న్యూఢిల్లీ: దేశీయ తయారీ రంగం గత ఆర్థిక సంవత్సరంలో రూ.1,70,720 కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకర్శించింది. అంత క్రితం ఏడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 76 శాతం అధికమని కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ‘తయారీలో భారత్‌కు వెల్లువెత్తిన నిధుల్లో 27.01 శాతం వాటాతో సింగపూర్ తొలి స్థానంలో నిలిచింది.
17.94 శాతం వాటాతో యూఎస్ రెండవ స్థానాన్ని ఆక్రమించింది. వరుసలో మారిషస్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్ నిలిచాయి.కోవిడ్ మహమ్మారి, ప్రపంచ పరిణామాలు కొనసాగుతున్నప్పటికీ 2021–22లో భారత్ అత్యధికంగా రూ.6.78 లక్షల కోట్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అందుకుంది’ అని వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment