Moto e
-
శామ్సంగ్ను మించిన మైక్రోమ్యాక్స్
న్యూఢిల్లీ: శామ్సంగ్, నోకియా వంటి విదేశీ దిగ్గజాలకు గట్టిపోటీనిస్తున్న దేశీ సంస్థ మైక్రోమ్యాక్స్...తాజాగా వాటిని అధిగమించింది. ఏప్రిల్-జూన్ కాలానికి దేశీయంగా మార్కెట్వాటాలో శామ్సంగ్ను, ఫీచర్ఫోన్స్ విక్రయాల్లో నోకియాను దాటేసింది. అటు అంతర్జాతీయంగా అతి పెద్ద హ్యాండ్సెట్ బ్రాండ్స్‌లో 10వ స్థానాన్ని దక్కించుకుంది. మార్కెట్ రీసెర్చి సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వివరాలు.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశీయంగా మొబైల్స్ విక్రయాల్లో 16.6 శాతం మా ర్కెట్ వాటాతో మైక్రోమ్యాక్స్ అగ్రస్థానంలో నిల్చింది. ఆ తర్వాతి స్థానాల్లో శా మ్‌సంగ్ (14.4 శాతం వాటా), నోకియా (10.9%) కార్బన్ (9.5%)లు నిలిచాయి. ఇక ఫీచర్‌ఫోన్ల విక్రయాల్లో మైక్రోమ్యాక్స్ తొలిసారిగా నోకియాను అధిగమించింది. 15.2 శాతం మార్కెట్ వాటాతో దూసుకుపోయింది. నోకియా 14.7% వాటాతో రెండో స్థానంలో నిలిచింది. కార్బన్, శామ్సంగ్, లావా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నా యి. స్మార్ట్ఫోన్ల విభాగంలో మైక్రోమ్యాక్స్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నప్పటికీ 19% మార్కెట్ వాటాతో రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 25.3% వాటాతో శామ్సంగ్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. -
ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్‌లో చౌక ఫోన్
న్యూఢిల్లీ: మోటరొల మొబిలిటి కంపెనీ ఆండ్రాయిడ్ తాజా ఆపరేటింగ్ సిస్టమ్ కిట్క్యాట్పై పనిచేసే సరికొత్త మొబైల్ ఫోన్, ‘మోటో ఇ’ను మంగళవారం మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ డ్యూయల్ సిమ్ మొబైల్ ధర రూ.6,999 అని మెటరోల మొబిలిటీ ఇండియా జీఎం అమిత్ బొని తెలిపారు. ఆండ్రాయిడ్ కిట్‌క్యాట్ ఓఎస్‌పై పనిచేసే ఫోన్లలో అత్యంత చౌకైన ఫోన్ ఇదే. ఈ డ్యూయల్ సిమ్ ఫోన్లో 1.2 గిగా హెర్ట్జ్ డ్యుయల్-కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 4 జీబీ ఇంటర్నల్ మెమరీ(32 జీబీ వరకూ విస్తరించుకోగల మెమరీ), 1,980 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 మెగా పిక్సెల్ రియర్ కెమెరా వంటి ప్రత్యేకతలున్నాయని వివరించారు. ఈ తాజా ఫోన్ కారణంగా భారత మార్కెట్లో తమ జోరు మరింత పెరుగుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఫీచర్ ఫోన్ల నుంచి స్మార్ట్‌ఫోన్‌కు మారాలనుకునే భారత వినియోగదారుల అవసరాలకనుగుణంగా ఇ ఫోన్‌ను రూ పొందించామన్నారుు. దేశీ మొబైల్ కంపెనీలు మైక్రోమ్యాక్స్, కార్బన్లకు ఈ ‘మోటో ఇ’ ఫోన్ గట్టి సవాల్నిస్తుందని అంచనా. ఆన్లైన్ విక్రయాలు అదుర్స్ ఆన్లైన్ ద్వారా తమ మొబైళ్ల అమ్మకాలు జోరుగా ఉన్నాయని అమిత్ బొని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారానే 2 కోట్ల మొబైళ్లు విక్రయించామని వివరించారు. తాజాగా అందిస్తున్న మోటో ఇ అమ్మకాలు ఆన్లైన్లో ఈ ఒక్క వారంలోనే 5 లక్షలు ఉండొచ్చని ఆయన ధీమా వ్యక్తం చేశారు.