
మైక్రోమ్యాక్స్ నుంచి కొత్త ‘కాన్వాస్ ట్యాబ్’
ధర రూ.7,499
న్యూఢిల్లీ: మొబైల్ హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ‘మైక్రోమ్యాక్స్’ తాజాగా ‘కాన్వాస్ ట్యాబ్ పీ681’ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.7,499గా ఉంది. ఇందులో డీటీఎస్ డ్యూయెల్ ఆడియో స్పీకర్స్, 8 అంగుళాల స్క్రీన్, ఆండ్రాయిడ్ మార్ష్‌మాలో ఆపరేటింగ్ సిస్టమ్, 4,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 5 ఎంపీ రియర్ కెమెరా, 16 జీబీ మెమరీ, 2 ఎంపీ ఫ్రంట్ కెమెరా, ఫుల్ హెచ్‌డీ ప్లేబ్యాక్ రెజల్యూషన్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ఈ ట్యాబ్స్ వినియోగదారులకు ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్నాయని తెలిపింది.