
న్యూఢిల్లీ: తయారీ రంగం అక్టోబర్‌లో మందగించింది. నికాయ్ ఇండియా మాన్యుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) తాజా గణాంకాల ప్రకారం– అక్టోబర్ సూచీ 50.3గా నమోదయ్యింది. సెస్టెంబర్‌లో ఈ సూచీ 51.2 వద్ద ఉంది. అయితే నికాయ్ పీఎంఐ ప్రకారం– సూచీ 50 లోపునకు పడిపోతేనే క్షీణతగా భావించడం జరుగుతుంది.
ఆ పైన వృద్ధి ధోరణిగానే పరిగణిస్తారు. మూడు నెలల నుంచీ 50 పాయింట్ల పైనే సూచీ కొనసాగుతోంది. అయితే అక్టోబర్‌లో స్పీడ్ తగ్గడానికి డిమాండ్ పరిస్థితుల బలహీనత, జీఎస్‌టీ ప్రతికూల పరిస్థితులు కారణమని సంబంధిత సర్వే తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment