న్యూఢిల్లీ: అంతర్జాతీయ ప్రీమియర్ టెన్నిస్ లీగ్ (ఐపీటీఎల్)లో ఇండియన్ ఏసెస్ ఫ్రాంచైజీ నుంచి మైక్రోమ్యాక్స్ తప్పుకుంది. ఈ జట్టులో 60 శాతం వాటా ఉన్న ఈ కంపెనీ ప్రస్తుత సీజన్ నుంచే గుడ్‌బై చెప్పాలని నిర్ణయించుకుంది. తొలి సీజన్‌లో రూ.24 కోట్ల భారీ నష్టం రావడంతో మైక్రోమ్యాక్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ‘ప్రస్తుతానికి ఐపీటీఎల్‌లో మాకు ఫ్రాంచైజీ హక్కులు లేవు. అయితే స్పాన్సర్‌గా కొనసాగుతాం’ అని కంపెనీ చీఫ్ మార్కెటింగ్ అధికారి శుభజిత్ సేన్ తెలిపారు. అయితే ఏ లీగ్‌లో అయినా ప్రారంభ సీజన్‌లో నష్టాలు రావడం సహజమేనని నిర్వాహకుడు మహేశ్ భూపతి తెలిపారు. తమకు రావాల్సిన రూ.18.5 కోట్ల బకాయిలను చెల్లించాల్సిందిగా మైక్రోమ్యాక్స్‌కు భూపతి లాయర్లు సెప్టెంబర్‌లో లీగల్ నోటీసులు పంపడంతో వ్యవహారం ముదిరింది.
టిక్కెట్ల రేటు రూ.4 వేల నుంచి ప్రారంభం
వచ్చే నెల 10 నుంచి 12 వరకు జరిగే భారత్ అంచె పోటీలు ఢిల్లీలో జరుగనున్నాయి. ఈ మ్యాచ్‌ల టిక్కెట్ల రేట్లు రూ.4 వేల నుంచి 48 వేల మధ్య ఉన్నట్టు నిర్వాహకులు తెలిపారు. ఆన్‌లైన్‌లో ఐపీటీఎల్‌వరల్డ్.కామ్, బుక్‌మైషో వెబ్‌సైట్ల నుంచి కొనుగోలు చేయవచ్చు.
ఐపీటీఎల్ నుంచి తప్పుకున్న మైక్రోమ్యాక్స్
Published Sat, Nov 21 2015 12:50 AM | Last Updated on Sun, Sep 3 2017 12:46 PM
Advertisement
Advertisement