ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్‌లో చౌక ఫోన్ | Android 4.4.3 KitKat Update: Leaked Firmware Changelog Hints Arrival of Nexus 8, Google TV | Sakshi
Sakshi News home page

ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్‌లో చౌక ఫోన్

Published Tue, May 13 2014 11:59 PM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM

ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్‌లో చౌక ఫోన్

ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్‌లో చౌక ఫోన్

 న్యూఢిల్లీ: మోటరొల మొబిలిటి కంపెనీ ఆండ్రాయిడ్ తాజా ఆపరేటింగ్ సిస్టమ్ కిట్‌క్యాట్‌పై పనిచేసే సరికొత్త మొబైల్ ఫోన్, ‘మోటో ఇ’ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది.  ఈ డ్యూయల్ సిమ్ మొబైల్ ధర రూ.6,999 అని మెటరోల మొబిలిటీ ఇండియా జీఎం అమిత్ బొని తెలిపారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌పై పనిచేసే ఫోన్లలో అత్యంత చౌకైన ఫోన్ ఇదే. ఈ డ్యూయల్ సిమ్ ఫోన్‌లో 1.2 గిగా హెర్ట్జ్ డ్యుయల్-కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ(32 జీబీ వరకూ విస్తరించుకోగల మెమరీ), 1,980 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు.

ఈ తాజా ఫోన్ కారణంగా భారత మార్కెట్లో తమ జోరు మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.  ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్‌కు మారాలనుకునే భారత వినియోగదారుల అవసరాలకనుగుణంగా ఇ ఫోన్‌ను రూ పొందించామన్నారుు. దేశీ మొబైల్ కంపెనీలు మైక్రోమ్యాక్స్, కార్బన్‌లకు ఈ ‘మోటో ఇ’ ఫోన్ గట్టి సవాల్‌నిస్తుందని అంచనా.

 ఆన్‌లైన్ విక్రయాలు అదుర్స్
 ఆన్‌లైన్ ద్వారా తమ మొబైళ్ల అమ్మకాలు జోరుగా ఉన్నాయని అమిత్ బొని పేర్కొన్నారు.  ఆన్‌లైన్ ద్వారానే 2 కోట్ల మొబైళ్లు విక్రయించామని వివరించారు. తాజాగా అందిస్తున్న మోటో ఇ అమ్మకాలు ఆన్‌లైన్‌లో ఈ ఒక్క వారంలోనే 5 లక్షలు ఉండొచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement