శామ్‌సంగ్‌ను మించిన మైక్రోమ్యాక్స్ | Micromax overtakes Samsung to become leading India handset vendor in Q2 | Sakshi
Sakshi News home page

శామ్‌సంగ్‌ను మించిన మైక్రోమ్యాక్స్

Published Tue, Aug 5 2014 3:16 AM | Last Updated on Sat, Sep 2 2017 11:22 AM

శామ్‌సంగ్‌ను మించిన మైక్రోమ్యాక్స్

శామ్‌సంగ్‌ను మించిన మైక్రోమ్యాక్స్

 న్యూఢిల్లీ: శామ్‌సంగ్, నోకియా వంటి విదేశీ దిగ్గజాలకు గట్టిపోటీనిస్తున్న దేశీ సంస్థ మైక్రోమ్యాక్స్...తాజాగా వాటిని అధిగమించింది. ఏప్రిల్-జూన్ కాలానికి దేశీయంగా మార్కెట్‌వాటాలో శామ్‌సంగ్‌ను, ఫీచర్‌ఫోన్స్ విక్రయాల్లో నోకియాను దాటేసింది. అటు అంతర్జాతీయంగా అతి పెద్ద హ్యాండ్‌సెట్ బ్రాండ్స్‌లో 10వ స్థానాన్ని దక్కించుకుంది. మార్కెట్ రీసెర్చి సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.

 వివరాలు..
 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో  దేశీయంగా మొబైల్స్ విక్రయాల్లో  16.6 శాతం మా ర్కెట్ వాటాతో మైక్రోమ్యాక్స్ అగ్రస్థానంలో నిల్చింది. ఆ తర్వాతి స్థానాల్లో  శా మ్‌సంగ్ (14.4 శాతం వాటా), నోకియా (10.9%) కార్బన్ (9.5%)లు నిలిచాయి.  ఇక ఫీచర్‌ఫోన్ల విక్రయాల్లో మైక్రోమ్యాక్స్ తొలిసారిగా నోకియాను అధిగమించింది. 15.2 శాతం మార్కెట్ వాటాతో  దూసుకుపోయింది. నోకియా 14.7% వాటాతో రెండో స్థానంలో నిలిచింది. కార్బన్, శామ్‌సంగ్, లావా  ఆ తర్వాత స్థానాల్లో ఉన్నా యి. స్మార్ట్‌ఫోన్ల విభాగంలో మైక్రోమ్యాక్స్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నప్పటికీ 19% మార్కెట్ వాటాతో రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 25.3% వాటాతో శామ్‌సంగ్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement