Moto G
-
బడ్జెట్ ఫోన్లు.. 108 మెగా పిక్సల్ క్వాడ్ కెమెరా
న్యూఢిల్లీ: మోటరోలా మధ్య శ్రేణి బడ్జెట్లో రెండు జీ సిరీస్ స్మార్ట్ఫోన్లను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. మోటో జీ60, మోటో జీ40 ఫ్యూజన్ పేరుతో విడుదల చేసిన ఈ ఫోన్ల ప్రారంభ ధర రూ.12,999గా ఉంది. మోటో జీ60: 108 మెగా పిక్సల్ క్వాడ్ కెమెరా వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. ఫొటోలు మరింత స్పష్టంగా వచ్చేందుకు అల్ట్రా పిక్సల్ టెక్నాలజీని ఇందులో ప్రవేశపెట్టారు. ముందు భాగంలో 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఆండ్రాయిడ్ 11పై పనిచేస్తుంది. 6జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీతో ఒకే రకం ఇందులో అందుబాటులో ఉంటుంది. మోటో జీ40 ఫ్యూజన్ ఇందులోనూ 120 గిగాహెర్జ్ 6.8 అంగుళాల హెచ్డీఆర్ 10 డిస్ప్లేను ఏర్పాటు చేశారు. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 732 జీ ప్రాసెసర్ ఉంది. వెనుక భాగంలో 64 మెగాపిక్సల్ ప్రధాన కమెరాగా క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. జీ40 ఫ్యూజన్ 4జీబీ/64జీబీ రకం ధర రూ.13,999. 6జీబీ/128జీబీ ధర రూ.15,999. ఐసీఐసీఐ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.1,000 తగ్గింపు లభించనుంది. మోటో జీ60 ధర రూ.17,999. ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 27 మధ్యాహ్నం 12 గంటలకు ఆరంభ విక్రయాలు ఉంటాయి. ఐసీఐసీఐ బ్యాంకు కార్డుతో కొనుగోలు చేసిన వారికి అప్పటికప్పుడే రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. -
శామ్సంగ్ను మించిన మైక్రోమ్యాక్స్
న్యూఢిల్లీ: శామ్సంగ్, నోకియా వంటి విదేశీ దిగ్గజాలకు గట్టిపోటీనిస్తున్న దేశీ సంస్థ మైక్రోమ్యాక్స్...తాజాగా వాటిని అధిగమించింది. ఏప్రిల్-జూన్ కాలానికి దేశీయంగా మార్కెట్వాటాలో శామ్సంగ్ను, ఫీచర్ఫోన్స్ విక్రయాల్లో నోకియాను దాటేసింది. అటు అంతర్జాతీయంగా అతి పెద్ద హ్యాండ్సెట్ బ్రాండ్స్‌లో 10వ స్థానాన్ని దక్కించుకుంది. మార్కెట్ రీసెర్చి సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వివరాలు.. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో దేశీయంగా మొబైల్స్ విక్రయాల్లో 16.6 శాతం మా ర్కెట్ వాటాతో మైక్రోమ్యాక్స్ అగ్రస్థానంలో నిల్చింది. ఆ తర్వాతి స్థానాల్లో శా మ్‌సంగ్ (14.4 శాతం వాటా), నోకియా (10.9%) కార్బన్ (9.5%)లు నిలిచాయి. ఇక ఫీచర్‌ఫోన్ల విక్రయాల్లో మైక్రోమ్యాక్స్ తొలిసారిగా నోకియాను అధిగమించింది. 15.2 శాతం మార్కెట్ వాటాతో దూసుకుపోయింది. నోకియా 14.7% వాటాతో రెండో స్థానంలో నిలిచింది. కార్బన్, శామ్సంగ్, లావా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నా యి. స్మార్ట్ఫోన్ల విభాగంలో మైక్రోమ్యాక్స్ తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నప్పటికీ 19% మార్కెట్ వాటాతో రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 25.3% వాటాతో శామ్సంగ్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. -
మార్కెట్లోకి మోటో జీ స్మార్ట్‌ఫోన్
న్యూఢిల్లీ: దాదాపు రెండేళ్ల విరామం అనంతరం మోటరోలా తమ కొత్త హ్యాండ్‌సెట్‌ను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మోటో జీ స్మార్ట్‌ఫోన్‌ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో 8 జీబీ వెర్షన్ ధరను రూ. 12,499గాను, అలాగే 16 జీబీ వెర్షన్ రేటును రూ. 13,999గాను నిర్ణయించింది. గురువారం నుంచి ఆన్లైన్ రిటైలింగ్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఇవి లభ్యమవుతాయని మోటరోలా మొబిలిటీ జీఎం మాగ్నస్ అల్క్విస్ట్ తెలిపారు. అమెరికాలో టెలికం సంస్థలతో కాంట్రాక్టు లేకుండా 8జీబీ ఫోన్ 179 డాలర్లకు (దాదాపు రూ. 11,200), 16 జీబీ ఫోన్ 199 డాలర్లకు (సుమారు రూ. 12,400) లభిస్తోంది. మోటో-జీ లో 4.5 అంగుళాల హెచ్డీ డిస్ప్లే, 1.2 గిగాహెట్జ్ క్వాడ్‌కోర్ ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, డ్యుయల్ సిమ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఆండ్రాయిడ్ 4.3 జెల్లీబీన్‌తో పనిచేసే వీటిని 4.4 కిట్క్యాట్కి అప్‌గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. నీరు చిందినా కూడా ఫోన్ పాడవకుండా ప్రత్యేకంగా కోర్నింగ్ గొరిల్లా గ్లాస్‌తో మోటో జీని రూపొం దించారు. ఇతర ఫీచర్స్ విషయానికొస్తే.. ఎల్ఈడీ ఫ్లాష్‌తో 5 మెగాపిక్సెల్ కెమెరా, 1.3 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 50 జీబీమేర ఉచితంగా గూగుల్ డ్రైవ్ స్టోరేజ్ మొదలైనవి ఉన్నాయి. 2012లో గూగుల్ చేతికి వెళ్లినప్పట్నుంచి మోటరోలా భారత్‌లో కొత్త ఉత్పత్తులేవీ ప్రవేశపెట్టలేదు.