లెనవూ వాయిస్ టాబ్లెట్ ఏ8-50... | Lenavo voice tablet e850 | Sakshi
Sakshi News home page

లెనవూ వాయిస్ టాబ్లెట్ ఏ8-50...

Published Wed, Oct 8 2014 12:26 AM | Last Updated on Sat, Sep 2 2017 2:29 PM

లెనవూ వాయిస్ టాబ్లెట్ ఏ8-50...

లెనవూ వాయిస్ టాబ్లెట్ ఏ8-50...

ఎనిమిది అంగుళాల స్క్రీన్ సైజుతో చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లెనవూ తాజాగా ఓ టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఓ మోస్తరు ఫీచర్లతో మాత్రమే వస్తున్న ఈ సరికొత్త టాబ్లెట్ ధర మాత్రం రూ.17,999గా నిర్ణయించారు. సాధారణంగా టాబ్లెట్ స్క్రీన్ సైజు ఏడు, 9 అంగుళాలు ఉంటే ఇది ఈ రెండింటికీ మధ్యస్థంగా 8 అంగుళాలు ఉంది. ప్రాసెసర్ వేగం కూడా 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్. ర్యామ్ ఒక జీబీ ఉండగా ప్రధాన మెమరీ 16 జీబీ వరకూ ఉంది.

మైక్రోఎస్‌డీకార్డు ద్వారా మరో 32 జీబీల మెమరీని యాడ్ చేసుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 4200 ఎంఏహెచ్ కాబట్టి... రీఛార్జిల మధ్య ఎక్కువ సమయం ఉంటుంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ త్వరలోనే ఉచితంగా కిట్‌క్యాట్ ఓఎస్‌కు అప్‌గ్రేడ్ చేస్తామని కంపెనీ చెబుతోంది. లెనవూ ఏ8-50లో 5 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement