భారతదేశంలో తయారీ రంగం చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇదే దేశాభివృద్ధిని నిర్ణయిస్తుందని వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ లీడర్స్ ఫోరమ్‌లో వెల్లడించారు. 2017 నాటికి వికసిత భారత్ సాకారానికి తయారీ రంగం కీలకమని అన్నారు.
భారతదేశ జీడీపీ వేగవంతమవుతున్నప్పటికీ.. తయారీ రంగం వృద్ధి సాపేక్షంగా నిలిచిపోయింది. జీడీపీలో దీని వాటా 15 శాతం నుంచి 16 శాతంగా ఉందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. గత రెండు దశాబ్దాలుగా ఈ సంఖ్య స్థిరంగా ఉంది. అంటే జీడీపీ పెరుగుతున్నప్పటికీ తయారీ రంగం ఇందులో చెప్పుకోదగ్గ వృద్దివైపు అడుగులు వేయడం లేదు.
కోట్ల జనాభా ఉన్న మన దేశంలో నైపుణ్యం కలిగిన గ్రాడ్యుయేట్స్ చాలామంది ఉన్నారు. కాబట్టి భారత్ ఎంతో అభివృద్ధి చెందగలదని గోయల్ పేర్కొన్నారు. అయితే దేశంలోని కంపెనీలు తమకు కావాల్సిన వస్తువులను లేదా ఉత్పత్తులను మరో దేశీయ కంపెనీ నుంచి కొనుగోలు చేయాలి. ఇది తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయడం సహాయపడుతుందని ఆయన అన్నారు.
ఒక భారతీయ కంపెనీ మరొక భారతీయ కంపెనీ నుంచి కొనుగోలు చేయడం ఒక స్థితిస్థాపక పర్యావరణ వ్యవస్థను సృష్టిస్తుంది. ఇది వ్యాపారాల అంతరాయాలను నిరోధించడానికి సహాయపడుతుంది. ప్రభుత్వం కూడా దేశాభివృద్ధికి చాలా పాటుపడుతోందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment