ఏటా 50 లక్షల మరణాలకు అదే కారణం
లండన్: ఇటీవలికాలంలో బాగా తగ్గిపోతున్న శారీరక శ్రమకు ప్రజలు చెల్లిస్తున్న మూల్యం ఎంతో తెలుసా.. సంవత్సరానికి 67.5 బిలియన్ డాలర్లతో పాటు 50 లక్షల మంది ప్రాణాలు. ఇంటర్నేషనల్ టీమ్ ఆఫ్ రీసెర్చర్స్ నిర్వహించిన తాజా పరిశోధనలో వ్యాయామం లేకపోవటం మూలంగా 67.5 బిలియన్ డాలర్లను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆరోగ్యం విషయంలో ఖర్చు చేస్తున్నారని తేల్చారు. వారానికి కనీసం 150 నిమిషాల శారీరక శ్రమ చేస్తే ఆరోగ్యంగా ఉండొచ్చిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెబుతున్నా.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వయోజనుల్లో 50 శాతం మంది కూడా ఈ మార్క్ను చేరుకోవటం లేదని పరిశోధకులు వెల్లడించారు.
రోజుకు ఎనిమిది గంటలకు పైగా కూర్చొని పనిచేసేవారిలో సరైన శారీరక శ్రమ లేకపోయినట్లయితే వారిలో అకాల మరణాలు సంభవించే అవకాశం పెరుగుతోందని పరిశోధనలో తేలింది. శరీరానికి సరైన వ్యాయామం లేకపోవటం మూలంగా గుండె జబ్బులు, డయాబెటిస్, క్యాన్సర్ల ముప్పు పెరుగుతుందని పరిశోధనకు నేతృత్వం వహించిన ఎకిలండ్ తెలిపారు.