న్యూఢిల్లీ: భారత్ తయారీ రంగం అక్టోబర్‌లో పటిష్టంగా ఉందని ఎస్‌అండ్‌పీ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ పర్చేజింగ్ మేనేజర్స్ ఇండెక్స్ (పీఎంఐ) సర్వే పేర్కొంది. సెప్టెంబర్‌లో 55.1 వద్ద ఉన్న సూచీ అక్టోబర్లో 55.3కు పెరిగినట్లు ఎస్‌అండ్‌పీ గ్లోబల్ మార్కిట్ ఇంటిలిజన్స్‌లో ఎకనమిక్స్ విభాగం అసోసియేట్ డైరెక్టర్ పోలీయానా డీ లిమా పేర్కొన్నారు. ఈ సూచీ 50పైన ఉంటే వృద్ధి ధోరణిగా.. ఆ లోపునకు పడిపోతే క్షీణతగా పరిగణించడం జరుగుతుంది.
ఈ ప్రాతిపదికన సూచీ వరుసగా 16 నెలల నుంచీ వృద్ధి బాటలోనే నడుస్తోంది. కాగా, తయారీ రంగం ప్రస్తుతం ద్రవ్యోల్బణం, ఎగుమతులకు సంబంధించి ప్రధానంగా ఆందోళనలో ఉందని లిమా పేర్కొన్నారు. దాదాపు 400 మంది తయారీదారుల ప్యానల్‌లో కొనుగోలు జరిపే మేనేజర్‌లకు పంపిన ప్రశ్నాపత్రం, ప్రతిస్పందనల ఆధారంగా ఈ సూచీ కదలికలను నమోదుచేయడం జరుగుతంది.
చదవండి: ఎయిర్‌టెల్ బంపరాఫర్: ఒకే రీచార్జ్‌తో బోలెడు బెనిఫిట్స్, తెలిస్తే వావ్ అనాల్సిందే!
Comments
Please login to add a commentAdd a comment