‘సాహసానికి’ సన్మానం
‘సాహసానికి’ సన్మానం
Published Tue, Aug 30 2016 10:18 PM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM
కర్నూలు: కర్తవ్య విధి నిర్వహణలో పోలీసులు ప్రాణ త్యాగాలకు వెనుకాడరని పెద్దతుంబళం పోలీసులు నిరూపించారని ఎస్పీ ఆకె రవికృష్ణ అన్నారు. వారిని స్ఫూర్తిగా తీసుకొని జిల్లా పోలీసులు ప్రజలకు మంచి సేవలు అందించి శాఖకు మంచిపేరు తీసుకురావాలని కోరారు. కందుకూరు తుంగభద్ర నదిలో ప్రాణాలకు తెగించి ఏడుగురిని రక్షించిన పోలీసులను మంగళవారం జిల్లా కేంద్రానికి రప్పించి ఎస్పీ ఆకె రవికష్ణ సన్మానించారు. నదిలో కొట్టుకపోతున్న వారిని ఒడ్డుకు తీసుకొచ్చేందుకు మనోధైర్యాన్ని కలుగజేసి వారి ప్రాణాలను కాపాడిన పెద్దతుంబళం ఎస్‌ఐ శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ మల్లికార్జున స్వామిని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో అభినందించి సన్మానించారు. రిస్క్యూ టీమ్‌లో పాల్గొన్న పీసీలు 888, 3715, 3693, 3638, 2926, 3640, 9091 తదితరులను కూడా ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఆదోని తాలుకా సీఐ దైవప్రసాద్ కూడా పాల్గొన్నారు. సమయానికి వచ్చి తమ ప్రాణాలు కాపాడారని బాధితులు కృతజ్ఞతలు తెలిపినట్లు ఈ సందర్బంగా ఎస్పీ వెల్లడించారు.
Advertisement