
రూ.7వేలకే.. 4జీ ట్యాబ్
విలక్షణమైన స్మార్ట్ ఫోన్లతో ఫోన్ లవర్స్ ను ఆకట్టుకుంటున్న మైక్రోమ్యాక్స్ సంస్థ ట్యాబ్ సెగ్మెంట్ ను విస్తరించుకుంటోంది. గత మార్చిలో 4జీ కనెక్టివీటీతో కాన్వాస్ పీ702 ని 7,999 లకే అందించిన సంస్థ తాజాగా కాన్వాస్ పి701 పేరుతో ఒకట్యాబ్ ను మార్కెట్లో లాంచ్ చేసింది. నిర్దిష్ట వర్గ వినియోగదార్ల అవసరాలకనుగుణంగా కొత్త డివైస్ ల రూపొందిస్తున్నామని మైక్రోమ్యాక్స్ ఇన్ఫర్మేటిక్స్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ శుభజీత్ సేన్ తెలిపారు. టాబ్లెట్ సెగ్మెంట్లో అన్ని రకాల వీడియోలను చూడటం కోసం కాన్వాస్ టాబ్ పీ 701ని అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. దీనిద్వారా యూజర్లకు అద్భుతమైన వినోద అనుభవం మిగులుతుందన్నారు. ఫ్లిప్ కార్ట్ లో బ్లూ,గ్రే కలర్స్ లో ప్రత్యేకంగా అందుబాటులో ఉంది.
స్పెసిఫికేషన్స్ ఇలావున్నాయి...
7 ఇంచ్ ఐపీఎస్ డిస్‌ప్లే
1024 x 600 పిక్సెల్స్, స్క్రీన్ రిజల్యూషన్
1 జీహెచ్‌జడ్ క్వాడ్‌కోర్ మీడియాటెక్ ప్రాసెసర్,
1 జీబీ ర్యామ్
8 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 32 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్
ఆండ్రాయిడ్ 5.1 లాలిపాప్, డ్యుయల్ సిమ్, వాయిస్ కాలింగ్
5 మెగాపిక్సెల్ రియర్ కెమెరా విత్ ఎల్ఈడీ ఫ్లాష్
2 మెగా పిక్సెల్ సెల్ఫీ కెమెరా
4జీ ఎల్‌టీఈ, 3500 ఎంఏహెచ్ బ్యాటరీ (15 గంటల టాక్ , 4 గంటల బ్రౌజింగ్ టైమ్)
వైఫై, బ్లూ టూత్, మైక్రో యూఎస్బీ కనెక్టవిటీ