‘భారత-చైనా మిత్రమండలి’ జాతీయ మహాసభల్లో వక్తలు
హైదరాబాద్: ప్రపంచంలో యుద్ధాలు, అల్లర్లు సృష్టించిన ఏ దేశమూ అభివృద్ధి పథంలో దూసుకెళ్లలేదని ‘భారత్-చైనా మిత్రమండలి’ పేర్కొంది. ఆసియా ఖండంలో సుస్థిరత, శాం తి స్థాపనకు భారత్-చైనా మైత్రి అత్యవసరమని స్పష్టం చేసింది. ‘భారత్-చైనా మిత్రమండలి’ జాతీయ మహాసభలు శనివారం బాగ్‌లింగంపల్లి ఆర్టీసీ కల్యాణ మండపంలో ప్రారంభమయ్యాయి. ఇరు దేశాల మధ్య అవగాహన, మైత్రి పెంపొందించే లక్ష్యంతో పనిచేస్తున్న ఈ మండలి అధ్యక్షుడు, గాంధేయవాది పండిట్ సుందర్‌లాల్, కార్యదర్శి, ప్రముఖ చిత్రకారుడు తారాచంద్ అధ్యక్షతన సమావేశం జరిగిం ది. బీజింగ్‌కు చెందిన సీసీఏఎఫ్‌ఎఫ్‌సీ డిప్యూటీ జనరల్ ట్యాంగ్ రుమిన్, డిప్యూటీ డెరైక్టర్ లియా హాంగ్‌మిన్‌లు మాట్లాడుతూ... ‘భౌగోళికంగా అతిపెద్ద దేశాలైన భారత్, చైనాలు ప్రపంచ జనాభాలోనూ అత్యధిక శాతం (దాదాపు 270 కోట్లు) కలిగి ఉన్నాయి. సోషలిస్టు సమాజ నిర్మాణ మార్గంలో చైనా అభివృద్ధి పథంలో దూసుకుపోతూ ప్రపంచంలో రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది.
భారత్ వంటి గొప్ప దేశంతో స్నేహ హస్తం అందుకోవడాన్ని స్వాగతిస్తున్నాం’ అన్నారు. ఆ దేశంలో వ్యవసాయానికి అంతటి ప్రాధాన్యమిస్తున్నారనే విషయాలను మన పాలకులు, ప్రజలు గుర్తించాలి’ అని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ చెప్పారు. నేపాల్- చైనా ఎగ్జిక్యూటివ్ మెంబర్ శంకర్‌పాండే మాట్లాడుతూ, ‘ఇరుదేశాల మధ్య అల్లర్లు సృష్టించి వైరం పెంచే ప్రయత్నం చేస్తున్నవారిని పక్కన పెట్టి అభివృద్ధి వైపు పరుగెడదాం. భారత్-చైనా-నేపాల్ మధ్య 200 కిలోమీటర్ల బ్రిడ్జితో సరిహద్దులు సరిచేసి స్నేహపూర్వకంగా ఉందాం’ అని సూచించారు. ‘భారత్, చైనా మధ్య స్నేహ, ఆర్థిక ఒప్పందం ఎంతో అవసరం. దేశభక్తి అంటే ప్రజలు సుఖసంతోషాలతో ఉండటమే కానీ అల్లర్లు సృష్టించడం కాదు’ అని ఐసీఎఫ్‌ఐ అధ్యక్షుడు చుక్కా రామయ్య అభిప్రాయపడ్డారు. ఏఎస్‌సీఐ జనరల్ డెరైక్టర్ రవికాంత్, మాజీ ఎంపీ, ఐసీఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు సోలిపేట రాంచంద్రారెడ్డి, జాతీయ అధ్యక్షుడు జి.ఎస్.నాగరాజు, ప్రముఖ కవి నిఖిలేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
యుద్ధాలతో ఏ దేశమూ అభివృద్ధి చెందలేదు
Published Sun, Mar 13 2016 2:34 AM | Last Updated on Sun, Sep 3 2017 7:35 PM
Advertisement
Advertisement