సాక్షి, న్యూఢిల్లీ : 1991లో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం కన్నా 2019, సెప్టెంబర్‌నాటికి భారత్ ఆర్థిక పరిస్థితి బాగా క్షీణించింది. అదే త్రైమాసికంలో స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) వద్ధి రేటు 2013 సంవత్సరం నాటికన్నా తక్కువగా 4.5 శాతానికి పడి పోయింది. విదేశీ పెట్టుబడులు ఆరేళ్ల కనిష్టానికి పడిపోయాయి. దేశం నుంచి ఎగుమతులు తగ్గిపోయాయి. ఉత్పాదన రంగం క్షీణించింది. బ్యాంకులు పతనావస్థకు చేరుకున్నాయి. ఆ దశలో ఎలాగైనా దేశానికి విదేశీ పెట్టుబడులు తీసుకరావాలన్న ధృడ సంకల్పంతో ప్రధాని నరేంద్ర మోదీ 2019, సెప్టెంబర్ నెల చివర్లో రెండు పర్యాయాలు అమెరికా ప్రముఖ కార్పొరేట్ దిగ్గజాలతో చర్చలు జరిపారు.
మోదీ హూస్టన్ సమావేశానికి సరిగ్గా 40 గంటల ముందు దేశంలో కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి, కొత్త ఉత్పాదక కంపెనీలకు విధిస్తున్న 25 శాతం పన్నును 15 శాతానికి భారత ప్రభుత్వం తగ్గించింది. అమెరికా నుంచి కొత్త పెట్టుబడులను ఆకర్షించడం కోసమే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందనే విషయాన్ని సులభంగానే అర్థం చేసుకోవచ్చు. ఈ నిర్ణయం భారత్ ఖజానాకు 1.5 లక్ష కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. 2019–20 ఆర్థిక వార్శిక సర్వే ప్రకారం దేశానికి 2019 సంవత్సరానికి దేశానికి మొత్తం 49 బిలియన్ డాలర్లు విదేశీ పెట్టుబడులు వచ్చాయి. చదవండి: కోవిడ్: ఉత్తరాఖండ్ కీలక నిర్ణయం
వాటిలో కార్పొరేట్ పన్నును తగ్గించక ముందే 26.1 బిలియన్ డాలర్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి. 23 బిలయన్ డాలర్ల పెట్టుబడులు మాత్రమే పన్నులు తగ్గించాక వచ్చాయి. వాటిలో ఎక్కువగా అంటే, 17,58 బిలియన్ డాలర్లు సర్వీస్ సెక్టార్‌కే వచ్చాయి. ప్రధానంగా ఉత్పాదన రంగాన్ని ఆకర్షించడం కోసం పన్నులు తగ్గిస్తే ఆ రంగానికి మాత్రం ఐదు బిలియన్ డాలర్ల పెట్టుబడులు కూడా మించలేదు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజంభించడంతో కొత్తగా విదేశీ పెట్టుబడలు వచ్చే ఆస్కారం కూడా లేక పోయింది. అప్పటికే దేశంలో కునారిల్లిపోయిన ఆర్థిక వ్యవస్థ కరోన లాక్‌డౌన్‌తో మరింత దిగజారిపోయింది. పన్నులు తగ్గించడం తొందరపాటు చర్యగా మిగిలిపోయింది. చదవండి: భారీ జంప్ : బంగారం మరి కొనలేం..
Comments
Please login to add a commentAdd a comment