
మైక్రోమ్యాక్స్ ప్లాంటుకు రూ.400-500 కోట్లు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మొబైల్ ఫోన్స్ కంపెనీ మైక్రోమ్యాక్స్ హైదరాబాద్‌లో ప్లాంటు ఏర్పాటుకు రూ.400-500 కోట్లు వెచ్చించనుంది. ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్‌లో (ఈఎంసీ) రానున్న ప్రతిపాదిత మొబైల్స్ తయారీ హబ్‌లో ఈ ప్లాంటు ఏర్పాటవుతుందని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్ సోమవారమిక్కడ చెప్పారు. ఈఎంసీలో 1,000 ఎకరాల స్థలం అందుబాటులో ఉందని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం వద్ద ఈఎంసీ రానున్న సంగతి తెలిసిందే.