న్యూఢిల్లీ: తయారీ రంగం నవంబర్‌లో 11 నెలల గరిష్ట స్థాయిని నమోదుచేసుకుంది. నికాయ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఈ నెల్లో 54 కు చేరింది. అక్టోబర్ నెలలో ఇది 53.1. పటిష్ట డిమాండ్ పరిస్థితులు, కొత్త ఆర్డర్లు బాగుండడం వంటి అంశాలు తయారీ రంగం ఉత్పిత్తి పెరగడానికి కారణాలని నికాయ్ ఇండియా నెలవారీ సర్వే తెలిపింది. దాదాపు ఏడాది కాలంలో ఇంతస్థాయిలో పురోగతి ఎన్నడూ లేదని నికాయ్ ఇండియా పేర్కొంది.
నిజానికి ఈ ఇండెక్స్ 50 పైన ఉంటే, వృద్ధి ధోరణిగానే పరిగణించడం జరుగుతుంది. ఆలోపునకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. దీని ప్రకారం– గడచిన 16 నెలల కాలంలో తయారీ పీఎంఐ 50 పైనే ఉంది. తాజా పరిస్థితి చూస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న ఆశావహ పరిస్థితులూ ఏర్పడుతున్నాయని ఐహెచ్‌ఎస్ మార్కిట్ ప్రిన్సిపల్ ఎకనమిస్ట్, నివేదిక రూపకర్త పోల్యానా డీ లీమా పేర్కొన్నారు. వచ్చే 12 నెలల్లో కూడా తయారీ రంగానికి మంచి మార్కెట్ పరిస్థితులే ఉంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
నవంబర్‌లో తయారీరంగం మెరుపులు
Published Tue, Dec 4 2018 1:32 AM | Last Updated on Tue, Dec 4 2018 1:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment