Nikai India
-
పుంజుకున్న తయారీ రంగం
న్యూఢిల్లీ: డిమాండ్ మెరుగుపడుతున్న దాఖలాలతో కంపెనీలు ఉత్పత్తిని పెంచుతున్నాయి. ఈ నేపథ్యంలో దేశీయంగా తయారీ రంగం గత నెల మళ్లీ కాస్త పుంజుకుంది. ఏప్రిల్‌లో 51.8 పాయింట్లుగా ఉన్న నికాయ్ ఇండియా తయారీ రంగ సూచీ (పీఎంఐ) మే నెలలో 52.7 పాయింట్లకు పెరగడం ఇందుకు నిదర్శనం. పీఎంఐ 50 పాయింట్ల పైన కొనసాగడం ఇది వరుసగా 22వ నెల కావడం గమనార్హం. పీఎంఐ 50కి పైన ఉంటే వృద్ధిని, అంతకన్నా దిగువన ఉంటే మందగమనాన్ని సూచిస్తుంది. ‘కొత్త ఆర్డర్ల రావడం మొదలు కావడంతో, డిమాండ్‌కి అనుగుణంగా ఉత్పత్తి చేయడంపై కంపెనీలు మరింతగా దృష్టి పెట్టాయి. దీంతో తయారీ రంగంలో ఉత్పత్తి కూడా వేగంగా పెరిగింది‘ అని పీఎంఐ సూచీ నిర్వహించే ఐహెచ్ఎస్ మార్కిట్ సంస్థ ప్రధాన ఆర్థికవేత్త, నివేదిక రూపకర్త పోల్యానా డి లిమా పేర్కొన్నారు. కొత్త ఆర్డర్లు వస్తుండటం, ఉత్పత్తి పెంపుపై కంపెనీలు ఆశావహంగా ఉండటం వంటి అంశాలతో తయారీ రంగంలో మరింత మందికి ఉపాధి కల్పన జరిగినట్లు వివరించారు. ధీమాగా కంపెనీలు ఏప్రిల్ నుంచి సెంటిమెంటు మెరుగుపడుతుండటంతో రాబోయే రోజుల్లోనూ ఉత్పత్తి పెంపుపై దేశీ తయారీ కంపెనీలు ధీమాగా ఉన్నాయి. వ్యాపారాలకు అనుకూలంగా ప్రభుత్వ విధానాలు, మార్కెటింగ్ వ్యూహాలు, పూర్తి కావడానికి సిద్ధంగా ఉన్న ప్రాజెక్టులు, సానుకూల ఆర్థిక పరిస్థితులు మొదలైన అంశాలు ఈ ఆశావహ దృక్పధానికి కారణమని నివేదికలో వెల్లడైంది. ద్రవ్యోల్బణ కోణంలో చూస్తే ధరలపరమైన ఒత్తిళ్లు పెద్దగా పెరగలేదని, ఉత్పత్తి వ్యయాల పెరుగుదల స్వల్పంగానే ఉండటం వల్ల కంపెనీలు రేట్లను పెద్దగా మార్చలేదని లిమా తెలిపారు. -
ఏప్రిల్‌లో సేవలు పేలవం: నికాయ్
న్యూఢిల్లీ: సేవల రంగం ఏప్రిల్‌లో నీరసించింది. ఇండెక్స్ 51గా నమోదయినట్లు నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ తెలియజేసింది. సూచీ ఈ స్థాయికి కిందకు రావడం ఏడు నెలల్లో ఇదే తొలిసారి. కొత్త వ్యాపారాల్లో స్వల్ప పెరుగుదల, ఎన్నికల ఫలితాలపై అనిశ్చితి తాజాగా సేవల రంగం సూచీపై ప్రతికూల ప్రభావం చూపిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే నికాయ్సూచీ 50 పైన కొనసాగితే దానిని వృద్ధిగానే భావించడం జరుగుతుంది. ఆ లోపునకు పడిపోతేనే క్షీణతగా పరిగణిస్తారు. ఈ లెక్కన సేవల రంగం వరుసగా 11 నెలల నుంచీ 50 పైనే కొనసాగుతోంది. తయారీ కూడా నెమ్మదే...! భారత తయారీ రంగం వృద్ధి ఏప్రిల్‌లో నెమ్మదిన సంగతి తెలిసిందే. ఎన్నికల అనిశ్చితి ప్రభావం ఏప్రిల్‌లో తయారీ రంగంపై కనిపించింది. నికాయ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఏప్రిల్‌లో 51.8గా నమోదయ్యింది. మార్చిలో ఇది 52.6 పాయింట్లు. ఆగస్టు తరువాత ఇంత తక్కువ స్థాయికి (51.8) సూచీ పడిపోవడం ఇదే తొలిసారి. అయితే సూచీ 50పైన పాయింట్లు కొనసాగడం ఇది వరుసగా 21వ నెల. సేవలు, తయారీ రెండూ కలిపినా నిరాశే.. కాగా సేవలు, తయారీ రంగం రెండూ కలిసిన నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ కూడా నిరాశగానే ఉంది. మార్చిలో 52.7 పాయింట్ల వద్ద ఉన్న సూచీ ఏప్రిల్‌లో 51.7కు తగ్గింది. ఆర్బీఐ ద్రవ్య పరపతి విధాన సమీక్ష జూన్ 3 నుంచి 6వ తేదీ మధ్య జరుగనున్న నేపథ్యంలో ఈ తాజా గణాంకాలు వెలువడ్డాయి. -
ఒడిదుడుకుల ప్రయాణం..!
ముంబై: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ఐదో దశ పోలింగ్ నేడు జరగనుంది. లోక్‌సభకు మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరుగుతుండగా.. నేడు జరిగే పోలింగ్... ఎన్నికల చివరి అంకానికి మరింత దగ్గర చేస్తుందనే అంశం మార్కెట్లో కీలకంగా ఉందని ఎపిక్ రీసెర్చ్ సీఈఓ ముస్తఫా నదీమ్ అన్నారు. ‘ఫలితాల వెల్లడి తేదీ దగ్గర పడుతున్న కొద్దీ.. తరువాత ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటుచేయనున్నారు? ఎన్ డీఏనే కొనసాగితే.. మెజారిటీ ఎంత ఉండనుందనే ఉత్కంఠ మార్కెట్లో రోజురోజుకి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో మే 23 వరకు మార్కెట్లో ఒడిదుడుకులు కూడా అధికస్థాయిలోనే పెరుగుతాయి. ఇదే సమయంలో పలు దిగ్గజ కంపెనీలు ప్రకటించనున్న క్యూ4 ఆర్థిక ఫలితాలు మార్కెట్‌కు అత్యంత కీలకంగా ఉండనున్నాయి’ అని అన్నారయన. మిశ్రమ కార్పొరేట్ ఫలితాలు, సాధారణ ఎన్నికల కారణంగా మార్కెట్లో ఒడిదుడుకులకు ఆస్కారం అధికంగా ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధన విభాగం హెడ్ వినోద్ నాయర్ అన్నారు. బ్యాంకింగ్ దిగ్గజ ఫలితాల వెల్లడి ప్రైవేట్ రంగ దిగ్గజమైన ఐసీఐసీఐ బ్యాంక్ మే 6న (సోమవారం) మార్చి త్రైమాసిక ఫలితాలను వెల్లడించనుంది. ఈ బ్యాంక్ నికర లాభం రూ.2,162.8 కోట్లుగా ఉండవచ్చని బ్రోకరేజీ సంస్థ మోతిలాల్ ఓస్వాల్ అంచనా వేసింది. ఏడాది ప్రాతిపదికన 112 శాతం, క్వార్టర్ ఆ¯Œ క్వార్టర్ వృద్ధి 34.8 శాతం వృద్ధిని అంచనావేసిన ఈ సంస్థ.. నికర వడ్డీ ఆదాయం ఏడాది ప్రాతిపదికన 13.6% వృద్ధి చెంది రూ.6,839.3 కోట్లుగా ఉండనుంది విశ్లేషించింది. ఈ ఆదాయం త్రైమాసిక పరంగా స్వల్పంగా 0.5% క్షీణత ఉండనుందని పేర్కొంది. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ క్యూ4 ఫలితాలు ఈనెల 10న (శుక్రవారం) వెల్లడికానుండగా.. ఇదే రోజున కెనరా బ్యాంక్ ఫలితాలురానున్నాయి. ధనలక్ష్మీ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఫలితాలు బుధవారం వెల్లడికానున్నాయి. ఇతర దిగ్గజ కంపెనీల్లో వేదాంత (మంగళవారం).. టైటాన్, శ్రీ రేణుకా షుగర్స్, టాటా కమ్యూనికేషన్స (బుధవారం), ఏషియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, అపోలో టైర్స్ (గురువారం).. లార్సెన్ అండ్ టుబ్రో, వోల్టాస్ (శుక్రవారం) ఫలితాలను ప్రకటించనున్నాయి. ఫలితాల ఆధారంగా ఒడిదుడుకులకు ఆస్కారం ఉండనుందని సామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమీత్ మోడీ అన్నారు. ‘ప్రీమియం వాల్యుయేష¯Œ్స, మిశ్రమ ఫలితాల నేపథ్యంలో నిఫ్టీ 11,800 వద్ద బలమైన రెసిస్టెన్‌సను ఎదుర్కొంటోంది. ఎఫ్ఐఐలు తమ పెట్టుబడులను కొనసాగిస్తుండగా.. డీఐఐలు, రిటైల్ ఇన్వెస్టర్లు మాత్రం లాభాల స్వీకరణకు మొగ్గుచూపుతున్నారు’ అని క్యాపిటల్‌ఎయిమ్ రీసెర్చ్ హెడ్ మనీష్ యాదవ్ వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ అంశాల ప్రభావం.. అమెరికా–చైనాల మధ్య బీజింగ్‌లో తాజా విడత వాణిజ్య చర్చలు బుధవారం రోజున పూర్తయ్యాయి. అంతక్రితం సమావేశాలతో పోల్చితే తాజా విడత చర్చల్లో కొంత పురోగతి ఉన్నట్లు ఇరు దేశాల వాణిజ్య అధికారులు వెల్లడించిన విషయం తెలిసిందే. ఇక వాషింగ్టన్ లో మరో దఫా చర్చలకు ఇరు పక్షాలు అంగీకరించిన నేపథ్యంలో అంతర్జాతీయ అంశాల పరంగా ఈవారంలో మార్కెట్లకు ఇది కీలకంగా ఉండనుందని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఇక్కడ నుంచి ఏమాత్రం పురోగతి కనిపించినా మార్కెట్లకు సానుకూలంగా ఉండనుందని అంచనావేస్తున్నాయి. దేశీ ఆర్థిక గణాంకాలపరంగా.. ఏప్రిల్ నికాయ్ ఇండియా సేవల పీఎంఐ సోమవారం.. పారిశ్రామికోత్పత్తి, తయారీ ఉత్పత్తిని ప్రభుత్వం శుక్రవారం వెల్లడించనుంది. వెనక్కు తగ్గిన ఎఫ్ఐఐలు గడిచిన రెండు సెషన్లలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) భారత్ క్యాపిటల్ మార్కెట్ నుంచి రూ.1,255 కోట్లను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. మే నెల 2, 3 తేదీల్లో వీరు ఈక్విటీ మార్కెట్ నుంచి రూ.367 కోట్లు, డెట్ మార్కెట్ నుంచి రూ.888 కోట్లను వెనక్కితీసుకున్నారు. అయితే.. ఏప్రిల్ నెల్లో రూ.16,093 కోట్లు, మార్చిలో రూ.45,981 కోట్లు, ఫిబ్రవరిలో రూ.11,182 కోట్లను పెట్టుబడి పెట్టడం ద్వారా ఈమధ్యకాలంలో నికర పెట్టుబడిదారులుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేవలం రెండు రోజుల డేటా ఆధారంగా ఎఫ్ఐఐలు నికర అమ్మకందారులుగా మారారని ఒక తుది అంచనాకు రాలేమని జియోజిత్ ఫైనాన్షియల్ విశ్లేషకులు జి.విజయ్ కుమార్ అన్నారు. -
సేవల రంగం జోరు..
న్యూఢిల్లీ: కొత్త వర్క్ ఆర్డర్లు, సానుకూల మార్కెట్ పరిస్థితుల ఊతంతో నవంబర్‌లో సేవల రంగం వృద్ధి వేగం పుంజుకుంది. నాలుగు నెలల గరిష్ట స్థాయికి చేరింది. నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ సూచీ నవంబర్‌లో 53.7 పాయింట్లుగా నమోదైంది. దీంతో వరుసగా ఆరో నెల కూడా వృద్ధి నమోదైనట్లయింది. అక్టోబర్‌లో ఇది 52.2 పాయింట్లుగా ఉంది. పర్చేజింగ్ మేనేజర్స్ సూచీ (పీఎంఐ) ప్రమాణాల ప్రకారం సూచీ 50 పాయింట్ల ఎగువన ఉంటే పెరుగుదలను, దిగువన ఉంటే క్షీణతను సూచిస్తుంది. మరోవైపు తయారీ, సేవల రంగాలు రెండింటి పనితీరును ప్రతిఫలించే నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ సూచీ.. నవంబర్‌లో అత్యంత వేగవంతమైన వృద్ధి కనపర్చింది. అక్టోబర్‌లో 53గా ఉన్న సూచీ నవంబర్‌లో 54.5గా నమోదైంది. 2016 అక్టోబర్ తర్వాత ఇంత అధికంగా వృద్ధి చెందడం ఇదే ప్రథమం. సానుకూల మార్కెట్ పరిస్థితుల నేపథ్యంలో పదహారు నెలలుగా ఉద్యోగాల కల్పన కొనసాగుతోందని నివేదిక రూపొందించిన ఐహెచ్ఎస్ మార్కిట్ సంస్థ ప్రిన్సిపల్ ఎకానమిస్ట్ పోల్యానా డె లిమా తెలిపారు. వృద్ధికి ఊతం: గర్గ్ వ్యాపార కార్యకలాపాలు, డిమాండ్ పెరుగుదలను నవంబర్ పీఎంఐ డేటా ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖ కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ చెప్పారు. గత నాలుగేళ్ల కాలం చూస్తే.. నవంబర్‌లో ఎగుమతుల వృద్ధి రేటు మరింత మెరుగ్గా ఉందని ఆయన ట్వీట్ చేశారు. అక్టోబర్‌లో ఎగుమతులు 18 శాతం పెరిగి దాదాపు 27 బిలియన్ డాలర్లకు చేరాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ కాలంలో ఎగుమతులు 13 శాతం వృద్ధితో 191 బిలియన్ డాలర్లకు చేరాయి. -
నవంబర్‌లో తయారీరంగం మెరుపులు
న్యూఢిల్లీ: తయారీ రంగం నవంబర్‌లో 11 నెలల గరిష్ట స్థాయిని నమోదుచేసుకుంది. నికాయ్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ ఈ నెల్లో 54 కు చేరింది. అక్టోబర్ నెలలో ఇది 53.1. పటిష్ట డిమాండ్ పరిస్థితులు, కొత్త ఆర్డర్లు బాగుండడం వంటి అంశాలు తయారీ రంగం ఉత్పిత్తి పెరగడానికి కారణాలని నికాయ్ ఇండియా నెలవారీ సర్వే తెలిపింది. దాదాపు ఏడాది కాలంలో ఇంతస్థాయిలో పురోగతి ఎన్నడూ లేదని నికాయ్ ఇండియా పేర్కొంది. నిజానికి ఈ ఇండెక్స్ 50 పైన ఉంటే, వృద్ధి ధోరణిగానే పరిగణించడం జరుగుతుంది. ఆలోపునకు పడిపోతేనే క్షీణతగా భావిస్తారు. దీని ప్రకారం– గడచిన 16 నెలల కాలంలో తయారీ పీఎంఐ 50 పైనే ఉంది. తాజా పరిస్థితి చూస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్న ఆశావహ పరిస్థితులూ ఏర్పడుతున్నాయని ఐహెచ్ఎస్ మార్కిట్ ప్రిన్సిపల్ ఎకనమిస్ట్, నివేదిక రూపకర్త పోల్యానా డీ లీమా పేర్కొన్నారు. వచ్చే 12 నెలల్లో కూడా తయారీ రంగానికి మంచి మార్కెట్ పరిస్థితులే ఉంటాయన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. -
ఆగస్టులో నిదానించిన తయారీ
న్యూఢిల్లీ: దేశ తయారీ రంగ వృద్ధి ఆగస్టు మాసంలో నిదానించింది. తయారీ రంగ కార్యకలాపాలను సూచించే నికాయ్ ఇండియా తయారీ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) 51.7కు తగ్గింది. ఇది జూలై నెలలో 52.3గా ఉంది. అయినప్పటికీ 50 పాయింట్ల మార్క్‌పైన తయారీ రంగ వృద్ధి నమోదవడం వరుసగా 13వ నెల. 50 పాయింట్ల పైన ఉంటే వృద్ధి విస్తరణ దశలో ఉన్నట్టు, ఆ లోపు ఉంటే తగ్గిపోతున్నట్టు పరిగణిస్తారు. ‘‘భారత తయారీ రంగ వృద్ధి జోరు కొంత తగ్గినట్టు ఆగస్టు నెల గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఉత్పత్తి, నూతన ఆర్డర్ల రాకలో వృద్ధి నిదానంగా ఉండటాన్ని సూచిస్తోంది’’ అని ఈ నివేదికను రూపొందించిన ఐహెచ్ఎస్ మార్కెట్ ఆర్థికవేత్త ఆష్నాదోధియా అన్నారు. మెరుగుపడిన దేశీ డిమాండ్ ... దేశీయ డిమాండ్ పరిస్థితులు ముందటి నెల కంటే ఆగస్టులో నెమ్మదిగా మెరుగుపడినట్టు, నూతన ఎగుమతి ఆర్డర్లు ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత వేగాన్ని అందుకున్నట్టు పీఎంఐ డేటా తెలియజేస్తోంది. ఇక తయారీ కంపెనీలు ఆగస్టులో అధిక ఇన్పుట్ వ్య యాల భారాన్ని ఎదుర్కొన్నాయి. రూపాయి విలువ తగ్గడంతో ముడి పదార్థాలపై అధికంగా ఖర్చు చేయాల్సి వచ్చింది. మార్జిన్లను కాపాడుకునేందుకు కంపెనీలు ధరలు పెంచాయని, అయినప్పటికీ ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత చూస్తే పెంపు పరిమితంగానే ఉన్నట్టు పీఎంఐ డేటా తెలియజేస్తోంది. రానున్న 12 నెలలకు ఉత్పత్తి అంచనాల పట్ల దేశీయ తయారీ కంపెనీలు ఆశావాదంతో ఉండడం గమనార్హం. -
మళ్లీ ‘సేవలు’ బాగుపడ్డాయి..
న్యూఢిల్లీ: భారత్ సేవల రంగం మార్చిలో మళ్లీ వృద్ధి బాట పట్టింది. ఉపాధి కల్పన ఏడేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్– పీఎంఐ ఈ విషయాన్ని తెలిపింది. మార్చిలో సేవల సూచీ 50.3గా నమోదయ్యింది. ఫిబ్రవరిలో ఈ సూచీ 47.8 వద్ద ఉంది. పీఎంఐ ప్రమాణాల ప్రకారం– సూచీ 50 పాయింట్ల ఎగువనే ఉంటే దానిని వృద్ధి దశగానే భావించడం జరుగుతుంది. ఆలోపునకు పడిపోతే క్షీణతగా పరిగణిస్తారు. సేవలు–తయారీ వృద్ధి బాటకు.. కాగా సేవలు, తయారీ రంగాలు రెండూ కలిపిన నికాయ్ ఇండియా కాంపోజిట్ ఇండెక్స్ కూడా మార్చిలో మంచి మెరుగైన ఫలితాన్నే ఇచ్చింది. పీఎంఐ ఉత్పత్తి ఇండెక్స్ మార్చిలో 50.8గా నమోదయ్యింది. ఫిబ్రవరిలో ఈ సూచీ 49.7 పాయింట్ల వద్ద ఉంది. ఒక్క తయారీ రంగాన్ని చూస్తే మాత్రం, ఈ విభాగం క్రియాశీలత మార్చిలో ఐదు నెలల కనిష్ట స్థాయికి పడిపోయింది. నికాయ్ మార్కెట్ తయారీ పీఎంఐ మార్చిలో 51 గా నమోదయ్యింది. ఫిబ్రవరిలో ఈ పాయింట్లు 52.1 శాతం. అయితే తయారీ ఇండెక్స్ వరుసగా గడచిన ఎనిమిది నెలల్లో 50 పాయింట్ల ఎగువనే ఉంది. -
సేవల రంగంలో కుదుపు
న్యూఢిల్లీ: సేవల రంగం ఫిబ్రవరిలో పడకేసింది. వృద్ధి ఆరు నెలల కనిష్టానికి పడిపోయింది. నికాయ్ ఇండియా సర్వీసెస్ బిజినెస్ యాక్టివిటీ ఇండెక్స్ జనవరిలో 51.7 ఉండగా ఫిబ్రవరిలో 47.8కి తగ్గింది. గతేడాది ఆగస్ట్ తర్వాత చూస్తే ఇంత తక్కువ స్థాయిలో వృద్ధి నమోదవడం మళ్లీ ఇదే. కీలకమైన 50 మార్కును దిగిరావడం మూడు నెలల్లో ఇదే తొలిసారి. డిమాండ్ బలహీనంగా ఉండటంతో కొత్త ఆర్డర్లు రావటం తగ్గిపోయినట్టు ఈ సూచీని నిర్వహించే ఐహెచ్ఎస్ మార్కిట్ సంస్థ తెలిపింది. అయితే, రానున్న 12 నెలల కాలానికి సంస్థలు ఆశాభావంతో ఉండటం సానుకూలం. ‘‘వృద్ధి క్షీణత తాత్కాలికమేనని సంస్థలు భావిస్తున్నాయి. వృద్ధి అంచనాలకు అనుగుణంగా 2011 జూన్ నుంచి చూస్తే ఉద్యోగుల నియామకం ఎంతో వేగంగా ఉంది’’ అని ఐహెచ్ఎస్ మార్కిట్ ఎకనామిస్ట్ ఆష్నా దోధియా పేర్కొన్నారు. ఇక సేవలు, తయారీ రంగాలకు సంబంధించిన నికాయ్ ఇండియా కాంపోజిట్ పీఎంఐ అవుట్‌పుట్ ఇండెక్స్ సైతం ఫిబ్రవరిలో 49.7కి క్షీణించింది. జనవరిలో ఇది 52.5గా ఉంది. సేవల రంగం తిరోగమనమే దీనికి ప్రధాన కారణంగా ఉంది. ముడి సరుకుల ద్రవ్యోల్బణం కూడా గతేడాది నవంబర్ తర్వాత పెరిగినట్టు ఈ సంస్థ తెలిపింది. -
అక్టోబర్‌లో తగ్గిన తయారీ స్పీడ్ : నికాయ్
న్యూఢిల్లీ: తయారీ రంగం అక్టోబర్‌లో మందగించింది. నికాయ్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) తాజా గణాంకాల ప్రకారం– అక్టోబర్ సూచీ 50.3గా నమోదయ్యింది. సెస్టెంబర్లో ఈ సూచీ 51.2 వద్ద ఉంది. అయితే నికాయ్ పీఎంఐ ప్రకారం– సూచీ 50 లోపునకు పడిపోతేనే క్షీణతగా భావించడం జరుగుతుంది. ఆ పైన వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. మూడు నెలల నుంచీ 50 పాయింట్ల పైనే సూచీ కొనసాగుతోంది. అయితే అక్టోబర్‌లో స్పీడ్ తగ్గడానికి డిమాండ్ పరిస్థితుల బలహీనత, జీఎస్టీ ప్రతికూల పరిస్థితులు కారణమని సంబంధిత సర్వే తెలిపింది. -
ఆగస్ట్‌లో వృద్ధి బాటకు... తయారీ: పీఎంఐ
న్యూఢిల్లీ: తయారీ రంగం ఆగస్టులో తిరిగి వృద్ధి బాటకు మళ్లింది. నికాయ్ ఇండియా మేనేజింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) ఆగస్టులో 51.2గా నమోదయ్యింది. జూలైలో ఇండెక్స్ 47.9 వద్ద ఉంది. పీఎంఐ పాయింట్లు 50 శాతం ఎగువన ఉంటే వృద్ధి ధోరణిగా, ఆ దిగువున ఉంటే, క్షీణతగా పరిగణించడం జరుగుతుంది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అమలు నేపథ్యంలో– జూలైలో అప్పటికే ఉన్న నిల్వలను విక్రయించుకోవడంపై దృష్టి పెట్టిన కంపెనీలు, కొత్త ఉత్పత్తులపై దృష్టి సారించకపోవడం, కొత్త పన్ను వ్యవస్థ (జీఎస్టీ)పై సంక్లిష్టత వంటి అంశాలు జూన్, జూలై తయారీ రంగం పేలవ పనితనానికి కారణమని పేర్కొన్న నికాయ్ ఇండెక్స్, జీఎస్టీ అమల్లోకి వచ్చి, దీనిపై స్పష్టత వస్తున్న కొలదీ ఆర్డర్లు తిరిగి పుంజుకుంటున్నాయని విశ్లేషించింది. ఏప్రిల్–జూన్ మధ్య కాలంలో జీడీపీ వృద్ధి రేటు మూడేళ్ల కనిష్ట స్థాయి 5.7 శాతానికి పడిపోయిన నేపథ్యంలో– ఆగస్టు నికాయ్ తయారీ సూచీ కొంత సానుకూలంగా నమోదవడం విశేషం.