న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం ఏప్రిల్‌లో దారుణ పతనాన్ని చవిచూసింది. ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఇండియా మ్యాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఏప్రిల్‌లో ఏకంగా 27.4కు పడిపోయింది. అసలు ఈ గణాంకాలు ప్రారంభమైన 15 సంవత్సరాల్లో ఇంతవరకూ ఎప్పుడూ ఇంత తీవ్ర పతనాన్ని తయారీ రంగం ఎదుర్కొనలేదు. ఇంకో విషయం ఏమిటంటే, ఈ సూచీ 50 పాయింట్ల పైనుంటే దానిని వృద్ధి ధోరణిగా భావిస్తారు. ఆ దిగువనకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. గడచిన 32 నెలల్లో ఎప్పుడూ క్షీణతలోకి సూచీ జారలేదు. మార్చిలోసైతం 51.8గా నమోదయ్యింది. కాగా కోవిడ్–19 సంక్షోభం ఒక కొలిక్కి రావడంతోటే దేశంలో డిమాండ్ తిరిగి పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని ఐహెచ్‌ఎస్ మార్కిట్ ఎకనమిస్ట్ ఇలియోట్ ఖేర్ వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment