గల్ఫ్ ఎంబసీల నిధులు ఇరాక్‌కు మళ్లింపు | mbs's of the Gulf of diversion of funds to Iraq | Sakshi
Sakshi News home page

గల్ఫ్ ఎంబసీల నిధులు ఇరాక్‌కు మళ్లింపు

Published Mon, Jun 30 2014 12:49 AM | Last Updated on Sat, Sep 2 2017 9:34 AM

గల్ఫ్ ఎంబసీల నిధులు ఇరాక్‌కు మళ్లింపు

గల్ఫ్ ఎంబసీల నిధులు ఇరాక్‌కు మళ్లింపు

10 వేల మంది భారతీయుల
తరలింపునకు వినియోగం
కేంద్ర సర్కారు నిర్ణయం

 
బాగ్దాద్: అంత్యరుద్ధంతో ఇరాక్‌లో పరిస్థితి చేయిదాటి పోతుండడంతో అక్కడి భారతీయులను రక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం మరిన్ని చర్యలపై దృష్టి సారించింది. ఘర్షణాత్మక ప్రాంతాల్లో చిక్కుకుపోయిన భారతీయులను రక్షించి వేరే ప్రాంతాలకు పంపేందుకు వీలుగా గల్ఫ్ దేశాల్లో భారతీయుల సంక్షేమానికి ఉద్దేశించిన నిధులను బాగ్దాద్‌లో ఉన్న భారత ఎంబసీకి బదిలీ చేయాలని నిర్ణయించింది. ఆదివారం విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ ఆధ్వర్యంలో గల్ఫ్ దేశాల రాయబారులతో ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. నిధుల మళ్లింపు ద్వారా 10 వేల మంది భారతీయులను తరలించనున్నారు. ఈ భేటీలో ఖతార్, ఒమన్, సౌదీ, యూఏసీ రాయబారులు పాల్గొన్నారు. ఇరాక్‌లో ఉన్న భారతీయుల భద్రత, తరలింపు విషయమై అనుసరించాల్సిన భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక గురించి ఈ సమావేశంలో చర్చించారు. అలాగే ఇరాక్‌లో నిర్బంధానికి గురైన వారి కుటుంబ సభ్యులను కూడా సుష్మాస్వరాజ్ కలుసుకుని వారిని సముదాయించారు.

సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు...

గల్ఫ్ దేశాల్లోని దౌత్య కార్యాలయాల వద్ద అందుబాటులో ఉన్న భారతీయుల సంక్షేమ నిధుల్లో కొంత భాగాన్ని ఇరాక్‌లోని భారతీయులను రక్షించేందుకు వినియోగించాలని నిర్ణయించినట్లు విదేశాంగ ప్రతినిధి చెప్పారు.ఇరాక్‌లో భారతీయులకు సాయం అందించేందుకు బాగ్దాద్‌లో రెండు మొబైల్ యూనిట్లను ఏర్పాటు చేశామని, సాయం కావాల్సిన వారు 009647704444899, 009647704843247 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.  

తిక్రిత్‌తో మిలిటెంట్లపై భారీ దాడులు

బాగ్దాద్: ఇరాక్ సున్నీ మిలిటెంట్లు ఆక్రమించిన తిక్రిత్ నగరం  కాల్పులు, పేలుళ్లతో దద్దరిల్లుతోంది. ఆ దేశ వాయుసేన శని, ఆదివారాల్లో నగరంలో పలు చోట్ల భీకర దాడులు చేసింది. ఊరి నడిబొడ్డులోని కార్యాలయాలను ఆక్రమించుకున్న ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవాంట్(ఐఎస్‌ఐఎల్) జీహాదీలను ప్రభుత్వ బలగాలు తరిమికొట్టాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. అయితే నగరం ఇంకా జీహాదీల అధీనంలో ఉందని, ఇరుపక్షాల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతూనే ఉంద న్నారు. నగరం మధ్య ప్రాంతంతోపాటు దివంగత దేశాధ్యక్షుడు సద్దాం హుస్సేన్ భవంతి ప్రాంగణంపైనా వాయుసేన దాడులు చేసిందని స్థానికులు చెప్పారు. మిలిటెంట్లపై దాడులకు సాయం చేసేందుకు రష్యా ఆదివారం ఇరాక్‌కు సుఖోయ్ యుద్ధ విమానాలను పంపింది. కాగా, ఇరాక్ పొరుగుదేశమైన సిరియాలోనూ మిలిటెంట్లు పేట్రేగిపోతున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా(ఐఎస్‌ఐఎస్) తీవ్రవాదులు శనివారం అలెప్పో రాష్ట్రం దీర్ హారెఫ్ గ్రామంలో ఎనిమిది మందిని  బహిరంగంగా హతమార్చి శిలువ వేశారని, అల్ బాబ్ గ్రామంలో మరొకరిని ఈ విధంగానేనే చంపేశారని సిరియన్ అబ్జర్వేటరీ ఫర్ హ్యూమన్‌రైట్స్ తెలిపింది.

ఇస్లామిక్ రాజ్యాన్ని ప్రకటించిన జిహాదీలు

బీరుట్: సిరియా, ఇరాక్‌లో ప్రభుత్వ బలగాలతో తలపడుతున్న జీహాదీలు ఇస్లామిక్ మత రాజ్యాన్ని (ఖ లిఫేట్) ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఖలీఫా(రాజ్యాధిపతి)గా, ముస్లింలు అందరికీ నాయకుడిగా తమ అధినేత అబు బకర్ అల్ బాగ్దాదీని తిరుగుబాటు దారుల సంస్థ ‘ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ లెవెంట్’ ప్రకటించింది. ఈ మేరకు ఒక ఆడియోను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement