Indian defense
-
రక్షణ ఉత్పత్తుల్లో భారత్ ముద్ర
న్యూఢిల్లీ: రక్షణ ఉత్పత్తుల తయారీలో భారత్‌కు బంగారు భవిష్యత్తు ఉన్నట్టు అంతర్జాతీయ బ్రోకరేజీ సంస్థ నోమురా అంచనా వేసింది. రక్షణ ఉత్పత్తుల తయారీకి భారత్ కేంద్రంగా అవతరించగలదని.. వచ్చే పదేళ్ల కాలంలో (2032 నాటికి) 138 బిలియన్ డాలర్ల విలువైన (రూ.11.45 లక్షల కోట్లు) ఎగుమతులకు అవకాశాలున్నట్టు పేర్కొంది. డిఫెన్స్ ఎక్విప్మెంట్, టెక్నాలజీలు, సరీ్వసులకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో.. రక్షణ ఉత్పత్తుల తయారీ, టెక్నాలజీ అభివృద్ధిపై పనిచేసే కంపెనీలకు అపారమైన అవకాశాలు రానున్నాయని అంచనా వేసింది. ‘ఇండియా డిఫెన్స్’ పేరుతో ఓ నివేదికను విడుదల చేసింది. రక్షణ రంగంపై భారత్ మూలధన వ్యయాలు 2029–30 నాటి బడ్జెట్లో 37 శాతానికి చేరుకుంటాయని అంచనా వేసింది. 2024–25 బడ్జెట్లో 29 శాతంతో పోల్చి చూస్తే గణనీయంగా పెరగనున్నట్టు తెలిపింది. ఈ ప్రకారం చూస్తే 2024 నుంచి 2030 ఆర్థిక సంవత్సరాల కాలంలో మొత్తం రూ.15.5 లక్షల కోట్లను భారత్ రక్షణ రంగంపై వెచ్చించనున్నట్టు అంచనా వేసింది. గతంతో పోలి్చచూస్తే ఇది పెద్ద మొత్తమేనని గుర్తు చేసింది. ‘‘సానుకూల విధానాలు, సంస్కరణలు, టెక్నాలజీ అభివృద్ధి, దేశీ తయారీకి ప్రోత్సాహం రూపంలో రక్షణ రంగానికి భారత ప్రభుత్వం సంపూర్ణ మద్దతు పలుకుతోంది’’అని వివరించింది.హెచ్ఏల్, బీఈఎల్‌కు ఆర్డర్లు కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్ఏఎల్)కు గొప్ప అవకాశాలు రానున్నాయని ఈ నివేదిక అంచనా వేసింది. యుద్ధ విమానాలు, హెలికాప్టర్ల తయారీలో కంపెనీకి ఉన్న బలమైన సామర్థ్యాలను ప్రస్తావించింది. రక్షణ రంగంలో భారత్ ఎలక్ట్రానిక్స్ (బీఈఎల్)కు సైతం బలమైన ఆర్డర్లకు అవకాశాలున్నాయని, దీంతో కంపెనీ మార్జిన్లు, రాబడుల రేషియోలు పెరుగుతాయని నోమురా తన నివేదికలో పేర్కొంది. వివిధ రూపాల్లో భారత్ సర్కారు అందిస్తున్న తోడ్పాటుతో ఈ రంగంలోని కంపెనీలకు సానుకూల వాతావరణం నెలకొన్నట్టు తెలిపింది. ఎగుమతులు టెక్నాలజీ బదిలీ, సహకారం రూపంలో భారత రక్షణ పరిశ్రమ అంతర్జాతీయంగా తన స్థానాన్ని విస్తరించుకుంటున్నట్టు వివరించింది. దీంతో రక్షణ తయారీ, టెక్నాలజీ అభివృద్ధి సామర్థ్యాలున్న కంపెనీలు ఎగుమతుల అవకాశాలను పెద్ద ఎత్తున సొంతం చేసుకోగలవని అంచనా వేసింది. తద్వారా అవి తమ ఆదాయ వనరులను వైవిధ్యం చేసుకోగవలని వివరించింది.లాభదాయక అవకాశాలురక్షణ రంగంలో ఎన్నో విభాగాలు లాభదాయక అవకాశాలను ఆఫర్ చేస్తున్నాయని నోమురా నివేదిక తెలిపింది. డిఫెన్స్ ఏరోస్పేస్ విభాగం ఒక్క దాని విలువే 50 బిలియన్ డాలర్లుగా ఉంటుందని చెబుతూ.. ఎయిర్‌క్రాఫ్ట్, హెలీకాప్టర్లు, యూఏవీలు, ఏవియానిక్స్, అనుబంధ వ్యవస్థల్లో పెద్ద ఎత్తున పెట్టుబడులను గుర్తు చేసింది. షిప్ బిల్డింగ్ సైతం భారీ అవకాశాలు కల్పిస్తోందని, సముద్ర తీర రక్షణ కోసం నేవల్ వెస్సెల్స్, సబ్మెరైన్లు, పెట్రోల్ బోట్లకు సంబంధించి 38 బిలియన్ డాలర్ల తయారీ అవకాశాలను ప్రస్తావించింది. మిసైళ్లు, ఆరి్టలరీ గన్ వ్యవస్థలపై పెట్టుబడులు 21 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని నోమురా నివేదిక అంచనా వేసింది. తన ఆరి్టలరీ, మిసైల్ సామర్థ్యాలను పెంచుకునేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలను గుర్తు చేసింది. -
ఫ్రీగా క్రెడిట్ కార్డు.. ఓటీటీ సబ్స్క్రిప్షన్, ఈఎంఐ ఆఫర్లంటూ బోలెడు బెనిఫిట్స్!
ఇటీవల క్రెడిట్ కార్ట్ వాడకం భారీగా పెరిగింది. ఈ నేపథ్యంలో మార్కెట్లోకి కొత్త క్రెడిట్ కార్డులు బోలెడు ఆఫర్లతో వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ క్రెడిట్ కార్డు గురించి తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే ఈ కార్డు ఫ్రీగా లభిస్తుంది. అంతేనా ఉచితంగా బీమా కవరేజ్ కూడా పొందచ్చు. ప్రభుత్వ రంగానికి చెందిన ప్రముఖ బ్యాంకుల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ బరోడాకు చెందిన బ్యాంక్ ఆఫ్ బరోడా ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ఈ కొత్త క్రెడిట్ కార్డుని ప్రవేశపెట్టింది. కాకపోతే ఫుల్ ప్రయోజనాలతో వస్తున్న ఈ కార్డు కేవలం కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉంటుంది. వారి కోసం కొత్త క్రెడిట్ కార్డు ఈ క్రెడిట్ కార్డు పేరు విక్రమ్ క్రెడిట్ కార్డు (Vikram Credit Card). ఇండియన్ డిఫెన్స్, పారామిలిటరీ, పోలీస్ సిబ్బంది కోసం ఈ క్రెడిట్ కార్డును తీసుకువచ్చినట్లు బ్యాంక్ తెలిపింది. బీఎప్ఎస్ఎల్ ( BFSL) ఇప్పటికే ఇండియన్ ఆర్మీ (యోధా), ఇండియన్ నేవీ (వరుణహ్), ఇండియన్ కోస్ట్ గార్డ్ (రక్షమాహ్), అస్సాం రైఫిల్స్(ది సెంటినెల్) వారి కోసం ప్రత్యేకమైన కోబ్రాండెడ్ క్రెడిట్ కార్డ్‌లను అందించింది. నిస్వార్థంగా మనల్ని కాపాడుతూ, మన దేశానికి సేవ చేస్తున్న సిబ్బంది క్రెడిట్ అవసరాలను తీర్చేందుకు విక్రమ్ క్రెడిట్ కార్డ్ ఎంత గానో ఉపయోగపడుతుందని బీఎఫ్ఎసఎల్ ( BFSL ) తెలిపింది. 74వ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ కొత్త ఎక్స్‌క్లూజివ్ క్రెడిట్ కార్డులను వారికి అందిస్తామని బ్యాంక్ పేర్కొంది. విక్రమ్ క్రెడిట్ కార్డును బ్యాంక్ ఆఫ్ బరోడా మాజీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ విక్రమాదిత్య సింగ్ ఖిచి ప్రారంభించారు. విక్రమ్ క్రెడిట్ కార్డ్ ఫీచర్లు, ప్రయోజనాలపై ఓ లుక్కేద్దాం! ►జీవితకాల ఉచిత (LTF) క్రెడిట్ కార్డ్ ►ఆకర్షణీయమైన రివార్డ్ పాయింట్లతో పాటు కాంప్లిమెంటరీ ఓటీటీ సబ్స్క్రిప్షన్ యాక్టివేషన్ బహుమతి. ►ప్రమాద మరణ కవరేజీ రూ. 20 లక్షలు ►1% ఇంధన సర్ఛార్జ్ మినహాయింపు ►LTF యాడ్-ఆన్లు ►ఈఎంఐ ఆఫర్లు ►కాలానుగుణంగా వ్యాపార సంబంధిత ఆఫర్లు చదవండి: Maruti Suzuki: మారుతి కస్టమర్లకు మరోషాక్, 11 వేల కార్లు రీకాల్ -
2024కల్లా 36 వేల కోట్ల లక్ష్యం!
సాక్షి, హైదరాబాద్: ఆకాశ్ క్షిపణుల ఎగుమతులకు ప్రభుత్వం అనుమతివ్వడంతో దేశ రక్షణ రంగంలో కొత్త శకం మొదలైంది. ‘మేడిన్ ఇండియా’ రక్షణ ఉత్పత్తులు విదేశాలకు విస్తరించనున్నాయి.. ఆకాశ్ ఎగుమతులు సరే.. కానీ ఎగుమతుల జాబితాలో తర్వాత ఉన్నవేమిటి? ఏయే దేశాలు భారత రక్షణ ఉత్పత్తులను కొనుగోలు చేయనున్నాయి? ఆత్మనిర్భర్ భారత్ సాకారంలో డీఆర్డీవో భాగస్వామ్యమెంత..? తదితర ఆసక్తికర ప్రశ్నలన్నింటికీ సమాధానాలను డీఆర్డీవో చైర్మన్ డాక్టర్ జి.సతీశ్‌రెడ్డి ‘సాక్షి’కి వివరించారు. ప్రశ్న: ఆకాశ్ క్షిపణుల ఎగుమతులకు ప్రభుత్వం అనుమతినిచ్చిన నేపథ్యంలో ఏయే దేశాలు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి? జవాబు: ఆకాశ్ క్షిపణుల ఎగుమతులు దేశ రక్షణ రంగ చరిత్రలో ఓ కీలక మలుపనే చెప్పాలి. పూర్తి స్వదేశీ టెక్నాలజీతో అభివృద్ధి చేసిన ఓ క్షిపణిని భారత్ ఎగుమతి చేయడం ఇదే మొదటిసారి.. రక్షణ పరిశ్రమ రంగానికి ఎంతో ఉత్సాహాన్నిచ్చే పరిణామం. వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి చాలా ఆసియా దేశాలు ఆకాశ్ కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి. మధ్యప్రాచ్యంలో యూఏఈ కూడా ఆసక్తి కనబరిచింది. ఆకాశ్ ఎగుమతులు మొదలైతే అందులోని ఉప వ్యవస్థల గురించి కూడా అంతర్జాతీయ సమాజానికి తెలుస్తుంది. తద్వారా ఆ ఉప వ్యవస్థల అమ్మకాలు, నిర్వహణల్లోనూ దేశానికి మరిన్ని అవకాశాలు అందుబాటులోకి వస్తాయి. ఎగుమతులు ఎప్పుడు ప్రారంభం కావచ్చు? వీటి విలువపై మీ అంచనా? మిలటరీ ఉత్పత్తులను వీలైనంత వేగంగా ఎగుమతి చేసేందుకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో ఓ ఉన్నతస్థాయి కమిటీ ఏర్పాటైంది. ఆయా దేశాల అవసరాల ఆధారంగా ఎగుమతి ప్రక్రియ ప్రారంభిస్తాం.. 2024 నాటికల్లా భారత రక్షణ ఉత్పత్తుల ఎగుమతుల విలువ రూ.36,566 కోట్ల వరకు ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో డీఆర్డీవో భాగస్వామ్యం చెప్పుకోదగ్గ స్థాయిలో ఉంటుంది. ఆకాశ్ తర్వాత ఎగుమతులకు సిద్ధంగా ఉన్న ఇతర క్షిపణి, రక్షణ వ్యవస్థలేవి? తీరప్రాంత నిఘా వ్యవస్థపై చాలాదేశాలు ఆసక్తి చూపుతున్నాయి. ధ్వని కంటే వేగంగా ప్రయాణించగల క్రూయిజ్ క్షిపణి బ్రహ్మోస్, అత్యాధునిక ట్యాంక్ విధ్వంసక గైడెడ్ క్షిపణి వ్యవస్థల్లోని పలు రకాలపై, సోనార్లు, యుద్ధభూమిలో ఉపయోగించే రాడార్ల కోసం దక్షిణ అమెరికా, మధ్యప్రాచ్య, ఆసియా దేశాలు సమాచారం కోరుతున్నాయి. కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నాయి కూడా.. కొన్ని దేశాలు భారత్ సొంతంగా తయారు చేసుకున్న దృశ్య కాంతికి ఆవల కూడా పని చేయగల ‘అస్త్ర’కోసం ఎంక్వైరీ చేస్తున్నారు. వేర్వేరు యుద్ధ విమానాలతో అనుసంధానించగలగడం ఈ అస్త్ర ప్రత్యేకత.. క్షిపణి వ్యవస్థల ఎగుమతుల కారణంగా భారత్‌కు వ్యూహాత్మకంగా ఏమైనా నష్టం జరుగుతుందా? అలాంటిదేమీ ఉండదు.. ఎందుకంటే ఈ క్షిపణి వ్యవస్థల్లోని సాంకేతిక పరిజ్ఞానాలు అన్నింటినీ డీఆర్డీవో శాస్త్రవేత్తలు సున్నా నుంచి మొదలుపెట్టి పూర్తి చేశారు కాబట్టి. ఈ టెక్నాలజీలను ఎలా ఒక రూపంలోకి చేర్చాలన్నది మనకు మాత్రమే తెలిసిన విషయం.. కమాండ్ కంట్రోల్ సిస్టమ్, సాఫ్ట్వేర్, అల్గారిథమ్స్ వంటివి పూర్తిగా దేశీయంగానే తయారు చేసుకున్నాం.. ఈ కారణంగానే అతితక్కువ ఖర్చుతో, వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా రక్షణ ఉత్పత్తులను తయారు చేయగలుగుతున్నాం.. మన టెక్నాలజీలు అంతర్జాతీయ మార్కెట్లోకి చేరితే మనకు లాభమే తప్ప నష్టమంటూ ఏదీ లేదు. భారత్ తన మిత్ర దేశాలకు మాత్రమే రక్షణ ఉత్పత్తులను ఎగుమతులు చేస్తుండటం వల్ల భవిష్యత్తులో ఆయా దేశాలతో సహకారానికి, సాంకేతిక పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది.. ఆత్మనిర్భర్ భారత్ కోసం డీఆర్డీవో ఇప్పటికే ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. ఇవన్నీ ఎప్పటివరకు పూర్తవుతాయి? ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో రక్షణ రంగం ఓ కీలకమైన అంశం. రానున్న ఐదు, పదేళ్లలో భారత్ రక్షణ రంగంలో స్వావలంబన సాధించనుంది. కీలకమైన టెక్నాలజీలను దిగుమతి చేసుకునే అవసరం ఉండదు. రాడార్లు, ఎలక్ట్రానిక్ యుద్ధతంత్రులు, టోర్పెడోలు, సమాచార వ్యవస్థల విషయంలో మనం ఇప్పటికే స్వావలంబన సాధించాం. భారత్‌కు తనదైన ఎయిర్‌క్రాఫ్ట్ క్యారియర్ ఉంది. ట్యాంకులను కూడా సొంతంగా తయారు చేసుకోగలుగుతున్నాం. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం ద్వారా ఎంత శాతం రక్షణ అవసరాలను తీర్చుకోగలుగుతున్నాం? రక్షణ అవసరాలకు సంబంధించి 2020 డిసెంబర్లో దిగుమతులపై నిషేధం విధించారు. మన అవసరాల్లో చాలావాటిని దేశీయ పారిశ్రామిక వర్గాల ద్వారా తీర్చుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రానున్న ఆరు, ఏడేళ్లలో ఇది అవుతుంది. రక్షణ అవసరాలు ఎంతమేరకు తగ్గించుకోగలుగుతామన్నది ఇప్పుడే చెప్పలేం. ఎందుకంటే దేశీయంగా తయారుచేసుకుంటున్న పలు వ్యవస్థలు త్వరలో ఉత్పత్తి ప్రారంభించనున్నాయి. డిజైన్, డెవలప్మెంట్తో పాటు తయారీ ప్రక్రియను వేగవంతం చేయడం ద్వారా ఐదేళ్లలో పూర్తిస్థాయి స్వదేశీకరణ జరుగుతుందని అంచనా వేస్తున్నాం. 2020 నాటికి మన రక్షణ అవసరాల్లో దిగుమతుల శాతమెంత? అవి ఏయే రంగాల్లో ఉన్నాయి? దిగుమతులపై ఆధారపడటం క్రమేపీ తగ్గుతోంది. ఇప్పటికే సుమారు 4,700 కోట్ల డాలర్ల విలువైన దిగుమతులపై ప్రభుత్వం నిషేధం విధించింది. వీటిల్లో చాలావాటిని సొంతంగా తయారు చేసుకునే ప్రక్రియలో డీఆర్డీవో ఉంది. రాడార్లు, సోనార్లు, క్షిపణులు, ఎలక్ట్రానిక్ యుద్ధ వ్యవస్థలు, టొర్పెడోలు, మందుపాతరల వంటి వాటిని దేశీయంగానే తయారు చేసుకుంటున్నాం. హోవిట్జర్ ఏటీఏజీఎస్, ఉపరితలం నుంచి గాల్లోకి ప్రయోగించల క్షిపణుల్లోనూ భారత్ తన సామర్థ్యాన్ని చాటుకుంది. కార్బైన్ల పరీక్షలు కూడా విజయవంతమయ్యాయి. ఈ కార్బైన్లతోపాటు అనేక ఇతర చిన్న ఆయుధాలను కూడా దేశీయంగానే ఉత్పత్తి చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాం. -
భారత అమ్ముల పొదిలో ‘వారుణాస్త్ర’o
సాక్షి, విశాఖపట్నం: భారత రక్షణ దళం అమ్ముల పొదిలోకి శక్తివంతమైన ఆయుధం వచ్చి చేరింది. సముద్రగర్భంలో ఉన్న శత్రుదేశ సబ్‌మెరైన్‌ని ధ్వంసం చేసే అత్యంత బరువున్న టార్పెడో వారుణాస్త్రని తయారు చేసిన భారత డైనమిక్స్ లిమిటెడ్(బీడీఎల్) భారత నౌకాదళానికి అప్పగించింది. భారత రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)కి చెందిన నేవల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ లేబొరేటరీ (ఎన్ఎస్టీఎల్) వారుణాస్త్రని డిజైన్ చేయగా, బీడీఎల్ దీన్ని తయారు చేసింది. శనివారం విశాఖలోని బీడీఎల్‌ని సందర్శించిన డీఆర్డీవో చైర్మన్ డా.జి.సతీష్‌రెడ్డి చేతుల మీదుగా వారుణాస్త్రని నేవీకి అప్పగించారు. ఈ సందర్భంగా సతీష్‌రెడ్డి మాట్లాడుతూ ఇటీవలే బీడీఎల్ స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టూ ఎయిర్ మిస్సైల్(క్యూర్‌ఎస్‌ఎమ్) ప్రయోగం విజయవంతం అవడం దేశానికి గర్వకారణమన్నారు. ఎన్ఎస్టీఎల్, బీడీఎల్ సంయుక్త సహకారంతో మొదటి వారుణాస్త్రని విజయవంతంగా తయారు చేసినందుకు అభినందనలు తెలిపారు. అడ్వాన్స్డ్ లైట్ వెయిట్ టార్పెడో (ఏఎల్‌డబ్ల్యూటీ), ఈహెచ్‌డబ్ల్యూటీ తయారీలో బీడీఎల్ శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారన్నారు. వారుణాస్త్ర విశేషాలు: యుద్ధ నౌక నుంచే ఈ హెవీ వెయిట్ టార్పెడోను సముద్రంలో దాగి ఉన్న శత్రు దేశపు జలాంతర్గావిుపై ప్రయోగించవచ్చు. 95 శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారైంది. ప్రపంచంలో జీపీఎస్ ఆధారంగా దూసుకుపోయే ఏకైక టార్పెడోగా వారుణాస్త్ర వినుతికెక్కింది. -
క్యూఆర్ సామ్ పరీక్ష విజయవంతం
సాక్షి, హైదరాబాద్: ఉగ్రవాద సంస్థల శిబిరాలపై దాడులు నిర్వహించిన కొన్ని గంటల్లోనే భారత రక్షణ దళాలు ఇంకో శుభవార్తను అందుకున్నాయి. ఆర్మీకి మరింత శక్తినిచ్చే క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైల్ పరీక్షలు మంగళవారం విజయవంతంగా జరిగాయి. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, భారత్ డైనమిక్స్ లిమిట్‌డ్‌లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ క్షిపణికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ దాడులు చేయగలగడం మాత్రమే కాకుండా.. రేడార్ల ద్వారా జామ్ చేసే ప్రయత్నాలను ఎలక్ట్రానిక్ కౌంటర్ మెషర్ల ద్వారా తిప్పికొట్టగల శక్తి కూడా వీటికి ఉంది. ట్రక్కులో లేదా చిన్న గొట్టంలోంచి ప్రయోగించగల క్యూఆర్‌సామ్ 30 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు. పాతబడిన కొన్ని క్షిపణి వ్యవస్థలకు బదులుగా క్యూఆర్‌సామ్‌లను సమకూర్చుకోవాలని రక్షణ మంత్రిత్వ శాఖ 2007లో తొలిసారి టెండర్లు ఆహ్వానించింది. అయితే అప్పట్లో పెద్ద స్పందన లేకపోయింది. ఈ మధ్యలో వీటి తయారీకి డీఆర్డీవో సిద్ధమైంది. దీనికోసం 2014లో రూ.476.43 కోట్ల నిధులు కేటాయించారు. అంతర్జాతీయ మార్కెట్ నుంచి క్యూఆర్‌సామ్‌లను కొనుగోలు చేయాలనుకున్న రక్షణ శాఖ 2017లో తన ఆలోచనలను విరమించుకుని డీఆర్డీవో సిద్ధం చేసినవాటికి పచ్చజెండా ఊపింది. ఇందుకు అనుగుణంగా అదే ఏడాది జూన్, జూలైల్లో ఒడిశాలోని చాందీపూర్‌లో ఈ క్షిపణులను రెండుసార్లు విజయవంతంగా పరీక్షించారు. హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న రీసెర్చ్ సెంటర్ ఇమారత్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ల్యాబొరేటరీ (డీఆర్డీఎల్)ల శాస్త్రవేత్తలు ఇందులో కీలకపాత్ర పోషించారు. -
స్త్రీలోక సంచారం
♦ భారత రక్షణ దళంలోని శాశ్వత, స్వల్పకాలిక విభాగాలైన ‘పర్మినెంట్ కమిషన్’ (పదవీ విమరణ వయసు వరకు), ‘షార్ట్ సర్వీస్ కమిషన్’, (10 సం. + 4 ఏళ్ల పొడిగింపు)లలో.. పర్మినెంట్ కమిషన్‌లో చేరడానికి ఆఫీసర్ ర్యాంకులో ఇప్పటి వరకు మహిళలకు ఉన్న పరిమితులను మరింతగా సడలించి, వారిని కూడా శాశ్వత ప్రాతిపదికన ఆర్డ్‌నెన్స్, సిగ్నల్స్, ఇంజినీరింగ్, ఇంటెలిజెన్స్, ఎయిర్ డిఫెన్స్, లాజిస్టిక్స్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వంటి అనేక కీలక విభాగాల్లోకి తీసుకునేందుకు ప్రభుత్వం విధి విధానాలు రూపొందిస్తోంది. అధికార స్థాయిలో మహిళల్ని రక్షణశాఖ లోకి తీసుకోవడమన్నది 1990లలోనే మొదలైనప్పటిMీ ప్రస్తుతం త్రివిధ దళాలలోని మొత్తం 14 లక్షల మంది ఉద్యోగ సిబ్బందిలో 65 వేల మంది అధికారస్థాయి ఉద్యోగులు ఉండగా, వారిలో ఆర్మీలో కేవలం 1561 మంది, ఎయిర్‌ఫోర్స్‌లో 1610 మంది, నేవీలో 489 మంది మాత్రమే మహిళా అధికారులు, అది కూడా షార్ట్ సర్వీస్ కమిషన్ నుంచి వచ్చినవారే ఎక్కువగా ఉన్నారు. ♦ మాటు వేసి, పంజా విసరబోయిన చిరుత పులి నుంచి తన పదకొండేళ్ల కూతుర్ని కాపాడుకున్న ముత్తుమరి అనే ఒక తేయాకు కార్మికురాలిని తమిళనాడు ప్రభుత్వం ‘కల్పనాచావ్లా అవార్డు’తో సత్కరించి, 5 లక్షల నగదును బహుమానంగా అందచేసింది. కూతురు, పదో తరగతి చదువుతున్న కొడుకు ఉన్న ఒంటరి తల్లి ముత్తుమరి.. గత ఏడాది తేయాకు తోటల్లో ఆకుల్ని తెంపేందుకు కూతుర్ని కూడా వెంట తీసుకెళ్లినప్పుడు పొదల మాటునుంచి కూతురి పైకి లంఘించిన చిరుతను వట్టి చేతులతో తరిమికొట్టి బిడ్డను కాపాడుకున్న ఘటనలో ఆమెలోని తెగింపు ఆమెను ఒక సాహస మహిళగా, అంతకన్నా కూడా.. తల్లి ప్రేమకు ప్రతీకగా నిలబెట్టింది. ♦ ఛత్తీస్ఘర్ గవర్నర్ బలరామ్‌జీ దాస్ టాండన్ గుండెపోటుతో మరణించడంతో ఆయన స్థానంలో.. ప్రస్తుతం మధ్యప్రదేశ్ గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆనందిబెన్ పటేల్.. అదనపు బాధ్యతలు చేపడుతూ రాజధాని రాయ్‌పూర్‌లోని రాజ్‌భవన్‌లో ప్రమాణ స్వీకారం చేశారు. 2014లో నరేంద్ర మోదీ ప్రధాని కావడంతో, అంతవరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన స్థానంలోకి గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రిగా వచ్చిన ఆనందిబెన్, తర్వాత రెండేళ్లకు వయోభారాన్ని కారణంగా చూపి పదవీ విరమణ చేసి, కొన్ని నెలల విరామం తర్వాత ఈ ఏడాది జనవరిలో మధ్యప్రదేశ్ గవర్నర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. ♦ ‘రోబో’ సినిమాలో డైరెక్టర్ శంకర్ వేలాది రోబోలను కలిపి దుష్టుడైన ఓ జైట్ రోబోను సృష్టించిన విధంగానే, లండన్ శాస్త్రవేత్తలు.. చురుగ్గా ఈత కొట్టగల లక్షణం ఉన్న ఈ–కోలి (ఎషరికియా కోలీ) బాక్టీరియాలతో మోనాలిసా రూపురేఖల్ని ఒక చిత్రపటంగా సృష్టించారు! కాంతికి ప్రతిస్పందించే విధంగా జన్యునిర్మాణాన్ని మార్పు చేసిన పది లక్షల బాక్టీరియాలతో మోనాలిసా ఆకృతిని సాధించిన శాస్త్ర పరిశోధకులు.. తర్వాతి తరం మైక్రోస్కోపిక్ వస్తువుల నిర్మాణానికి ఈ జన్యుమార్పిడి బాక్టీరియాలు ఇటుకల్లా ఉపయోగపడతాయని భావిస్తున్నారు. ♦ హాలీవుడ్లో మహిళలకు అవకాశాలు లేకపోవడం వల్లనే తను ‘కోపిష్టి స్త్రీవాది’గా మారానని 48 ఏళ్ల అమెరికన్ హాలీవుడ్ న టి హెదర్ గ్రేయమ్ అన్నారు. ఇటీవల షేక్స్పియర్ నాటకోత్సవాలకు వెళ్లిన హెదర్.. ‘ప్రతి కథా పురుషుడి వైపు నుంచి చెప్పిందే. ప్రతి కోణం పురుషుడిదే. మహిళా రచయితలకు, వారి రచనలకు, వారి దృక్పథానికి ఎందుకని ప్రాముఖ్యం లేకుండా పోయింది. హాలీవుడ్‌లోనూ అంతే. ఏ విభాగంలోనూ మహిళలు తగినంతగా కనిపించరు. అందుకే నాలో తరచు కోపం కట్టలు తెచ్చుకుంటుంది. అందుకే నాకు ‘యాంగ్రీ ఫెమినిస్టు’ అన్న పేరు వచ్చింది’’ అని అసహనాన్ని వ్యక్తం చేశారు. ♦ రేపటి నుండి (ఆగస్టు 18) రెండు వారాలపాటు ఇండోనేషియా రాజధాని జకార్తాలో జరుగుతున్న ఏషియన్ గేమ్స్‌లో 100 మీటర్ల పరుగులో స్వర్ణ పతకం సాధించేందుకు ఒడిశాకు చెందిన 22 ఏళ్ల ప్రొఫెషనల్ స్ప్రింటర్ ద్యుతీ చంద్ తహతహలాడుతున్నారు. స్త్రీ దేహంలో పురుష హార్మోన్లు ఎక్కువగా ఉండే ‘హైపర్ఆండ్రోజెనిజం’ అనే లైంగిక అసమస్థితి కారణంగా నాలుగేళ్ల క్రితం దక్షిణ కొరియాలోని ఏంచాన్లో జరిగిన ఏషియన్ గేమ్స్‌కు అర్హత పొందలేకపోయిన ద్యుతి, ఆ విషయమై కోర్టును ఆశ్రయించగా.. ఈ ఏడాది ఆరంభంలో ఆమెకు అనుకూలంగా తీర్పు రావడంతో ఈ ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనే అవకాశం లభించింది. ♦ న్యూయార్క్‌లో క్యాన్సర్ చికిత్స తీసుకుంటున్న 43 ఏళ్ల బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే.. ఆగస్టు 11 తన కొడుకు రణవీర్ పుట్టినరోజు సందర్భంగా, తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఉద్వేగభరితమైన పోస్టు పెట్టారు. ‘రణవీర్.. మై సన్, మై మూన్, మై స్టార్స్.. మై స్కై..’ అంటూ ప్రారంభమైన ఈ పోస్టులో.. 12 నుంచి 13వ సంవత్సరంలోకి ప్రవేశించిన కొడుకును ఉద్దేశించి.. ‘వావ్! యు ఆర్ టీనేజర్ నౌ’ అని సోనాలి మురిసిపోవడం హార్ట్ టచింగ్‌గా ఉంది. ♦ 67 ఏళ్ల వయసులో 1985లో చనిపోయిన హాలీవుడ్ నటి ఎవ్లిన్ ఫెలిసా యాంకర్స్ నూరవ జయంతి నేడు. 1918 ఆగస్టు 17న చిలీలో జన్మించిన ఫెలిసా 1940ల నాటి అమెరికన్ హారర్ చిత్రాలతో, ముఖ్యంగా ‘ది ఉల్ఫ్ మ్యాన్’ (1941) చిత్రంతో ప్రేక్షకాదరణ పొందారు. -
భారతీయుల రక్షణపై అమెరికాను కోరాం: సుష్మా స్వరాజ్
సాక్షి, న్యూఢిల్లీ: అమెరికాలో జాత్యంహకార హత్యకు గురైన శ్రీనివాస్ కూచిభొట్ల కుటుంబసభ్యులతో మాట్లాడినట్లు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ తెలిపారు. అమెరికాలోని భారతీయులకు రక్షణ కల్పించాలని ట్రంప్ ప్రభుత్వాన్ని కోరినట్లు చెప్పారు. యూఎస్‌లో భారతీయులపై దాడుల అంశాన్ని కాంగ్రెస్ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డి సోమవారం రాజ్యసభలో ప్రస్తావించారు. శ్రీనివాస్ కూచిభొట్ల, వ్యాపారవేత్త హర్నీష్ పటేల్‌లు హత్యకు గురికావడం దిగ్బ్రాంతి కలిగించిందన్నారు. -
గల్ఫ్ ఎంబసీల నిధులు ఇరాక్‌కు మళ్లింపు
10 వేల మంది భారతీయుల తరలింపునకు వినియోగం కేంద్ర సర్కారు నిర్ణయం బాగ్దాద్: అంత్యరుద్ధంతో ఇరాక్‌లో పరిస్థితి చేయిదాటి పోతుండడంతో అక్కడి భారతీయులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలపై దృష్టి సారించింది. ఘర్షణాత్మక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించి వేరే ప్రాంతాలకు పంపేందుకు వీలుగా గల్ఫ్ దేశాల్లో భారతీయుల సంక్షేమానికి ఉద్దేశించిన నిధులను బాగ్దాద్‌లో ఉన్న భారత ఎంబసీకి బదిలీ చేయాలని నిర్ణయించింది. ఆదివారం విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఆధ్వర్యంలో గల్ఫ్ దేశాల రాయబారులతో ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిధుల మళ్లింపు ద్వారా 10 వేల మంది భారతీయులను తరలించనున్నారు. ఈ భేటీలో ఖతార్, ఒమన్, సౌదీ, యూఏసీ రాయబారులు పాల్గొన్నారు. ఇరాక్‌లో ఉన్న భారతీయుల భద్రత, తరలింపు విషయమై అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక గురించి ఈ సమావేశంలో చర్చించారు. అలాగే ఇరాక్‌లో నిర్బంధానికి గురైన వారి కుటుంబ సభ్యులను కూడా సుష్మాస్వరాజ్ కలుసుకుని వారిని సముదాయించారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు... గల్ఫ్ దేశాల్లోని దౌత్య కార్యాలయాల వద్ద అందుబాటులో ఉన్న భారతీయుల సంక్షేమ నిధుల్లో కొంత భాగాన్ని ఇరాక్‌లోని భారతీయులను రక్షించేందుకు వినియోగించాలని నిర్ణయించినట్లు విదేశాంగ ప్రతినిధి చెప్పారు.ఇరాక్‌లో భారతీయులకు సాయం అందించేందుకు బాగ్దాద్‌లో రెండు మొబైల్ యూనిట్లను ఏర్పాటు చేశామని, సాయం కావాల్సిన వారు 009647704444899, 009647704843247 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. తిక్రిత్తో మిలిటెంట్లపై భారీ దాడులు బాగ్దాద్: ఇరాక్ సున్నీ మిలిటెంట్లు ఆక్రమించిన తిక్రిత్ నగరం కాల్పులు, పేలుళ్లతో దద్దరిల్లుతోంది. ఆ దేశ వాయుసేన శని, ఆదివారాల్లో నగరంలో పలు చోట్ల భీకర దాడులు చేసింది. ఊరి నడిబొడ్డులోని కార్యాలయాలను ఆక్రమించుకున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్(ఐఎస్ఐఎల్) జీహాదీలను ప్రభుత్వ బలగాలు తరిమికొట్టాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే నగరం ఇంకా జీహాదీల అధీనంలో ఉందని, ఇరుపక్షాల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతూనే ఉంద న్నారు. నగరం మధ్య ప్రాంతంతోపాటు దివంగత దేశాధ్యక్షుడు సద్దాం హుస్సేన్ భవంతి ప్రాంగణంపైనా వాయుసేన దాడులు చేసిందని స్థానికులు చెప్పారు. మిలిటెంట్లపై దాడులకు సాయం చేసేందుకు రష్యా ఆదివారం ఇరాక్‌కు సుఖోయ్ యుద్ధ విమానాలను పంపింది. కాగా, ఇరాక్ పొరుగుదేశమైన సిరియాలోనూ మిలిటెంట్లు పేట్రేగిపోతున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్ఐఎస్) తీవ్రవాదులు శనివారం అలెప్పో రాష్ట్రం దీర్ హారెఫ్ గ్రామంలో ఎనిమిది మందిని బహిరంగంగా హతమార్చి శిలువ వేశారని, అల్ బాబ్ గ్రామంలో మరొకరిని ఈ విధంగానేనే చంపేశారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్‌రైట్స్ తెలిపింది. ఇస్లామిక్ రాజ్యాన్ని ప్రకటించిన జిహాదీలు బీరుట్: సిరియా, ఇరాక్‌లో ప్రభుత్వ బలగాలతో తలపడుతున్న జీహాదీలు ఇస్లామిక్ మత రాజ్యాన్ని (ఖ లిఫేట్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఖలీఫా(రాజ్యాధిపతి)గా, ముస్లింలు అందరికీ నాయకుడిగా తమ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీని తిరుగుబాటు దారుల సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవెంట్’ ప్రకటించింది. ఈ మేరకు ఒక ఆడియోను ఆన్లైన్లో విడుదల చేసింది.