తయారీపై రూ. 3,200 కోట్లు
బెంగళూరు: ఎనర్జీ మేనేజ్‌మెంట్, ఆటోమేషన్ దిగ్గజం ష్నైడర్ ఎలక్ట్రిక్ దేశీయంగా తయారీపై భారీ పెట్టుబడులకు సిద్ధపడుతోంది. 2026కల్లా తయారీ ప్లాంట్లపై రూ. 3,200 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. తద్వారా దేశ, విదేశాలలో అమ్మకాలకు భారత్‌ను తయారీ కేంద్రంగా వినియోగించుకోనున్నట్లు పేర్కొంది. ఈ బాటలో స్థానికంగా డేటా సెంటర్లకు అవసరమయ్యే కూలింగ్ సొల్యూషన్స్‌ను ఉత్పత్తి చేసేందుకు రూ. 100 కోట్లతో ఏర్పాటు చేసిన ప్లాంటును తాజాగా ప్రారంభించింది.
ప్రణాళికల్లో భాగంగా గ్రూప్ తయారీ కేంద్రంగా భారత్‌లో పెట్టుబడులు చేపట్టనున్నట్లు ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ప్రెసిడెంట్, గ్రేటర్ ఇండియా జోన్ ఎండీ, సీఈవో దీపక్ శర్మ వెల్లడించారు. వివిధ ప్రొడక్టులు, సొల్యూషన్ల తయారీకి దేశవ్యాప్తంగా తయారీ ప్లాంట్లను నెలకొల్పనున్నట్లు కూలింగ్ సొల్యూషన్స్ యూనిట్ ప్రారంభం సందర్భంగా తెలియజేశారు. వెరసి మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్, తెలంగాణ, తమిళనాడు, పశి్చమ బెంగాల్, ఉత్తరాఖండ్, ఒడిషాలలో యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. తాజా యూనిట్‌తో కలిపి ప్రస్తుతం కంపెనీ దేశవ్యాప్తంగా 30 ఫ్యాక్టరీలను నిర్వహిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment