మైక్రోమ్యాక్స్ నుంచి సరికొత్త త్రీజీ కాలింగ్ ట్యాబ్
దేశీ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీ మైక్రోమ్యాక్స్ తాజాగా మరో ట్యాబ్లెట్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది. ఏడు అంగుళాల స్క్రీన్‌సైజుతో వస్తున్న ఈ ట్యాబ్ పీ470లో తెలుగుతోపాటు 21 భారతీయ భాషలకు సపోర్ట్ ఉండటం విశేషం. అంటే మనకు నచ్చిన ప్రాంతీయ భాషలో మెయిళ్లు, సోషల్ నెట్‌వర్కింగ్ పోస్టింగ్స్ సులువుగా చేసుకోవచ్చునన్నమాట. శక్తిమంతమైన 1.3 గిగాహెర్ట్జ్ డ్యుయెల్‌కోర్ ప్రాసెసర్ ఆధారంగా పనిచేస్తుంది. రెండు సిమ్‌ల ద్వారా ఫోన్, డేటా అందుకునే సౌకర్యముంది దీంట్లో.
ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తూనే 3200 ఎంఏహెచ్ బ్యాటరీని వాడటం ద్వారా అత్యధిక టాక్‌టైమ్, లేదా స్టాండ్‌బై టైమ్ లభించే అవకాశమేర్పడింది,. కంపెనీ అంచనాల ప్రకారం బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేస్తే 11 గంటల టాక్‌టైమ్, 158 గంటల స్టాండ్‌బై టైమ్ లభిస్తుంది. మెమరీ విషయానికి వస్తే దీంట్లో ర్యామ్ 1 జీబీ కాగా, ఇంటర్నల్ స్టోరేజీ 8 జీబీల దాకా ఉంటుంది. మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా మెమరీని 32 జీబీ వరకూ పెంచుకోవచ్చు. చివరగా ఈ ట్యాబ్లెట్‌లో ప్రధాన కెమెరా ఐదు, సెల్ఫీ కెమెరా 0.3 మెగాపిక్సెళ్ల రెజల్యూషన్ కలిగి ఉన్నాయి. ధర రూ.6999 మాత్రమే.