లెనవూ వాయిస్ టాబ్లెట్ ఏ8-50...
ఎనిమిది అంగుళాల స్క్రీన్ సైజుతో చైనా స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ లెనవూ తాజాగా ఓ టాబ్లెట్‌ను విడుదల చేసింది. ఓ మోస్తరు ఫీచర్లతో మాత్రమే వస్తున్న ఈ సరికొత్త టాబ్లెట్ ధర మాత్రం రూ.17,999గా నిర్ణయించారు. సాధారణంగా టాబ్లెట్ స్క్రీన్ సైజు ఏడు, 9 అంగుళాలు ఉంటే ఇది ఈ రెండింటికీ మధ్యస్థంగా 8 అంగుళాలు ఉంది. ప్రాసెసర్ వేగం కూడా 1.3 గిగాహెర్ట్జ్ క్వాడ్‌కోర్. ర్యామ్ ఒక జీబీ ఉండగా ప్రధాన మెమరీ 16 జీబీ వరకూ ఉంది.
మైక్రోఎస్డీకార్డు ద్వారా మరో 32 జీబీల మెమరీని యాడ్ చేసుకోవచ్చు. బ్యాటరీ సామర్థ్యం 4200 ఎంఏహెచ్ కాబట్టి... రీఛార్జిల మధ్య ఎక్కువ సమయం ఉంటుంది. ప్రస్తుతానికి ఆండ్రాయిడ్ జెల్లీబీన్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తున్నప్పటికీ త్వరలోనే ఉచితంగా కిట్‌క్యాట్ ఓఎస్‌కు అప్‌గ్రేడ్ చేస్తామని కంపెనీ చెబుతోంది. లెనవూ ఏ8-50లో 5 ఎంపీ ప్రధాన కెమెరా, 2 ఎంపీ సెల్ఫీ కెమెరాలు ఉన్నాయి.