అత్యంత పలుచటి ట్యాబ్లెట్... | The most Thin tablet | Sakshi
Sakshi News home page

అత్యంత పలుచటి ట్యాబ్లెట్...

Published Wed, Jan 7 2015 12:06 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 PM

అత్యంత    పలుచటి ట్యాబ్లెట్...

అత్యంత పలుచటి ట్యాబ్లెట్...

కేవలం ఆరు మిల్లీమీటర్ల మందం మాత్రమే ఉండే అత్యంత పలుచటి ట్యాబ్లెట్‌ను డెల్ కంపెనీ వెన్యూ 87840 పేరుతో విడుదల చేసింది. అమెరికాలో దాదాపు రూ.24,500లకు లభ్యమవుతున్న ఈ ట్యాబ్లెట్ ఇతర దేశాల్లో లభ్యమవుతున్నదీ లేనిదీ ఇంకా స్పష్టం కావల్సి ఉంది. ఇంటెల్ సహకారంతో నిర్మించిన ఈ లేటెస్ట్ గాడ్జెట్‌లో ఏకంగా 2.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్‌ను ఉపయోగించడం విశేషం. డెస్క్‌టాప్ పీసీ సామర్థ్యానకి ఇది అతిదగ్గరగా ఉంటుంది. దీంతోపాటు పవర్ వీఆర్ గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్, రెండు గిగాబైట్ల ర్యామ్ ఉండటం వల్ల మల్టీటాస్కింగ్ సులువు అవుతుంది.

గ్రాఫిక్స్ మోతాదు ఎక్కువగా ఉండే గేమ్స్‌ను కూడా అడుకోవచ్చు. దీంట్లో ఎనిమిది మెగాపిక్సెళ్ల ప్రధాన కెమెరాను ఉపయోగించారు. ఇంటెల్ రియల్‌సెన్స్ ’త్రీడీ స్నాప్‌షాట్’ ఫొటోగ్రఫీ సొల్యూషన్‌తో ఫొటోలో మరింత స్పష్టంగా, డెప్త్ కలిగి ఉంటాయి. మెమరీ విషయానికొస్తే డెల్ వెన్యూ 8లో 16 జీబీల బిల్ట్ ఇన్ స్టోరేజీ ఉంటుంది. మైక్రోఎస్‌డీకార్డు ద్వారా దీన్ని మరింత పెంచుకోవచ్చు కూడా. స్క్రీన్‌సైజు 8.4 అంగుళాలు కాగా, రెజల్యూషన్ 2560 బై 1480 వరకూ ఉంటుంది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్‌ను ఉపయోగించారు దీంట్లో.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement