జూన్‌లో 58.3 శాతానికి పీఎంఐ
న్యూఢిల్లీ: సానుకూల డిమాండ్, కొత్త ఆర్డర్ల దన్నుతో జూన్‌లో తయారీ రంగ ఉత్పత్తి పెరిగింది. దీంతో ఉద్యోగాల కల్పన కూడా గణనీయంగా మెరుగుపడింది. వ్యాపార పరిస్థితులు మెరుగుపడుతున్నాయనడానికి సూచనగా గత నెలకు సంబంధించి హెచ్‌ఎస్‌బీసీ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) జూన్‌లో 58.3కి పెరిగింది. మే నెలలో ఇది 57.5గా నమోదైంది. పీఎంఐ 50కి ఎగువన ఉంటే వృద్ధిని, దానికి దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది.
కొత్త ఆర్డర్ల రాకతో కంపెనీలు రిక్రూట్‌మెంట్‌ను కూడా పెంచుకుంటున్నట్లు హెచ్‌ఎస్‌బీసీ గ్లోబల్ ఎకానమిస్ట్ మైత్రేయి దాస్ తెలిపారు. 2005 మార్చిలో దీనికి సంబంధించిన డేటాను సేకరించడం మొదలుపెట్టిన తర్వాత గత 19 ఏళ్లలో ఉద్యోగాల కల్పన రేటు ఇంత వేగవంతంగా ఉండటం ఇదే తొలిసారని వివరించారు. జూన్‌లో సిబ్బంది వ్యయాలతో పాటు ముడి వస్తువులు, రవాణాపై ఖర్చులు పెరగడంతో నిర్వహణ వ్యయాలు పెరిగినట్లు దాస్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment