెందినవారు. కార్మికులు కనిపించకుండా పోయి 14 రోజులైంది. ప్రాజెక్ట్ సమీపంలోని ఓ నది వద్ద ఒక మృతదేహం కనిపించింది. దీంతో కాంట్రాక్టర్ పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్(బీఆర్ఓ) ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల భారీ నిర్మాణాలను చేపడుతుంది. ఇండో చైనా సరిహద్దుకు సమీపంలో ఉన్న గ్రామీణ ప్రాంతమైన డామిన్ సర్కిల్లో రహదారి పనులను పూర్తి చేయడానికి ఈ కూలీలు పనికి వచ్చారు. అయితే ఈద్ జరుపుకోవడానికి తమకు సెలవు ఇవ్వాలని కార్మికులు కాంట్రాక్టర్ బెంగియా బడోను వేడుకున్నారు. కానీ కాంట్రాక్టర్ అనుమతి ఇవ్వలేదు. దీంతో కార్మికులు కాలినడకన ఇళ్లకు వెళ్లినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు. కురుంగ్ కుమే జిల్లాలోని దట్టమైన అడవిలో కనిపించకుండా పోయారని పోలీసులు తెలిపారు. ఇప్పటి వరకు ఆ 18 మంది ఎక్కడ ఉన్నారనే విషయమై ఇంకా ఆచూకీ లభ్యం కాలేదు. కూలీలంతా డామిన్ నదిలో మునిగిపోయారా అనే కోణంలో కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. వీరి ఆచూకీని కనిపెట్టేందుకు ఓ రెస్క్యూ టీం పనిచేస్తుందని పోలీసులు వెల్లడించారు. చదవండి: డీఎస్పీని హత్య చేసిన ట్రక్కు డ్రైవర్ అరెస్టు.. ఎన్కౌంటర్లో దిగిన బుల్లెట్! -
సరిహద్దు ఉద్రిక్తత : రాజ్‌నాథ్ కీలక ప్రకటన
సాక్షి, న్యూఢిల్లీ : భారత్-చైనా సరిహద్దులో పరిస్థితులపై రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కీలక ప్రకటన చేశారు. తూర్పు లడఖ్‌లో ఇరుదేశాల సైనిక బలగాల ఉపసంహరణ దిశగా చర్చలుకొనసాగుతున్నాయని పార్లమెంట్లో గురువారం వెల్లడించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తెరపడేలా చైనాతో కీలక ఒప్పందం చేసుకున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ మూరకు చైనా రక్షణమంత్రితో చర్చించల అనంతరం, పూర్తిస్థాయిలో సైనిక బలగాల ఉపసంహరణపై అంగీకారం కుదిరిందని ప్రకటించారు. మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేయనున్నామని రాజ్‌నాథ్ రాజ్యసభకు వివరించారు. దీంతో భారత, చైనా సరిహద్దుల్లో గతకొన్ని నెలలుగా కొనసాగుతున్న ఉద్రికత్తకు ఎట్టకేలకు తెరపడినట్టయింది. (చైనా బలగాల ఉపసంహరణ ప్రారంభం) చైనాకు ఒక్క అంగుళం భూమి కూడా వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేసిన ఆయన సైనికులు అత్యంత ధైర్య సాహసాలు ప్రదర్శించారంటూ భారత జవాన్లపై ప్రశంసలు కురిపించారు. మూడు సిద్ధాంతాల ఆధారంగా సమస్య పరిష్కరించుకోవాలని చైనాకు సూచించామనీ రక్షణమంత్రి వెల్లడించారు. ఏ దేశమైనా ఏకపక్షంగా వాస్తవ నియంత్రణ రేఖను మార్చే ప్రయత్నం చేయకూడదనీ ఇరువైపుల నుంచి ప్రయత్నాలు ఉంటేనే ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగుతాయన్నారు. లడఖ్ సరిహద్దులో కొనసాగుతున్న ప్రతిష్టంభనకు తెరపడేలా బలగాల ఉపసంహరణపై చైనాతో కీలక ఒప్పందానికొచ్చామనీ ఈ ఒప్పందంతో ఇరుదేశాలు దశల వారీగా పరస్పర సమస్వయంతో బలగాలను ఉపసంహరించుకోనున్నాయని ఆయన తెలిపారు. ప్యాంగ్యాంగ్ సరస్సుకు ఉత్తరాన ఉన్న ఫింగర్ 8 వద్ద చైనా బలగాలు ఉంటాయి. భారత బలగాలు ఫింగర్ 2 వద్ద ఉన్న పర్మనెంట్ బేస్ వద్ద ఉంటాయని రాజ్‌నాథ్ సింగ్ పేర్కొన్నారు. ‘తూర్పు లడఖ్‌లో ప్రస్తుత పరిస్థితి’ పై రాజ్‌నాథ్ సింగ్ ఈ రోజు సాయంత్రం 5.00 గంటలకు లోక్‌సభలో ఒక ప్రకటన చేయనున్నారని రక్షణ మంత్రి కార్యాలయం వెల్లడించింది. -
ఎల్ఏసీ వద్ద పాకిస్తాన్ సైనికులు!
న్యూఢిల్లీ/లేహ్: భారత్–చైనా సరిహద్దు అయిన వాస్తవాధీన రేఖ(ఎల్ఏసీ) వద్ద చైనా సైన్యంతోపాటు దాని సన్నిహిత మిత్ర దేశం పాకిస్తాన్ సైనికులు కూడా తిష్ట వేశారా? చైనాకు మద్దతుగా వారు కూడా పహారా కాస్తున్నారా? చైనా జర్నలిస్టు షెన్ షెవీ శనివారం షేర్ చేసిన ఓ వీడియోను గమనిస్తే ఇది నిజమేనని స్పష్టమవుతోంది. 52 సెకన్ల నిడివి గల ఈ వీడియోలో చైనా సైనికులతోపాటు గుబురు గడ్డంతో ఉన్న మరో సిపాయి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాడు. అతడి రూపురేఖలు, ఎత్తు, దేహ దారుఢ్యం వంటివి చైనా పౌరుల కంటే పూర్తి భిన్నంగా ఉన్నాయి. ఎల్ఏసీ వద్ద చైనాకు సాయంగా పాకిస్తాన్ సైన్యం సైతం రంగంలోకి దిగిందని పలువురు భావిస్తున్నారు. అలాగే పాకిస్తాన్ సైనికులకు చైనా శిక్షణ ఇస్తోందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇటీవల సరిహద్దులో భారత్–చైనా సైనికుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతున్న సంగతి తెలిసిందే. 12న భారత్–చైనా ఆర్మీ ఏడో రౌండ్ చర్చలు న్యూఢిల్లీ: తూర్పు లద్దాఖ్‌లో నెలలుగా కొనసాగుతున్న ప్రతిష్టంభనను తొలగించుకునే దిశగా భారత్–చైనా ఆర్మీ ఏడో దఫా చర్చలు ఈ నెల 12వ తేదీన జరగనున్నాయి.తూర్పు లద్దాఖ్‌లోని ఉద్రిక్త ప్రాంతాల నుంచి ఇరు దేశాలు సైన్యాలను ఉపసంహరించుకునే కచ్చితమైన రోడ్ మ్యాప్ రూపొందించడమే ఈ సమావేశం ఎజెండా అని విశ్వసనీయ వర్గాల సమాచారం. సెప్టెంబర్ 21వ తేదీన జరిగిన చర్చల్లో సరిహద్దుల్లోకి మరిన్ని అదనపు బలగాలను పంపించరాదనే నిర్ణయంతోపాటు పలు కీలక అంశాల్లో ఏకాభిప్రాయం సాధించారు. సైన్యం, వైమానిక దళం ఉమ్మడి కార్యాచరణ తూర్పు లద్దాఖ్‌లో చైనా సైన్యం దూకుడును అడ్డుకోవాలని భారత సైన్యం నిర్ణయించింది. వైమానిక దళంతో కలిసి ఉమ్మడి కార్యాచరణ చేపట్టాలని భావి స్తోంది. సరిహద్దులో చెలరేగిపోతున్న చైనా సైనికులకు తగిన గుణపాఠం నేర్పడానికి భారత సైన్యం, వైమానిక దళం సన్నద్ధమ వుతున్నాయి. త్రివిధ దళాలను ఎప్పటి కప్పుడు సమన్వయ పరుస్తూ ముందుకు నడిపించడానికి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సూచనలతోనే సైన్యం, వైమానిక దళం కలిసి పని చేయనున్నాయి. లేహ్ ఎయిర్ ఫీల్డ్‌లో ఇప్పటికే వైమానిక దళం యుద్ధ విమానాలను మోహరించింది. వాస్తవా« దీన రేఖ(ఎల్ఏసీ) వద్ద పరిస్థితి మరింత దిగజారితే వెంటనే ఉమ్మడిగా కొన్ని ఆపరేషన్లు చేపట్టడానికి సైన్యం, వైమానిక దళం ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. -
చైనాతో రెండు యుద్ధాలు : వెనక్కి తగ్గేది లేదు
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ - చైనా సరిహద్దులో ఉద్రిక్తత నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. పొరుగు దేశం చైనాతో దేశం రెండు యుద్ధాలు చేస్తోందని వ్యాఖ్యానించారు. ఒకటి చైనా సరిహద్దులో, రెండవది చైనా నుంచి వ్యాపించిన కరోనాతో పోరాడుతోందన్నారు. అయితే ఈ రెండు యుద్ధాల్లోనూ భారత్ గెలుస్తుందంటూ ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అటు సరిహద్దులో సైనికులు, ఇటు కరోనాపై పోరులో వైద్యులు ముందుండి పోరాడుతున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. (మూడురెట్లు పెరిగిన టెస్టింగ్ సామర్థ్యం) చైనాతో ప్రస్తుతం రెండు యుద్ధాలు చేస్తున్నామంటూ కేజ్రీవాల్ హిందీలో ట్విట్ చేశారు. లద్దాఖ్ సరిహద్దులో 20 మంది జవాన్లు వెన్నుచూపకుండా ధీరత్వాన్ని చూపారు. అదే తరహాలో తాము కూడా కరోనాను అంత మొందించేదాకా వెనక్కి తగ్గమన్నారు. ఈ పోరులో విజయం సాధిస్తామన్నారు. అంతేకాదు రాజకీయాలకు ఇది సమయం కాదనీ, ఐక్యంగా ఈ యుద్ధాలను గెలవాలని కేజ్రీవాల్ పిలుపు నిచ్చారు. ఢిల్లీలో కరోనా విస్తరణ, కట్టడిపై సీఎం కేజ్రీవాల్ మీడియాకు వివరాలు వెల్లడించారు. కరోనా పరీక్షలను మూడు రెట్లు పెంచామని చెప్పారు. అంతకుముందు రోజుకు 5,000 పరీక్షలు నిర్వహించగా, ప్రస్తుతం దాదాపు 18 వేల పరీక్షలు చేస్తున్నట్టు తెలిపారు. అలాగే హోమ్ క్వారంటైన్లో చికిత్స పొందుతున్న వారికి ఆక్సిజన్ స్థాయిలను మానిటర్ చేసేందుకు పల్స్ ఆక్సీమీటర్లు అందిస్తారు చెప్పారు. आज हम चीन के ख़िलाफ़ दो युद्ध लड़ रहे हैं - भारत चीन बॉर्डर पर और चीन से आए वाइरस के ख़िलाफ़। हमारे 20 वीर जवान पीछे नहीं हटे। हम भी पीछे नहीं हटेंगे और दोनों युद्ध जीतेंगे। https://t.co/DaBag9jkIk — Arvind Kejriwal (@ArvindKejriwal) June 22, 2020 -
సెన్సెక్స్ తొలి నిరోధం 34,220
కోవిడ్ కేసులు పెరుగుతున్నా, ఇండో–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు నెలకొన్నా, గతవారం పెద్ద ఎత్తున జరిగిన షార్ట్ కవరింగ్ ప్రభావంతో దేశీయ మార్కెట్ హఠాత్ ర్యాలీ జరిపింది. ప్రధాన కార్పొరేట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుస పెట్టుబడుల ప్రవాహాన్ని ఆకర్షిస్తున్నతీరు, రూ.1,620 సమీపంలో ట్రిపుల్టాప్ను ఆ షేరు ఛేదించిన శైలిని పరిశీలిస్తే....ఈ జూన్ డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపులోపు మరింత పెరిగే అవకాశాలు కన్పిస్తున్నాయి. ఈ షేరుకు సూచీల్లో వున్న అధిక వెయిటేజి కారణంగా మార్కెట్ర్యాలీ కూడా కొనసాగే ఛాన్సుంది. అలాగే గత శుక్రవారం వడ్డీ ప్రభావిత రంగాలైన బ్యాంకింగ్, ఫైనాన్షియల్స్, ఆటో, రియాల్టీ షేర్లు కూడా ర్యాలీలో పాలుపంచుకున్నందున, అనూహ్య పరిణామాలేవీ చోటుచేసుకోకపోతే.... ఇప్పటికే బాగా పెరిగివున్న ఇతర ప్రపంచ ప్రధాన మార్కెట్లు బలహీనంగా ట్రేడయినా, భారత్ సూచీలు మరికొంతశాతం పెరిగే అవకాశాలు ఎక్కువగా కన్పిస్తున్నాయి. ఇక సాంకేతిక అంశాలకొస్తే.... సెన్సెక్స్ సాంకేతికాంశాలు... జూన్ 19తో ముగిసినవారం ప్రధమార్థంలో 32,923 పాయింట్ల వరకూ తగ్గిన బీఎస్ఈ సెన్సెక్స్...ద్వితీయార్థంలో జోరుగా ర్యాలీ సాగించి 34,848 పాయింట్ల గరిష్టస్థాయికి ర్యాలీ జరిపింది. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 951 పాయింట్ల భారీ లాభంతో 34,732 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం అప్ట్రెడ్ కొనసాగితే సెన్సెక్స్ తొలుత 34,930 పాయింట్ల స్థాయిని అధిగమించాల్సివుంటుంది. అటుపైన వేగంగా 35,260 పాయింట్ల స్థాయిని అందుకోవొచ్చు. ఈ స్థాయిపైన ముగిస్తే 35,920 పాయింట్ల స్థాయికి చేరవచ్చు. సెన్సెక్స్ ఈ ఏడాది జనవరి20న సాధించిన 42,274 పాయింట్ల రికార్డు గరిష్టం నుంచి మార్చి 24 నాటి 25,639 పాయింట్ల కనిష్టస్థాయివరకూ జరిగిన పతనానికి 61.8 శాతం రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 35,920 పాయింట్ల వద్ద రానున్న రోజుల్లో సెన్సెక్స్‌కు గట్టి అవరోధం కలగవచ్చు. ఈ స్థాయిని ఛేదిస్తే రానున్న కొద్దిరోజుల్లో 36,950 పాయింట్ల వద్దకు పెరగవచ్చు. ఈ వారం తొలి అవరోధస్థాయిని అధిగమించలేకపోయినా, బలహీనంగా మొదలైనా 34,135 పాయింట్ల వద్ద తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే 33,370 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున తిరిగి 32,920 పాయింట్ల స్థాయిని పరీక్షించవచ్చు. నిఫ్టీ తొలి నిరోధం 10,330 గతవారం ఎన్ఎస్ఈ నిఫ్టీ అనూహ్యంగా 10,272 పాయింట్ల వరకూ ర్యాలీ జరిపి. చివరకు అంతక్రితంవారంతో పోలిస్తే 272 పాయింట్ల లాభంతో 10,244 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ వారం అప్‌ట్రెండ్ కొనసాగాలంటే నిఫ్టీ 10,330 పాయింట్ల స్థాయిని అధిగమించాల్సివుంటుంది. ఈ స్థాయిని దాటితే 61.8 శాతం ఫిబోనకి రిట్రేస్‌మెంట్ స్థాయి అయిన 10,550 పాయింట్ల వరకూ ర్యాలీ జరిగే ఛాన్స్ వుంటుంది. ఈ స్థాయి వద్ద ఎదురుకాబోయే గట్టి నిరోధాన్ని సైతం అధిగమిస్తే క్రమేపీ 10,750 పాయింట్ల వరకూ ర్యాలీ కొనసాగవచ్చు. ఈ వారం నిఫ్టీ తొలి నిరోధాన్ని దాటలేకపోయినా, బలహీనంగా మొదలైనా 10,070 పాయింట్ల సమీపంలో తొలి మద్దతు లభిస్తున్నది. ఈ మద్దతు దిగువన ముగిస్తే 9,845 పాయింట్ల వరకూ తగ్గవచ్చు. ఈ లోపున 9,725 పాయింట్ల వరకూ క్షీణించవచ్చు. – పి. సత్యప్రసాద్ -
చైనా బ్యాన్ : మైక్రోమాక్స్ రీఎంట్రీ
సాక్షి, న్యూఢిల్లీ : భారత్ - చైనా సరిహద్దు వివాదం, చైనా దిగుమతులు, వస్తువులను బ్యాన్ చేయాలన్న డిమాండ్ ఊపందుకున్న నేపథ్యంలో దేశీయ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మైక్రోమాక్స్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో రీ ఎంట్రీకి సిద్ధ మవుతోంది. తాజాగా మూడు కొత్త స్మార్ట్ఫోన్లను దేశీయంగా విడుదల చేయాలని యోచిస్తోంది. ఒకప్పుడు భారతదేశంలో ప్రసిద్ధ బ్రాండ్‌గా ఉన్న మైక్రోమాక్స్ చైనా ఫోన్ల కంపెనీల దూకుడుతో వెనక్కి తగ్గింది. అయితే ప్రస్తుత పరిస్థితులలో బడ్జెట్ ఫోన్లతో వినియోగదారులను ఆకర్షించనుంది. మోడ్రన్ లుక్, ప్రీమియం ఫీచర్లతో మూడు కొత్త స్మార్ట్ఫోన్లను లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్ఫోన్ల ధర 10వేల రూపాయల లోపు ఉంటుందని అంచనా గత అక్టోబర్ లో సంస్థ లాంచ్ చేసిన చివరి స్మార్ట్‌ఫోన్ ఐఓన్ నోట్. దీని ధర 8,199 రూపాయలు. కొత్త ఫోన్లలో ప్రీమియం ఫీచర్లతో కూడిన బడ్జెట్ ఫోన్ కూడా ఉందని సంస్థ తన అధికారిక సామాజిక మాధ్యమాల వేదికగా తెలిపింది. త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్నామని మైక్రోమ్యాక్స్ వెల్లడించింది. అంతర్గతంగా చాలా కృషి చేస్తున్నాం..త్వరలోనే ఒక బిగ్ లాంచింగ్ తో వస్తున్నాం...వేచి ఉండండి! అంటూ వినియోగదారుల్లో ఒకరికి మైక్రోమాక్స్ సమాధానం ఇచ్చింది. మేడ్ బై ఇండియన్, మేడ్ ఫర్ ఇండియన్ అనే హ్యాష్‌ట్యాగ్‌లతో ట్వీట్ చేసింది. ఇంతకు మించి వివరాలను వెల్లడించలేదు. A device with premium features, thoroughly modern look and budget friendly, how does that sound Nani Kishor?🙂 Stay tuned. #Micromax #MadeByIndian #MadeForIndian — Micromax India (@Micromax_Mobile) June 18, 2020 -
సరిహద్దు ఉద్రిక్తత: రామమందిర ట్రస్టు కీలక నిర్ణయం
లక్నో: గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా ఘాతుకాన్ని నిరసిస్తూ దేశ వ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. డ్రాగన్ దుశ్చర్య కారణంగా అమరులైన సైనికుల త్యాగాన్ని కీర్తిస్తూ దేశ ప్రజలు వారికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ క్రమంలో అయోధ్యలో హిందూ సంస్థలు(హిందూ మహాసభ, విశ్వ హిందూ పరిషత్) చైనా తీరును ఖండిస్తూ పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. ఇందులో భాగంగా చైనా జెండా, ఆ దేశ అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టి బొమ్మలు, చైనా ఉత్పత్తులను దహనం చేస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. వీర మరణం పొందిన జవాన్లకు నివాళి అర్పిస్తూ... అయోధ్య రామమందిర నిర్మాణాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు వెల్లడించింది. సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొన్న నేపథ్యంలో దేశానికి మద్దతుగా నిలబడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. (చైనా ఆక్రమించినవి స్వాధీనం చేసుకుంటాం) ఈ విషయం గురించి ట్రస్టు సభ్యుడు అనిల్ మిశ్రా పీటీఐతో మాట్లాడుతూ.. దేశ పరిస్థితులకు అనుగుణంగా మందిర నిర్మాణ ప్రారంభ ప్రక్రియ విషయంలో తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికార ప్రకటన వెలువడుతుందని పేర్కొన్నారు. కాగా అయోధ్యలో రామ మందిరానికి జూన్10వ తేదీన పునాదులు వేస్తున్నట్టు గుడి ట్రస్ట్ అధికార ప్రతినిధి ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. గత నవంబర్‌లో సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు నేపథ్యంలో రామజన్మభూమిలో న్యాయస్థానం కేటాయించిన స్థలంలోని కుబేర్ మందిరంలో శివుడి ప్రార్థనలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నట్టు వెల్లడించారు. కాగా సోమవారం నాటి ఘటనలో 20 భారత సైనికులు అమరులైన నేపథ్యంలో నిర్మాణాన్ని వాయిదా వేస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.(చైనా వస్తువుల బహిష్కరణకు సిద్ధమే..కానీ) -
చైనా వస్తువుల బహిష్కరణకు సిద్ధమే..కానీ
సాక్షి, న్యూఢిల్లీ : గాల్వాన్ లోయలో డ్రాగన్ దుశ్చర్య, తరువాత ఇండియాలో చైనా వస్తువులను బహిష్కరించాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. ముఖ్యంగా ఢిల్లీలోని డిఫెన్స్ కాలనీవాసులు చైనా వస్తువులపై ఏకంగా "యుద్ధం" ప్రకటించారు. ఇంట్లోని ప్రతి చైనా వస్తువును రోడ్డుపైకి విసిరేయాలని రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మేజర్ రంజిత్ సింగ్ పిలుపునిచ్చారు. దురదృష్టవశాత్తు తుపాకులు, బుల్లెట్లతో ప్రత్యక్షంగా చైనాపై యుద్ధానికి దిగలేకపోయినా వస్తువులు బహిష్కరణ ద్వారా చైనా ఆర్థిక మూలాలను దెబ్బతీయాలన్నారు. అయితే ఈ పిలుపునకు పెద్దగా స్పందన రాలేదు. పైగా ఎయిర్ కండిషన్డ్ గదుల్లో కూర్చుని యుద్ధ నినాదాలు ఇవ్వడం సరైంది కాదంటూ డిఫెన్స్ కాలనీకి చెందిన భవ్రీన్ కంధారి విమర్శించారు. (చైనా ఉత్పత్తులపై నిషేధం) మరోవైపు ఢిల్లీలోని అతిపెద్ద హోల్ సేల్ మార్కెట్ గా పేరుగాంచిన సదర్ బజార్ వ్యాపారులు భిన్నంగా స్పందించారు. చైనా వస్తువుల బహిష్కరణకు సంసిద్దతను వ్యక్తం చేస్తూనే కొన్ని షరతులతో మాత్రమే ఇది సాధ్యమవుతుందని తేల్చి చెప్పారు. సదర్ బజార్ ట్రేడర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజేందర్ శర్మమాట్లాడుతూ, తాము కూడా చైనా ఉత్పత్తుల నిషేధానికి సిద్ధమే. 'హిందీచీనీ బైబై' నినాదానికి తమ మద్దతు ఉంటుంది, కానీ ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం, చిన్నతరహా పరిశ్రమలకు ప్రోత్సహకాలతోపాటు, అధికారుల దాడులు, ఇతర వేధింపులనుంచి తమకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. (చైనాకు షాక్ : చైనా పరికరాల వాడకం తగ్గించండి!) దాదాపు 70 శాతం ఎలక్ట్రికల్ వస్తువులు చైనానుంచే వస్తాయనీ మరో వ్యాపారి తరుణ్ గార్గ్ తెలిపారు. ముఖ్యంగా దీపావళి సందర్భంగా బిలియన్ డాలర్ల విలువైన కొనుగోళ్లు జరుపుతామని వెల్లడించారు. అనేక మేడ్ ఇన్ ఇండియా వస్తువులకు సంబంధించిన విడిభాగాలు కూడా చైనా నుండే దిగుమతి అవుతాయన్నారు. దాదాపు 40 వేల దుకాణాలను కలిగి ఉన్న సదర్ బజార్లో అలంకరణ వస్తువులు, బొమ్మలు, గడియారాలు, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఇలా దాదాపు ప్రతీది చైనానుంచి దిగుమతి అయినవే ఉంటాయన్నారు. దీంతో చైనా ఉత్పత్తుల బహిష్కరణ, దిగుమతులపై నిషేధం సాధ్యమేనా అనే ప్రశ్న కూడా వివిధ వర్గాల నుంచి వ్యక్తమవుతోంది. కాగా దేశీయంగా 7 కోట్ల మంది వ్యాపారులు, 40 వేల ట్రేడ్ అసోసియేషన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (సీఐఐటి) చైనా దిగుమతులను బ్యాన్ చేయాలని పిలుపు నిచ్చింది. వచ్చే ఏడాది చివరి నాటికి చైనా దిగుమతులు 13 బిలియన్ డాలర్లు తగ్గించాలంటూ ఒక ప్రచారాన్ని కూడా ప్రారంభించింది. అంతేకాదు బాలీవుడ్ నటులు అమితాబ్ బచ్చన్, అక్షయ్ కుమార్, మహేంద్ర సింగ్ ధోని, సచిన్ టెండూల్కర్ వంటి క్రికెటర్లు చైనా ఉత్పత్తులకు ప్రచారం చేయొద్దని కోరింది. ప్రస్తుతం, ప్రతి ఏటా చైనా నుంచి దేశానికి దిగుమతి అయ్యే వస్తువుల విలువ 70 బిలియన్ డాలర్లకు పై మాటే. -
చైనాకు షాకివ్వనున్న భారత్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ - చైనా సరిహద్దు ఉద్రిక్తత, నెట్వర్క్ సెక్యూరిటీ సమస్యల నేపథ్యంలో భారత ప్రభుత్వం చైనాకు షాకివ్వనుంది. ముఖ్యంగా ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్) 4జీ అప్‌గ్రేడ్‌లో చైనా పరికరాల వినియోగాన్ని నిషేధించనుంది. బీఎస్ఎన్ఎల్ తో పాటు ఎంటీఎన్ఎల్, ఇతర అనుబంధ సంస్థలకు కూడా ఇదే ఆదేశాలిచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. అంతేకాదు, ఈ పనులకు సంబంధించి పాత టెండర్లను రద్దు చేసి రీ-టెండరింగ్ కు కూడా వెళ్లనుంది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం బీఎస్ఎన్ఎల్ సంస్థలో మేడ్-ఇన్-చైనా పరికరాల వినియోగాన్ని తగ్గించాలని టెలికం విభాగం నిర్ణయించింది. కేంద్రం ప్రభుత్వం ‘ఆత్మ నిర్భర్ భారత్’ లో భాగంగా ‘మేడ్ ఇన్ ఇండియా’ వస్తువులను కొనుగోలు చేయమని తన పరిధిలోని అన్ని సంస్థలకు ఆదేశాలు జారీ చేయనుంది. ఈ మేరకు ప్రైవేట్ టెలికం సంస్థలు కూడా చైనా సంస్థలు ఉత్పత్తి చేసే పరికరాలపై ఆధారపడటాన్ని తగ్గించాలంటూ ఆదేశించనుంది. అలాగే టెండర్ల ప్రక్రియలో చైనా కంపెనీలు పాల్గొనలేని విధంగా నిబంధనలను మార్చాలని రాష్ట్రంలోని సర్వీసు ప్రొవైడర్లను కోరడంతోపాటు, మునుపటి టెండర్లన్నింటినీ రద్దు చేయాలని కోరనుంది. కాగా లద్దాఖ్‌లోని గాల్వన్ లోయలో చైనా దుశ్చర్య కారణంగా 20 మంది భారత జవాన్లు చనిపోయిన నేపథ్యంలో కేంద్రం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు చైనాను ఆర్థికంగా దెబ్బతీసేందుకు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (క్యాట్) కూడా సిద్ధమయ్యింది. చైనాకు సంబంధించిన 500 వస్తువుల జాబితాను సిద్ధం చేసిన సంగతి తెలిసిందే. అటు చైనా ఉత్పత్తులను నిషేధించాలన్న డిమాండ్ దేశవ్యాప్తంగా ఊపందుకుంది. ట్విటర్లో 'హిందీచీనిబైబై', 'భారత్ వెర్సస్ చైనా వంటి హ్యాష్‌ట్యాగ్‌లు ట్రెండింగ్‌లో ఉన్నాయి. -
అఖిలపక్ష భేటీ పెట్టండి: కాంగ్రెస్
న్యూఢిల్లీ: గాల్వన్ లోయ ఘటనపై ప్రధాని మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ మౌనం వహించడాన్ని మంగళవారం ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. దేశ ప్రజలకు పూర్తి సమాచారం ఇవ్వాలని డిమాండ్ చేశాయి. చైనాతో ఘర్షణల్లో భారత సైన్యం అమరులు కావడం దిగ్భ్రాంతికి గురి చేసిందని కాంగ్రెస్ పేర్కొంది. దీనిపై ప్రధాని వివరణ ఇవ్వాలంది. దేశం కోసం ప్రాణాలర్పించిన జవాన్ల త్యాగం గురించి తన బాధను వ్యక్తం చేసేందుకు మాటలు లేవని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ అఖిలపక్ష భేటీ నిర్వహించి అన్ని వివరాలను వారితో పంచుకోవాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సింగ్ సూర్జేవాలా డిమాండ్ చేశారు. ఏప్రిల్ నుంచే చైనా లద్దాఖ్‌లో దుందుడుకుగా వ్యవహరిస్తున్నా.. మోదీ ప్రభుత్వం చూస్తు కూర్చుందని మండిపడ్డారు. చైనా చర్యను తీవ్రంగా తీసుకుని సరైన రీతిలో స్పందించాలని పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ కోరారు. చర్చల ద్వారా ప్రస్తుత ప్రతిష్టంభన తొలగుతుందని తాము విశ్వసిస్తున్నట్లు సీపీఐ పేర్కొంది. 20 మంది సైనికులను చైనా చంపేసిందంటే లద్దాఖ్‌లో సరిహద్దుల వద్ద పరిస్థితి ఎంత సీరియస్‌గా ఉందో అర్థమవుతుందని నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశ సరిహద్దులు సురక్షితంగా ఉంటాయని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. దేశ భౌగోళిక సమగ్రతపై రాజీ లేదని స్పష్టం చేశారు. -
‘చైనా మన భూభాగాన్నిఆక్రమించిందా?’
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి, కేంద్రానికి మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం రాహుల్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మీద ప్రశ్నల వర్షం కురిపించారు. లడాఖ్‌లో భారత భూభాగాన్ని చైనీయులు ఆక్రమించుకున్నారా ఏంటి చెప్పాలి అని ప్రశ్నించారు. ‘రాజ్‌నాథ్ సింగ్ హస్తం గుర్తుపై కామెంట్ చేసిన తర్వాత ఈ ప్రశ్నకు సమాధానం చెప్తారు. లడాఖ్‌లో చైనా భారత భూభాగాన్ని ఆక్రమించిందా ఏంటి’ అని రాహుల్ ట్వీట్ చేశారు. భారత్ - చైనా సరిహద్దుల్లో గత నెల రోజులుగా ఉద్రిక్త వాతావారణం నెలకొన్న సంగతి తెలిసిందే. చర్చల ద్వారా ఈ ప్రతిష్టంభనను ముగింపు పలకాలని ఇరుదేశాలు నిర్ణయించి, ఆ దిశగా ముందుకెళుతున్నాయి. (డ్రాగన్ అంతపని చేసిందా..?) ఈ నేపథ్యంలో ఆదివారం నాడు ‘బిహార్ జన్‌సంవద్ వర్చువల్ ర్యాలీ’లో భాగంగా అమిత్ షా మాట్లాడుతూ.. పుల్వామా, ఉరి ఉగ్రదాడుల తర్వాత సర్జికల్, ఎయిర్ స్ట్రయిక్స్ ద్వారా భారత్ రక్షణ విధానంపై బలమైన సందేశం పంపిందని, సరిహద్దులను ఎలా రక్షించుకోగలమో చెప్పిందన్నారు. ‘సరిహద్దుల్లో నెలకొన్న వాస్తవ పరిస్థితులు ఏంటో అందరికీ తెలుసు. హృదయాన్ని సంతోషంగా ఉంచడానికి మంచి ఆలోచన అవసరం’ అని రాహుల్ ఎద్దేవా చేశారు. ప్రముఖ ఉర్దూ-పర్షియా కవి మీర్జా గలీబ్ రాసిన కవితను రాహుల్ తన ట్వీట్లో వాడారు. దీనిపై రాజ్‌నాథ్ సింగ్ స్పందిస్తూ.. 20 వ శతాబ్దపు కవి మంజార్ లఖ్నవి రచించిన కవితను పోస్ట్ చేశారు. ‘చేతికి నొప్పి అయితే మందు తీసుకుంటాం.. కానీ చేయ్యే నొప్పికి కారణం అయితే ఏం చేస్తాం’ అంటూ ఓ కవితను ట్వీట్ చేశార. అయితే దీనిలో రాజ్‌నాథ్ సింగ్ 'హృదయం' ఉన్న చోట 'చేతి'ని మార్చి ట్వీట్ చేశారు. मिर्ज़ा ग़ालिब का ही शेर थोड़ा अलग अन्दाज़ में है। ‘ ‘हाथ’ में दर्द हो तो दवा कीजै, ‘हाथ’ ही जब दर्द हो तो क्या कीजै.. https://t.co/k1fhnI6K4N — Rajnath Singh (@rajnathsingh) June 8, 2020 -
సరిహద్దు ఉద్రిక్తత : మోదీ, ట్రంప్ చర్చ
సాక్షి, న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ సంభాషణ ఇపుడు హాట్ టాపిక్ గా మారింది. ఇండో-చైనా వివాదం తదితర సమస్యలపై ఇరువురు నేతలు చర్చించారని ప్రభుత్వం ఒక ప్రకటనలో తెలిపింది. అటు మిత్రుడు ట్రంప్‌తో ఫలవంతమైన చర్చలు జరిగాయనీ, కోవిడ్-19, జీ7 సహా వివిధ అంశాలపై చర్చించామని స్వయంగా ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. భారత్, చైనా వాస్తవాధీన రేఖ వెంబడి సైన్యం మోహరింపు, ఉద్రిక్తతల నడుమ వీరి చర్చలకు ప్రాధాన్యం ఏర్పడింది. అయితే తూర్పు లదాఖ్ ప్రతిష్టంభనపై ఇరువురు నాయకులు చర్చపై ప్రత్యేక వివరణ లేకవడం గమనార్హం. ఇరు దేశాలలో కరోనా పరిస్థితి, ప్రపంచ ఆరోగ్య సంస్థలో సంస్కరణల అవసరం లాంటి సమస్యలపై ఇరువురు చర్చించారని ప్రభుత్వ ప్రకటన వివరించింది. జార్జ్ హత్యోందంతపై అమెరికాలో ప్రస్తుతం జరుగుతున్న ప్రజాందోళనలపై మోదీ ఆందోళన వ్య క్తం చేశారని, సమస్య త్వరగా సమసిపోవాలని ఆకాంక్షించారనీ, అలాగే అమెరికాలో జరిగే జీ7 సదస్సుకు మోదీని ట్రంప్ ఆహ్వానించినట్లు పేర్కొంది. ప్రస్తుత సభ్యత్వానికి మించి దీని పరిధిని విస్తరించాలని, భారతదేశంతో సహా ఇతర ముఖ్యమైన దేశాలను చేర్చాలని కోరుకున్నారని ప్రభుత్వం తెలిపింది. (మోదీపై విశ్వాసం: టాప్-5లో సీఎం జగన్) కాగా చైనా-భారత్ సరిహద్దు వివాదంపై ఇరుదేశాలు కోరుకుంటే తాను మధ్యవర్తిత్వం చేయడానికి సిధ్దమని, దీనిపై మోదీకి ఫోన్ చేస్తే ఆయన మంచి మూడ్ లో లేరని ట్రంప్ గత వారం ప్రకటించారు. అయితే ఇటీవలి కాలంలో ట్రంప్, మోదీ మధ్య అలాంటి చర్చలేవీ జరగలేదని కేంద్రం స్పష్టతనిచ్చింది. మరోవైపు ఈ సమస్యను సామరస్యపూరకంగా పరిష్కరించుకుంటామని భారత్, చైనా ప్రకటించాయి. అంతేకాదు చైనా మరో అడుగు ముందుకేసి ఈ విషయంలో ట్రంప్ జోక్యం అవసరం లేదని తెగేసి చెప్పింది. అటు కరోనా వ్యాప్తిపైమొదటినుంచీ చైనా మండిపడుతున్న ట్రంప్, డబ్ల్యూహెచ్ఓపై సరిగ్గా వ్యవహరించలేదని ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత వారం సంబంధాలను తెంచుకున్నట్టు ట్రంప్ ప్రకటించిన సంగతి విదితమే. (డబ్ల్యూహెచ్ఓతో సంబంధాలు రద్దు : ట్రంప్) Had a warm and productive conversation with my friend President @realDonaldTrump. We discussed his plans for the US Presidency of G-7, the COVID-19 pandemic, and many other issues. — Narendra Modi (@narendramodi) June 2, 2020 -
ఇక మన బాధలన్నీ మర్చిపోవచ్చు : ప్రశాంత్ కిషోర్
సాక్షి, న్యూఢిల్లీ: భారత్ -చైనా సరిహద్దు వివాదం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలపై రాజకీయ ప్రచార వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యంగ్యంగా స్పందించారు. ఇక మన బాధలన్నీ మర్చిపోయి నిశ్చింతగా ఉండొచ్చు...మన కష్టాలన్నీ అంతర్జాతీయ స్థాయికి వెళ్లినట్టుగా కనిపిస్తోందంటూ శుక్రవారం ట్వీట్ చేశారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మానసిక స్థితి గురించి ప్రపంచానికి తెలియజెప్పేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉన్నారంటూ ఆయన సెటైర్లు వేశారు (మధ్యవర్తిత్వంపై మోదీకి ఫోన్ చేశా : ట్రంప్) కాగా ఇండో-చైనా సరిహద్దు వివాదంపై మధ్యవర్తిత్వం వహించేందుకు ఉత్సాహంగా ఉన్న ట్రంప్, ఈ విషయంలో మోదీ మాట్లాడే మూడ్‌లో లేరంటూ వ్యాఖ్యానించారు. అయితే దీనిపై స్పందించిన భారత ప్రభుత్వం ప్రధాని మోదీ, ట్రంప్ మధ్య ఇటీవలి కాలంలో ఎలాంటి చర్చలు జరగలేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. (ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన) We can FORGET all our WORRIES as India seem to have truly ARRIVED at the global stage. We now have President of United States informing the world about the MOOD of our Prime Minister!! — Prashant Kishor (@PrashantKishor) May 29, 2020 -
ట్రంప్ వ్యాఖ్యలపై కేంద్రం స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఫోన్ లో మాట్లాడాను అన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలపై భారత ప్రభుత్వం స్పందించింది. లదాఖ్ ప్రతిష్టంభనపై ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ మధ్య ఎలాంటి చర్చలు జరగలేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టత నిచ్చాయి. కరోనావైరస్ చికిత్సకు మెరుగైన ఔషధంగా ట్రంప్ భావిస్తున్న యాంటి మలేరియా మందు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ను పంపాలని అమెరికా కోరినపుడు మాత్రమే మోదీ చివరిసారిగా మాట్లాడారని వివరణ ఇచ్చాయి. (మధ్యవర్తిత్వంపై మోదీకి ఫోన్ చేశా : ట్రంప్) భారత్, చైనా సరిహద్దు వివాదంలో ఇరు దేశాలు అంగీకరిస్తే మధ్య వర్తిత్వానికి తాను సిద్ధమనీ, దీనిపై మోదీ తో మాట్లాడినపుడు ఆయన మంచి మూడ్ లో లేరని ట్రంప్ వెల్లడించిన సంగతి తెలిసిందే. దీనిపై శుక్రవారం ఉదయం ప్రభుత్వం స్పందించింది. హైడ్రాక్సీక్లోరోక్విన్ అంశానికి సంబంధించి భారత ప్రధాని మోదీ, డొనాల్డ్ ట్రంప్ ఆఖరి సంభాషణ ఏప్రిల్ 4 జరిగిందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇద్దరు నాయకుల మధ్య ఇటీవలి కాలంలో ఎటువంటి పరస్పర చర్చలు జరగలేదని స్పష్టం చేశాయి. -
గర్ల్ డ్రాగన్
విభిన్నమైన చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తుంటారు దర్శక–నిర్మాత రామ్‌గోపాల్‌వర్మ. తాజాగా ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఎంటర్ ది గర్ల్ డ్రాగన్’. పూజా భలేకర్ ప్రధాన పాత్రధారిగా ఇండో–చైనీస్ సంయుక్త నిర్మాణంలో తెరకెక్కుతోన్న చిత్రం ఇది. ఈ ఏడాది జూన్‌లో ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘మార్షల్ ఆర్ట్స్‌కు గ్లామర్ మేళవించి ఓ కొత్త ట్రెండ్‌లో రామ్‌గోపాల్‌వర్మ రూపొందిస్తున్న చిత్రం ఇది. ఇందులో పూజా చేసే పోరాటాలు హైలైట్‌గా ఉంటాయి. ఇటీవల చైనాలో ఈ సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరించాం. తాజాగా ఈ చిత్రం వైజాగ్ షెడ్యూల్ ముగిసింది’’ అని చిత్రబృందం వెల్లడించింది. -
భారత్‌కు చైనా సరిహద్దు కాదన్న ట్రంప్
వాషింగ్టన్: పేరుకే అగ్రరాజ్యానికే అధ్యక్షుడే కానీ ఆయనకి భౌగోళిక సరిహద్దులపై కనీస అవగాహన కూడా లేదని తాజా పుస్తకం వెల్లడించింది. ఒకసారి చర్చల సందర్భంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోదీకే షాక్ ఇచ్చారట. ‘భారత్, చైనా సరిహద్దుల్ని పంచుకోవు కదా’అని ట్రంప్ వ్యాఖ్యానించడంతో మోదీ ఒక్కసారిగా అవాక్కయ్యారు. వాష్టింగ్టన్ పోస్టుకు చెందిన ఫిలిప్ రకర్, కరోల్ లియోన్నింగ్ తమ తాజా పుస్తకం ‘ఏ వెరీ స్టేబుల్ జీనియస్‘లో ఈ అంశాన్ని ప్రస్తావించినట్టు వాషింగ్టన్ పోస్ట్ కథనాన్ని ప్రచురించింది. ఆ పుస్తకంలో ఏముందంటే ‘‘ఒకసారి మోదీ, ట్రంప్ సమావేశంలో భారత్‌కు, చైనా సరిహద్దు కాదని ట్రంప్ అనడంతో మోదీ ఆశ్చర్యపోయారు. ట్రంప్ ఏ మాత్రం సీరియస్‌గా ఉన్నట్టు కనిపించడం లేదు. అని మోదీ ట్రంప్ సహాయకుడితో వ్యాఖ్యానించారు’’అని ఆ పుస్తకం పేర్కొంది. -
లొంగిపోయారో..లైఫ్ రిస్కే..!!
సాక్షి, న్యూఢిల్లీ: ‘హాయ్ నేనొక చైనా విద్యార్థిని. నా స్టడీలో భాగంగా ఇండో-చైనా సరిహద్దులపై ఒక వ్యాసం తయారు చేయాల్సివుంది. మీకు ఇబ్బంది లేదనుకుంటే.. వారి దైనందిన జీవితానికి సంబంధించి కొంత సమాచారం ఇస్తారా? నా నుంచి మీకేదైనా సహాయం అవసరమైతే చెప్పండి. తప్పక చేస్తాను’. ఇలాంటి మాటలతో భారత జవాన్లతో దాయాది దేశం పాకిస్తాన్, పొరుగునున్న చైనా దేశాల గూఢచర్యం ముఠాలు స్నేహం చేస్తున్నాయి. గత రెండు, మూడేళ్లుగా సోషల్ మీడియా కేంద్రంగా ఇలాంటి ధోరణి పెరిగిపోయిందనీ.. దేశ భద్రతకు ముప్పు వాటిల్లే మాదిరిగా సోషల్ మీడియా మారే ప్రమాదముందని భారతీయ పారామిలటరీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రీసర్చ్ స్కాలర్స్‌గా, టూరిస్టులుగా.. సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే భద్రతా సిబ్బందితో రీసర్చ్ స్కాలర్స్‌గా, టూరిస్టులుగా తమను తాము పరిచయం చేసుకుని స్నేహం పేరుతో చనువుగా ఉండి దేశ భద్రతకు సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని తస్కరించాలని చైనా, పాకిస్తాన్ గూఢచారులు యత్నిస్తున్నారని సోషల్‌మీడియా పర్యవేక్షణాధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ప్రధానంగా బీఎస్ఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, సీఆర్పీఎఫ్ భద్రతా దళాలపై ఈ విధమైన ఎత్తుగడలు సాగుతున్నాయని అధికారులు తెలిపారు. యూనిఫాంతో ఫోటోలు, వీడియోలు వద్దు.. ఉద్యోగ విషయాలు, వ్యక్తిగత సమాచారం సోషల్ మీడియాలో ఇతరులతో పంచుకోకపోవడమే ఉత్తమమని అధికారులు అంటున్నారు. యూనిఫాం ధరించి ఉన్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయొద్దని భద్రతా సిబ్బందికి నిపుణులు సూచిస్తున్నారు. కొత్త వ్యక్తుల నుంచి వచ్చే పోస్టుల పట్ల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్, ట్వీటర్, వీకాంటాక్ట్, క్యూజోన్, ఓడ్నోక్లాసినికి, లింక్డ్ఇన్, గూగుల్ ప్లస్ వంటి సోషల్ వేదికల పట్ల జాగ్రత్త వహించాలని హెచ్చరిస్తున్నారు. విదేశీ మహిళతో స్నేహం చేస్తూ.. సోషల్ మీడియాలో ఒక విదేశీ మహిళతో స్నేహం చేస్తూ.. దేశ భద్రతకు చెందిన సున్నితమైన సమాచారాన్ని తస్కరించే యత్నం చేశాడనే ఆరోపణలపై ఈ ఏడాది ప్రారంభంలో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ అధికారిని అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అయితే పటిష్టమైన సాంకేతిక వ్యవస్థ ఏర్పాటు వల్ల మళ్లీ అలాంటి ఉదంతాలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. సైనికుల కదలికలపై దృష్టి.. ‘ఇప్పటి వరకు మా పర్యవేక్షణా, నిఘాల్లో తేలింది ఏంటంటే.. మన దేశానికి చెందిన సున్నితమైన, ఆందోళనకరమైన ప్రదేశాల్లో ఎంతమంది సైనికులు పనిచేస్తున్నారు. ప్రధానంగా వారి కదలికలు ఏ వైపుగా సాగుతున్నాయి. భద్రతా బలగాలు ఉపయోగిస్తున్న ఆయుధ సామాగ్రి విశేషాలను తస్కరించే యత్నాలు సోషల్ వేదికల ద్వారా జరుగుతున్నాయ’ని సైబర్ పాలసీ అడ్వయిజర్ సుబీమల్ భట్టాచార్ జీ చెప్పారు. -
భారత్, చైనాల ‘సరిహద్దు’ చర్చలు
న్యూఢిల్లీ: భారత్, చైనా మధ్య 20వ దఫా సరిహద్దు చర్చలు శుక్రవారం జరిగాయి. ఇరు దేశాల ప్రత్యేక ప్రతినిధులు పాల్గొన్న ఈ సమావేశంలో రెండు దేశాల మధ్య పరస్పరం విశ్వాసం పెంపొందించే చర్యలపైనే ప్రధానంగా చర్చించారు. సరిహద్దు అంశంపై తుది తీర్మానానికి రాలేకపోయామని ఉభయ పక్షాలు అంగీకరించాయి. రెండు దేశాల సరిహద్దు ప్రాంతాల్లో శాంతి, సామరస్యం నెలకొనాలని, ఈ మేరకు అమలుచేయాల్సిన చర్యలపై ఆలోచనలను పంచుకున్నట్లు వెల్లడించాయి. చర్చల్లో వివాదాస్పద అంశమైన డోక్లాం ప్రస్తావన రాకపోవడం గమనార్హం. రోజంతా సుదీర్ఘంగా జరిగిన ఈ భేటీలో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, చైనా స్టేట్ కౌన్సెలర్ యంగ్ జీచితోపాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు. చర్చలపై చైనా విదేశాంగ ప్రతినిధి స్పందిస్తూ ‘ఇది సరిహద్దు అంశాలపై చర్చించేందుకు నిర్వహించిన సమావేశం మాత్రమే కాదు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక సమాచార మార్పిడికి సంబంధించిన ప్రధాన వేదిక కూడా’ అని అన్నారు. దోవల్, యంగ్ ఇద్దరూ భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసి చర్చల సారాంశాన్ని వివరించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ ఇండియా, చైనా మధ్య బలమైన సంబంధాలు ఉండటం ఇరు దేశాల ప్రజలకు ప్రయోజనకరమని, ఇది ప్రాంతీయంగా, అంతర్జాతీయంగానూ సత్ఫలితాలు ఇస్తుందని అభిప్రాయపడినట్లు భారత విదేశీ శాఖ వెల్లడించింది. భారత్, చైనా మధ్య జూన్ 16న తలెత్తిన డోక్లాం వివాదం ఆగస్టు 28న పరస్పర ఒప్పందంతో సమసింది. భూటాన్ సరిహద్దు ప్రాంతమైన డోక్లాంలో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ రహదారి నిర్మించేందుకు ప్రయత్నించగా భారత సైన్యం అడ్డుకుంది. దీంతో ఇరు దేశాల మధ్య రెండున్నర నెలలకు పైగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. -
యుద్ధాలతో ఏ దేశమూ అభివృద్ధి చెందలేదు
‘భారత-చైనా మిత్రమండలి’ జాతీయ మహాసభల్లో వక్తలు హైదరాబాద్: ప్రపంచంలో యుద్ధాలు, అల్లర్లు సృష్టించిన ఏ దేశమూ అభివృద్ధి పథంలో దూసుకెళ్లలేదని ‘భారత్-చైనా మిత్రమండలి’ పేర్కొంది. ఆసియా ఖండంలో సుస్థిరత, శాం తి స్థాపనకు భారత్-చైనా మైత్రి అత్యవసరమని స్పష్టం చేసింది. ‘భారత్-చైనా మిత్రమండలి’ జాతీయ మహాసభలు శనివారం బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య అవగాహన, మైత్రి పెంపొందించే లక్ష్యంతో పనిచేస్తున్న ఈ మండలి అధ్యక్షుడు, గాంధేయవాది పండిట్ సుందర్‌లాల్, కార్యదర్శి, ప్రముఖ చిత్రకారుడు తారాచంద్ అధ్యక్షతన సమావేశం జరిగిం ది. బీజింగ్‌కు చెందిన సీసీఏఎఫ్ఎఫ్సీ డిప్యూటీ జనరల్ ట్యాంగ్ రుమిన్, డిప్యూటీ డెరైక్టర్ లియా హాంగ్మిన్లు మాట్లాడుతూ... ‘భౌగోళికంగా అతిపెద్ద దేశాలైన భారత్, చైనాలు ప్రపంచ జనాభాలోనూ అత్యధిక శాతం (దాదాపు 270 కోట్లు) కలిగి ఉన్నాయి. సోషలిస్టు సమాజ నిర్మాణ మార్గంలో చైనా అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. భారత్ వంటి గొప్ప దేశంతో స్నేహ హస్తం అందుకోవడాన్ని స్వాగతిస్తున్నాం’ అన్నారు. ఆ దేశంలో వ్యవసాయానికి అంతటి ప్రాధాన్యమిస్తున్నారనే విషయాలను మన పాలకులు, ప్రజలు గుర్తించాలి’ అని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ చెప్పారు. నేపాల్- చైనా ఎగ్జిక్యూటివ్ మెంబర్ శంకర్‌పాండే మాట్లాడుతూ, ‘ఇరుదేశాల మధ్య అల్లర్లు సృష్టించి వైరం పెంచే ప్రయత్నం చేస్తున్నవారిని పక్కన పెట్టి అభివృద్ధి వైపు పరుగెడదాం. భారత్-చైనా-నేపాల్ మధ్య 200 కిలోమీటర్ల బ్రిడ్జితో సరిహద్దులు సరిచేసి స్నేహపూర్వకంగా ఉందాం’ అని సూచించారు. ‘భారత్, చైనా మధ్య స్నేహ, ఆర్థిక ఒప్పందం ఎంతో అవసరం. దేశభక్తి అంటే ప్రజలు సుఖసంతోషాలతో ఉండటమే కానీ అల్లర్లు సృష్టించడం కాదు’ అని ఐసీఎఫ్ఐ అధ్యక్షుడు చుక్కా రామయ్య అభిప్రాయపడ్డారు. ఏఎస్సీఐ జనరల్ డెరైక్టర్ రవికాంత్, మాజీ ఎంపీ, ఐసీఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు సోలిపేట రాంచంద్రారెడ్డి, జాతీయ అధ్యక్షుడు జి.ఎస్.నాగరాజు, ప్రముఖ కవి నిఖిలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.