
మైక్రోమ్యాక్స్ నుంచి తొలి 4జీ స్మార్ట్‌ఫోన్
యురేకా@ రూ.8,999
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ కంపెనీ మైక్రోమ్యాక్స్ అనుబంధ సంస్థ యు తన తొలి 4జీ డివైస్, యురేకాను ఆవిష్కరించింది. శ్యానోజెన్ (ఈ ఓఎస్‌కు ఆండ్రాయిడ్ ఓఎస్ ఆధారం) ఆపరేటింగ్ సిస్టమ్‌పై పనిచేసే యురేకా మొబైల్ ధర రూ.8,999. జోరుగా వృద్ధి చెందుతున్న టెక్నాలజీ ఔత్సాహికుల సెగ్మెంట్‌ను దృష్టిలోపెట్టుకొని యురేకాఫోన్‌ను అందిస్తున్నట్లు మైక్రోమ్యాక్స్ సహ వ్యవస్థాపకుడు రాహుల్ శర్మ చెప్పారు.
అమెజాన్‌లో విక్రయం...
ఈ ఫోన్‌కు ఈ కామర్స్ సంస్థ అమెజాన్‌డాట్‌ఇన్‌లో ముందస్తు రిజిస్ట్రేషన్లు శుక్రవారం నుంచి ప్రారంభమవుతాయని, వచ్చే నెల రెండో వారం నుంచి విక్రయాలు ప్రారంభిస్తామని పేర్కొన్నారు. ఈ డ్యుయల్ సిమ్ 4జీ స్మార్ట్‌ఫోన్‌లో క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 615 ఆక్టకోర్ ప్రాసెసర్, 64 బిట్ మల్టీ-కోర్ సీపీయూ, 5.5 అంగుళాల హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే, 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమెరీ, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ మెమెరీ, 13 మెగా పిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 2,500 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. వచ్చే ఏడాది మార్చికల్లా యు బ్రాండ్ కింద మరిన్ని కొత్త స్మార్ట్‌ఫోన్‌లను అందిస్తామని పేర్కొన్నారు.