వెనక్కు వెళితే భయపడిందనుకున్నాడు | Watch as brave shopkeeper in her slippers smashes mug over robber's head | Sakshi
Sakshi News home page

వెనక్కు వెళితే భయపడిందనుకున్నాడు

Published Thu, Mar 17 2016 5:41 PM | Last Updated on Thu, Aug 30 2018 5:27 PM

వెనక్కు వెళితే భయపడిందనుకున్నాడు - Sakshi

వెనక్కు వెళితే భయపడిందనుకున్నాడు

మాస్కో: మొన్న భారతీయ వనిత. నేడు రష్యా వనిత.. వెలుగులోకి రానివారు ఇంకెందరో. ఎవరైతేనేం.. మొత్తానికి మహిళలు 'ధైర్యే సాహసే లక్ష్మీ' అన్నట్లుగా దూసుకుపోతున్నారు. కత్తులకు జంకకుండా, బాంబులకు బెదరకుండా దొంగల ఆటకట్టిస్తున్నారు. మున్ముందు మహిళలు ఉన్న షాపుల్లోకి వెళ్లాలంటేనే దొంగలు ఓ పదిసార్లు ఆలోచించుకుంటారేమో. అది రష్యాలోని ఓరెన్‌ బర్గ్.. అక్కడ ఓ పెద్ద ఫ్యాన్సీ, బేకరి, షాపు ఉంది. అందులో ఓ యువతి సహాయకురాలిగా పనిచేస్తోంది.

ఆమె వస్తువులు సర్దుకునే పనిలో ఉండగా ఓ దొంగ మంకీక్యాప్ కోటుతో లోపలికి వచ్చాడు. ఆమె ఏం కావాలి అని అడుగుతుండగానే కత్తి తీసి పొడిచేస్తా అని బెదిరించాడు. దీంతో ఆమె కొంచెం లోపలికి పరుగెత్తింది. ఆ దొంగ ఆమె భయపడిపోయిందిలే అనుకొని ఎంచక్కా క్యాష్ కౌంటర్లోకి తొంగిచూస్తూ చేత్తో అందులో క్యాష్ బుక్ డబ్బులు అందుకునేందుకు ప్రయత్నించాడు. ఇంతలోనే ఆ యువతి ఒక పెద్ద పింగాణి కప్పు తీసుకొని వచ్చి అతడి తలపై బలంగా కొట్టింది. దాంతో బిత్తరపోయిన ఆ దొంగ వెంటనే తేరుకొని చేతికందినకాడికి తీసుకొని బతుకు జీవుడా అంటూ పారిపోయాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement