fruit juices
-
పండ్ల రసాలు ఎక్కువగా తాగుతున్నారా.. ప్రమాదంలో పడ్డట్టే
ఇటీవల మనలో ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. దాంతో మంచి ఆరోగ్యం కోసం మంచి జీవనశైలితో పాటు పండ్లూ ఫలాలూ తినడం, ఇతరత్రా ఆరోగ్యకరమైన మార్గాలను అనుసరించడం పరిపాటిగా మారింది. ఇందులో కొన్ని ఒంటికి మంచివేగానీ... పంటికి అంతగా మంచివి కాకపోవచ్చు. వాటిని తెలుసుకుని ఒంటినీ, పంటినీ కాపాడుకుందాం. పండ్లు / పండ్ల రసాలతో అప్రమత్తంగా ఉండండి.. తాజా పండ్ల రసాలతో మంచి ఆరోగ్యం సమకూరుతుందంటూ చాలామంది ఫ్రూట్జ్యూసులు ఎక్కువగా తాగేస్తుంటారు. వాటిల్లో ఆరోగ్యాన్నిచ్చే పోషకాలతో పాటు... కొన్ని అనారోగ్య కారకాలూ ఉంటాయి. ఉదాహరణకు అందులోని చక్కెర మోతాదులు పళ్లను ఎక్కువగా దెబ్బతీయవచ్చు. అలాగే ఒకింత పుల్లగా ఉండే పండ్లలోని యాసిడ్స్ వల్ల కూడా పళ్లు దెబ్బతింటాయి. ఇలా చేయండి... పండ్లను జ్యూస్ రూపంలో తాగడం కంటే కొరికి తినడం మేలు. ఉదాహరణగా చెప్పాలంటే... నారింజ/బత్తాయి పండ్లు కొరికి తిన్నదానికంటే చక్కెర కలిపిన ఆరెంజ్ పండ్లరసంతో పళ్లు పాడయ్యే అవకాశం చాలా ఎక్కువ. పళ్లు బలహీనంగా ఉన్నవారు ఒకవేళ జ్యూస్ రూపంలో తాగాలనుకుంటే... అందులో ఎట్టిపరిస్థితుల్లోనూ చక్కెర కలుపుకోవద్దు. అలాగే జ్యూస్ తాగిన వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. చదవండి: స్మోకింగ్ చేసేవారికి పొంచి ఉన్న ప్రమాదం.. ఈ సమస్యలు మూడు రెట్లు ఎక్కువే.. దగ్గు మందులతోనూ జాగ్రత్త అవసరం... దగ్గు మందును మనకు మేలు చేసే ఓ ఔషధంగానే పరిగణించినా... అది కూడా చాలా సందర్భాల్లో పైన చెప్పిన ఫ్రూట్ జ్యూస్‌లాంటి ముప్పునే తెచ్చిపెడుతుంది. దాంట్లోని గాఢత (జిగురు లాంటి చిక్కదనం), అందులోని చక్కెర మోతాదులు... అచ్చం జ్యూస్‌లాంటి ప్రభావాన్నే చూపుతాయి. దాంతో పళ్లు దెబ్బతినే అవకాశం ఉంది. ఇలా చేయండి.. దగ్గు మందు తాగిన వెంటనే నోరు శుభ్రంగా కడుక్కోవాలి. వేలితో దాని జిగురుదనమంతా పోయేలా నోరు శుభ్రం చేసుకోవాలి. ఇలా దగ్గుమందు తాగిన ప్రతిసారీ నోరు కడుక్కోవాలి. గుండెకు మేలు చేసే చాక్లెట్లతోనూ జాగ్రత్త... డార్క్ చాక్లెట్లు గుండెకు మేలు చేస్తాయి. వాటిని పరిమితంగా తినడం అన్నది గుండె ఆరోగ్యానికి దోహదం చేసే అంశం. సాధారణంగా చాక్లెట్లు పళ్లకు చుట్టుకుపోయేలా ఒకింత జిగురుగా / జారుడుగా ఉంటాయి. అలా చుట్టుకుపోవడం వల్ల అవి తమలోని చక్కెరను చాలాసేపు పంటిపైనే అంటిపెట్టుకునే ఉండేలా చేస్తాయి. దాంతో పళ్ల ఎనామిల్ పొర దెబ్బతినే అవకాశాలతో పాటు, పళ్లలో రంధ్రాలు (క్యావిటీలు) పడే అవకాశాలెక్కువ. ఫలితంగా పిప్పిపళ్లు వస్తాయి. అలా దంతాలు దెబ్బతింటాయి. సమస్యను తప్పించుకోండిలా... పంటిని చుట్టుకుపోయేలా ఉండే చాక్లెట్లు, క్యాండీలు కాకుండా ఒకింత జిగురు తక్కువగా ఉండే వాటినే తినాలి. చాక్లెట్లు తిన్న తర్వాత ఆ జిగురంతా పోయేలా వేలితో లేదా టూత్ బ్రష్‌తో తేలిగ్గా బ్రష్ చేసుకుని నోరు పూర్తిగా శుభ్రమయ్యేలా జాగ్రత్త తీసుకోవాలి. చదవండి: Dry Throat: నోటి దుర్వాసన, దగ్గు, పుండ్ల సమస్యా.. ఇలా చేస్తే.. -
ఆరోగ్యానికి 5 చిట్కాలు.. అన్నీ తెలిసినవే!
How To Boost Immunity.. 5 Simple Ways శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాధినిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. కొంత మందికి చిన్నతనం నుంచే రోగనిరోధక శక్తి పుష్కలంగా ఉంటుంది. మరి కొంతమందికి వయసుతో పాటు జీవన ప్రమాణాల కారణంగా పెంపొందుతుంది. అందుకు పోషకాహారం అవసరమనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఏ ఆహారం తీసుకుంటే రోగనిరోధక శక్తి పెరుగుతుందనే విషయంలో మనలో చాలా మందికి క్లారిటీ లేదు. ప్రస్తుత కరోనా కల్లోలకాలంలో రోగనిరోధక శక్తి పెంపొందించుకోవాలని ప్రపంచవ్యాప్తంగా నిపుణులు ఇప్పటికీ హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ విషయాలపై అవగాహన కల్పించేందుకు ప్రతీ యేటా సెప్టెంబర్ మొదటి వారంలో జరుపుకునే వార్షిక కార్యక్రమమే నేషనల్ న్యూట్రిషన్ వీక్(జాతీయ పోషకాహార వారం). ఈ ఏడాది కార్యక్రమంలో.. 5 సులభతర మార్గాల ద్వారా రోగనిరోధకతను పెంపొందించుకునే పద్ధతులు మీకోసం.. సరిపడినంతగా నీరు మనిషి శరీరంలోని ప్రతి జీవాణువు, కణజాలం, అవయవం సమర్థవంతంగా పనిచేయాలంటే సరిపడినంతగా నీరు తాగాలి. ఆరోగ్యకరమైన జీవనానికి మూల సూత్రమే ఇది. హైడ్రేషన్ శరీరం పనితీరును నియంత్రించడంలో, జీవక్రియను సరైన మార్గంలో నడిపించడంలో కీలకపాత్ర పోషిస్తుంది. నీరు రోగనిరోధకతను పెంచడంలో ఎంతో సహాయపడుతుంది. ఆకుపచ్చ కూరగాయలు కూరగాయలు, ఆకుకూరలు తినమని పేరెంట్స్ ఎందుకు చెబుతారో ఎప్పుడైనా ఆలోచించారా? శరీరానికి అవసరమైన పోషకాలన్నింటినీ సహజసిద్ధంగా అందిస్తాయి కాబట్టే! విటమన్లు, మినరల్స్, ఫైబర్, ప్రొటీన్లు.. మొదలైనవి అధిక మోతాదులో అందించడమే కాకుండా రోగనిరోధకత పెంపుకు తోడ్పడతాయి. ప్రొబియోటిక్ ఫుడ్ రోగనిరోధకతను పెంపొందించడంలో కడుపులోని ఆహారనాళం కీలక పాత్ర పోషిస్తుందని మీకు తెలుసా? ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశోధనల్లో తేలిందేమిటంటే.. ప్రేగుల్లో ఉండే మంచి బ్యాక్టీరియా మన రోగనిరోధకతను పెంచడానికి తోడ్పడుతుంది. అందుకే మన రోజువారి ఆహారంలో పెరుగు, మజ్జిగ మొదలైన పాల ఉత్పత్తులు ఉండాలని న్యూట్రిషనిస్ట్స్ సూచిస్తుంటారు. తాజా పండ్లు, పండ్ల రసాలు పండ్లు, పండ్ల రసాల వల్ల ఆరోగ్యానికి చేకూరే లాభాన్ని కొట్టిపారేయలేము. నేరుగా తిన్నా లేదా జ్యూస్ రూపంలో తాగినా ముఖ్యమైన పోషకాలన్నీ సహజమైన మార్గంలో అందిస్తాయి. మన ఆహారంలో వీటి పాత్ర కూడా కీలకమే. మూలికలు, సుగంధ ద్రవ్యాలు రోగనిరోధకతను పెంచడంలో దాల్చినచెక్క, జీలకర్ర, పసుపు.. వంటగదిలో ఉపయోగించే ఇతర సుగంధ ద్రవ్యాల ప్రాధాన్యాన్ని మరచిపోకూడదు. వంటల్లో ప్రత్యేక రుచిని ఇవ్వడమే కాకుండా, యుగాలుగా సంప్రదాయ వైద్య పద్ధతుల్లో కూడా విరివిగా వాడుకలో ఉన్నాయనేది నిపుణులు చెప్పే మాట. కరోనా మహమ్మారి కాలంలో కూడా కషాయం, హెర్బల్ టీ, చూర్ణం మొదలైన పద్ధతుల్లో.. వీటిని వినియోగించడం చూశాం. ఈ మూలికలు, సుగంధ ద్రవ్యాల్లో యాంటి ఆక్సిడెంట్స్, యాంటి బ్యాక్టీరియాలను బలపరిచే లక్షణాలు పుష్కలంగా ఉండటమే వీటి ప్రత్యేకతకు ప్రధాన కారణమని చెప్పవచ్చు. చదవండి: గర్భిణులూ.. చక్కెర తగ్గించండి! -
టెస్టుకు ముందు పళ్ల రసాలు.. కరోనా రిజల్ట్ తారుమారు?
కరోనా వైరస్, రెండో దఫా లాక్డౌన్ ప్రభావంతో మూతపడ్డ విద్యాసంస్థల్ని.. కొన్ని దేశాలు తెరవాలని నిర్ణయించుకున్నాయి. అయితే ఇంగ్లండ్‌లో బడికి వెళ్లడం ఇష్టంలేని కొందరు పిల్లలు హుషారుతనం ప్రదర్శిస్తున్నారు. పండ్ల రసాల్ని, కెచప్‌లను ఉపయోగించి కరోనా పాజిటివ్ సర్టిఫికెట్లు సంపాదించుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ స్కూల్ యాజమాన్యం.. తల్లిదండ్రులకు పంపిన హెచ్చరిక సందేశం ద్వారా అసలు విషయం బయటపడింది. లండన్: మెర్సెసైడ్‌లోని బెల్లె వాలేలో ఉన్న గేట్‌ఎకర్ స్కూల్ యాజమాన్యం తాజాగా పేరెంట్స్‌కి ఒక మెయిల్ పెట్టింది. ల్యాటెరల్ ఫ్లో టెస్ట్ (ర్యాపిడ్ తరహా టెస్ట్) టైంలో చాలామంది పిల్లలు ఆరెంజ్, కచెప్.. ఇతరత్రా పండ్లరసాలు తాగుతున్నారని, దాంతో స్వాబ్ నమూనాలు మారిపోయి.. ఫలితం తేడా వస్తోందని తెలిపింది. దాని ద్వారా అంతా బాగానే ఉన్న పిల్లలకు కరోనా పాజిటివ్ రిజల్ట్ వస్తోందని, ఇలాంటి తప్పుడు పనులను తాము సహించబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని ఆ మెయిల్లో హెచ్చరించింది. జూన్ 21 సోమవారం నుంచి నిర్వహిస్తున్న టెస్టుల్లో వరుసబెట్టి ఆ స్కూల్ పిల్లలకు పాజిటివ్ రిపోర్టులు వచ్చాయట. ఆ అనుమానంతోనే ఈ మెయిల్ పంపింది స్కూల్. అయితే వాళ్లలో ఎంత మంది ఇలాంటి పనికి పాల్పడ్డారనేది తేలాల్సి ఉంది. అదే టైంలో బ్రిటన్ వ్యాప్తంగా చాలా స్కూళ్లలో స్టూడెంట్స్ ఇలాంటి చేష్టలకు పాల్పడినట్లు రుజువైందని, అందుకే తమ స్కూల్ పిల్లలపై కూడా అనుమానంతోనే ఆ మెయిల్ పంపామని స్కూల్ యాజమాన్యం వివరణ ఇచ్చుకుంది. అంతేకాదు ఆర్టీపీసీఆర్ టెస్ట్ రిపోర్టులనే తాము నమ్ముతామని పేరెంట్స్‌కి స్పష్టం చేసింది. మరోవైపు పండ్ల రసాలు, ఫిజ్జీలాంటి జ్యూస్‌లతో ఇలాంటి చేష్టలకు పాల్పడుతూ కొందరు టిక్‌టాక్‌లు చేస్తుండడంతో స్టూడెంట్స్పై ప్రభావం పడుతోందని అధికారులు భావిస్తున్నారు. చదవండి: వుహాన్ ల్యాబ్‌కు ఈ ఏడాది నోబెల్!! -
ప్రూట్ జ్యూస్ పంపిణీ చేసిన విజయ్ దేవరకొండ
-
చ..ల్ల..టి వేసవి
తాటాకుతో చేసిన వింజామరల అంచులను రంగురంగుల వస్త్రాలతో అలంకరించి, మీద కొద్దిగా గంధపు నీళ్లు చిలకరించి విసురుకుంటుంటే, చల్లటి తుషారాలు శరీరాన్ని తాకుతుంటే, ‘ఏమి హాయిలే హలా’ అని పాడుకుంటూ ఎండను ఎంజాయ్ చెయ్యలేమా?! ఫ్యాను, కరెంటు ఉన్నా కూడా ఇదొక కూల్ ఐడియా! అమ్మ బాబోయ్ ఏం ఎండలో.. భరించలేకుండా ఉన్నాం. సూర్యుడే దిగి వచ్చి అందరినీ సంబరంగా ఆశీర్వదిస్తున్నాడేమో అన్నట్లుగా ఉన్నాయి! తట్టుకోవాలి తప్పదు. అప్పుడేగా ఏ ఋతువునైనా మనం గౌరవించినట్లు. మూడు నెలల పాటు అతిథిగా వచ్చిన ప్రచండ భాస్కరుడినీ అలాగే గౌరవించాలి. అందుకు బదులు... ‘అష్’ ‘ఉష్’ అంటూ వేడి వేడి నిట్టూర్పులు నిట్టూరిస్తే ఎలాగ! ఆయన పని ఆయన సక్రమంగా చేయడమూ తప్పేనా? అసలు సూర్యుడు వేడిగా ఉండకపోతే ఆషాఢంలో వానలు పడవు. పైరులు కళకళలాడకుండా వెలతెలపోతాయి. ఆయన వేడివేడిగా వచ్చి, నీళ్లన్నీ పీల్చేస్తేనే కదా మేఘం వర్షించగలిగేది. ఆ విషయం మర్చిపోయి ‘ఎండలు బాబోయ్ ఎండలు’ అంటూ ఎండాకాలమంతా ఆ ప్రత్యక్ష నారాయణుడిని నిందిస్తూంటే ఎలాగ. ఆయనకే కనక కోపం వచ్చి, చిన్నబుచ్చుకున్నాడనుకోండి.. మన పరిస్థితి ఏంటి? వానలు పడవు, పంటలు పండవు. సరే ఇదంతా ప్రకృతికి సంబంధించిన విషయం. కరెంటు లేని రోజుల్లో వేసవిలో దొంగలకు సౌకర్యంగా ఉండేది కాదు. తెల్లవార్లూ విసనకర్రలతో విసురుకుంటూ, నిద్రపోకుండా ఇంట్లోని పెద్దవాళ్లలో ఎవరో ఒకరు మెలకువగా ఉండటంతో చోరుడికి అనుకూలించేది కాదు. వాడు ఎన్ని కళలు ప్రదర్శిద్దామన్నా పప్పులుడికేవి కాదు. పరోక్షంగా ఎవరో ఒకరు కాపలా కాస్తూ ఉండేవారు. పాపం ఆ వచ్చినవాడికి నిరాశే మిగిలేది. వేసవిలో ఇదొక భరోసా మనకు. ఇక ఇంట్లో అమ్మమ్మలు, నానమ్మల ప్రహసనం మరోలా ఉండేది. తాటాకుతో చేసిన వింజామరల అంచులను రంగురంగుల వస్త్రాలతో అలంకరించి, వాటి మీద కొద్దిగా గంధపు నీళ్లు చిలకరించి విసురుకుంటుంటే, చల్లటి తుషారాలు శరీరాన్ని తాకుతుంటే, ‘ఏమి హాయిలే హలా’ అని పాడుకుంటూ ఎండను ఆస్వాదించే ఉంటారు.సాయంత్రం సంబరం మరోలా ఉండేది. ఊర్లో ఉండే పెద్ద చెరువుకి పిల్లలంతా తాబేలు పిల్లల్లా బుడి బుడి అడుగులు వేస్తూ, డాల్ఫిన్ చేపల్లా నీళ్లలోకి దూకి, సొర చేపల్లాగ ఈత కొడుతూ, రకరకాల విన్యాసాలు చేసి, శరీర తాపం చల్లారాక ఒంటి నిండా వాన ముత్యాలు నింపుకుని, ఇంటికి వచ్చేవారు. ఇంట్లో ఉండే మేనత్తలో, బాబయ్యలో.. చీకటి పడకుండా అన్నాలు తినిపించి, పిల్లల్ని పక్కనే పడుకోబెట్టుకుని, పోతన భాగవత పద్యాలు నేర్పుతూ, విసనకర్రతో చల్లగా విసురుతుంటే, ఆరుబయట చంద్రుణ్ని, నక్షత్రాలను చూస్తూ, తుంగ చాప మీద పడుకుని, ఆదమరిచి నిద్రపోయేవారు. అలా ప్రకృతికి అనుగుణంగా శరీరాన్ని అలవాటు చేసేసేవారు. ఇంతటి మహద్భాగ్యాన్ని కల్పిస్తున్న సూర్యుడిని ప్రత్యక్ష నారాయణుడు అని స్తుతిస్తూనే, ఎండల్తో చంపేస్తున్నాడని నిందించడం ఎంతవరకు న్యాయం? శ్రీరాముడు సూర్యవంశీయుడే కదా, అనునిత్యం ఆయనకు నమస్కరించేవాడు కదా! సూర్యభగవానుడిని దినమణి అని, పూర్వ దిక్పాలకుడు అని కూడా అంటారుగా. అంతటి దేవుడిని ఇంతగా తెగనాడటం భావ్యమేనా? భావ్యమే లెండి. ఎందుకంటారా, ఆయన మనకు మిత్రుడు (సూర్యుడిని మిత్రుడు అని కూడా అంటారు), ఆయన దగ్గర మనకు చనువు ఉంది కదా, అందుకే అలా నిందాస్తుతి చేస్తుంటాం.ఇవన్నీ కాదు. వేసవి అంటే మామిడిపండ్లు, ద్రాక్షలు. నూజివీడు పెద్దరసాలు, చిన్న రసాలు, గోదావరి జిల్లాలలో ప్రత్యేకంగా దొరికే కొత్తపల్లి కొబ్బరి, చెరకు రసాలు, పంచదార కలశం, సువర్ణరేఖ.. ఇవేనా! ఊరు వెళితే చాలు తాటి చెట్లు ఎక్కినవాళ్లు కత్తితో తాటికాయలు కోసి ధబీధబీమని కింద పడేయడం, నీళ్లు బయటకు రాకుండా జాగ్రత్తగా కత్తితో చెదిపి ఇస్తే, ఒక్కో ముంజలోకి వేలితో చిన్న రంధ్రం చేసి స్ట్రా వంటివి లేకుండా ముంజకాయను నోట్లోకి తీసుకుని, నీళ్లు తాగేసి, గుజ్జు జాగ్రత్తగా తీసుకుని తినడం ప్రతి వేసవిలోనూ ఓ సరదా. రసాలు తినడమైతే ఓ పెద్ద టాస్క్. ఒంటి మీద కారకుండా తినాలి. అదొక మధురమైన ఉల్లాసం. ఎర్రటి కొత్త ఆవకాయలోకి మామిడిపండు రసం నంచుకుని తింటే ‘ఆహా నా రాజా’ అని జంధ్యాల మార్కు డైలాగు గుర్తురాకుండా ఉండదు. చెప్పొచ్చేదేమంటే.. ఇంత వేడి, ఇంత ఎండ లేకపోతే ఇవన్నీ ఇంత చల్లగా ఎలా ఆస్వాదించగలం. అందుకే అష్షుబుష్షులు మాని, ఆహా ఓహో అనుకుందాం. మనమెంత నిట్టూర్చినా ఎండ వేడిగా ఉండకమానదు, వడ గాడ్పు వీచక మానదు, శరీరాలు చెమట చిందించకా తప్పదు. కనుక ఫీల్ ది కూల్ ఆఫ్ సమ్మర్. వైజయంతి పురాణపండ -
కూల్ డ్రింకు.. జ్యూస్ రుచి!
న్యూఢిల్లీ: వేసవిలో కోకొకోలా, థమ్సప్, స్ప్రైట్ తరహా కోలా బ్రాండ్స్ విరివిగా అమ్ముడుపోవడం కొన్నేళ్ల క్రితం వరకు చూశాం. కానీ, కొన్నేళ్లుగా వేసవి రుచులు వేగంగా మారుతున్నాయి. వినియోగదారుల నాడి పట్టుకుని, వారి అభిమానం సంపాదించేందుకు అగ్రగామి కంపెనీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వినియోగదారుల్లో ఆరోగ్యం పట్ల స్పృహ పెరగడంతో సంప్రదాయ పండ్ల రసాలు, పండ్ల రసాలు కలిపిన పానీయాల (జ్యూస్ డ్రింక్స్) మార్కెట్ గణనీయంగా పెరుగుతోంది. దీంతో సంప్రదాయ రుచులతో, చక్కెర తగ్గించి పండ్ల రసాల పానీయాలను కోక్, పెప్సీ, ఐటీసీ, డాబర్ తదితర కంపెనీలు తీసుకొస్తున్నాయి. పళ్ల రసాల డ్రింక్స్‌కు డిమాండ్ వారం క్రితమే కోకొకోలా సంస్థ మినట్మెయిడ్ బ్రాండ్ కింద మూడు రకాల పండ్ల ఆధారిత డ్రింక్స్‌ను విడుదల చేసింది. తమిళనాడులో ప్రాచుర్యం పొందిన ద్రాక్ష రుచి ఆధారిత డ్రింక్‌ను మినిట్మెయిడ్ కలర్ పేరుతో తీసుకొచ్చింది. సంప్రదాయ పానీయాల మార్కెట్లో విస్తరించటమే దీని వెనుక ఉద్దేశం. మరో బహుళజాతి సంస్థ పెప్సికో సైతం ట్రోపికానా స్లైస్ పోర్ట్‌ఫోలియోలో స్థానిక డ్రింక్స్‌ను మార్కెట్‌కు పరిచేయం చేస్తోంది. ఈ కంపెనీలకు ఐటీసీ బినేచురల్ బ్రాండ్, డాబర్ రియల్ బ్రాండ్, హెక్టార్ వేవరేజెస్కు చెందిన పేపర్‌బోట్ గట్టి పోటీ ఇస్తున్నాయి. ప్యాకేజ్డ్ సంప్రదాయ రుచులతో కూడిన డ్రింక్స్ మార్కెట్ గడిచిన మూడేళ్ల కాలంలో ఏటా 30–35 శాతం మధ్య పెరుగుతూ వచ్చినట్టు గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తోంది. పళ్లరసాలకు డిమాండ్ ఏటేటా 17 శాతం డిమాండ్ పెరుగుతోందని అంచనా. ఐటీసీ ప్రత్యేక దృష్టి ‘‘బినేచురల్ బ్రాండ్ కింద నూతన శ్రేణి ప్రీమియం పళ్ల రసాలు, బేవరేజెస్‌ను పారదర్శక పెట్ ప్యాక్‌లో తీసుకొచ్చాం. దేశంలో ఈ తరహా ప్యాక్ ఇదే మొదటిసారి. పైగా ఇందులో ఎటువంటి ప్రిజర్వేటివ్‌లు (చెడిపోకుండా కాపాడేందుకు వినియోగించేవి) కలపలేదు’’ అని ఐటీసీ డివిజనల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ హేమంత్ మాలిక్ పేర్కొన్నారు. కెవిన్‌కేర్ కంపెనీ కూడా తక్కువ చక్కెరతో కూడిన ప్రిజర్వేటివ్‌లు లేని పళ్ల రసాలను రెండేళ్ల క్రితమే తీసుకొచ్చింది. టెండర్ కోకోనట్ వాటర్, మిల్క్‌షేక్ లైట్‌ను షుగర్, ప్రిజర్వేటివ్‌లు లేకుండా ప్రవేశపెట్టింది. తమ బేవరేజెస్ వ్యాపారంలో 55 శాతం ఈ వేసవిలోనే నమోదు అవుతుందని భావిస్తున్నట్టు ఈ విభాగం హెడ్ బీపీ రవీంద్రన్ పేర్కొన్నారు. రూ.25,000 కోట్ల పరిశ్రమ దేశవ్యాప్తంగా పళ్ల రసాల మార్కెట్ 3.6 బిలియన్ డాలర్లుగా (రూ.25,000 కోట్లు) ఉంది. ఎక్కువగా ప్రజాదరణలో ఉన్నది మామిడి పండు రసంతో (మ్యాంగో జ్యూస్) కూడిన పానీయాలకే. ఆ తర్వాత ఆరెంజ్, వాటర్‌మిలన్, గ్రేప్, పైనాపిల్, ఇతర పండ్ల రసాలు డ్రింక్స్ విరివిగా అమ్ముడవుతున్నాయి. ఈ మార్కెట్లో కోక్, పార్లే ఆగ్రో, పెప్సికో, డాబర్ ఆధిపత్యం చలాయిస్తున్నట్టు మార్కెట్ పరిశీలకులు చెబుతున్నారు. 2018లో ఈ సంస్థల విక్రయాలు మొత్తం అమ్మకాల్లో 75 శాతంగా ఉన్నాయి. వీటిల్లోనూ మ్యాంగో డ్రింక్స్ అమ్మకాలే ఎక్కువగా ఉండడం గమనార్హం. భవిష్యత్తులోనూ పండ్ల రసాలతో కూడిన డ్రింక్స్ మార్కెట్ బ్రహ్మాండంగా వృద్ధి చెందుతుందని యూరో మానిటర్ అంచనా వేస్తోంది. దేశీయ పరిశ్రమ ఏటా 16.5 శాతం వృద్ధిని నమోదు చేయగలదన్న అంచనాలున్నాయి. 2019–23 మధ్య అచ్చమైన పళ్ల రసాల మార్కెట్ ఏటా 9.4%, పళ్ల రసాలతో కూడిన డ్రింక్స్ మార్కెట్ 14.8 శాతం చొప్పున వృద్ధి చెందుతాయని భావిస్తున్నారు. -
మధుమేహులకు తీపికబురు
వాషింగ్టన్ : పండ్ల రసాన్ని నేరుగా తీసుకుంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయనే ఆందోళన అసంబద్ధమని తాజా అథ్యయనం స్పష్టం చేసింది. ఫ్రూట్ జ్యూస్‌తో టైప్ 2 డయాబెటిస్ రిస్క్ పెరుగుతుందనే అంచనాల నేపథ్యంలో చేపట్టిన ఈ అథ్యయనంలో పండ్ల రసాల ప్రభావం గ్లైసిమిక్ కంట్రోల్‌పై ఎలాంటి ప్రభావం చూపినట్టు వెల్లడికాలేదు. ఫ్రూట్ జ్యూస్‌లు, బ్లడ్ గ్లూకోజ్ కంట్రోల్‌పై సమగ్ర డేటా విశ్లేషణ ద్వారా చేపట్టిన ఈ అథ్యయనం మధుమేహ చికిత్సలో మైలురాయిగా పరిశోధకులు పేర్కొంటున్నారు. యాపిల్, బెర్రీ, సైట్రస్, ద్రాక్ష, దానిమ్మ జ్యూస్‌ల ప్రభావం షుగర్ లెవెల్స్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందని ఈ అథ్యయనంలో విశ్లేషించారు. టైప్ 2 డయాబెటిస్‌ను ఆరోగ్యకర జీవన శైలి, సరైన ఆహారం, వ్యాయామంతో నియంత్రించవచ్చని పరిశోధకులు పేర్కొన్నారు. న్యూట్రిషనల్ సైన్స్ జర్నల్‌లో అథ్యయన ఫలితాలను ప్రచురించారు. -
పండ్లరసాలతో దంతాలకు చేటు..
పండ్లు ఆరోగ్యానికి మంచివే! అలాగని అతిగా పండ్లరసాలు తాగితే దంతాలకు చేటు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూరగాయలతో పాటు పండ్లను కూడా నేరుగా తింటే విటమిన్లతో పాటు పీచుపదార్థం శరీరానికి అందుతుందని, అలా కాకుండా జ్యూస్‌లు, స్మూతీలు ఎడా పెడా తాగేస్తుంటే, వాటిలోని చక్కెర, ఆమ్లా ల ప్రభావం వల్ల దంతాలపై ఉండే ఎనామి ల్ పొర దెబ్బతింటుందని లండన్ స్మైలింగ్ డెంటల్ గ్రూప్ నిపుణుడు డాక్టర్ ఉచెనా ఒకోయే చెబుతున్నారు. యవ్వనం తొణికిస లాడేలా కనిపించేందుకు ఇదివరకు ఎనర్జీ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగేవారని, ఇటీవలి కాలంలో పండ్లరసాలను, జ్యూస్‌లను ఎక్కు వగా తాగుతున్నారని, ఇవేవైనా అతిగా తాగ డం దంతాల ఆరోగ్యానికి ఏమాత్రం మంచి ది కాదని ఆయన అంటున్నారు. పండ్ల రసాలు ఎక్కువగా తాగేవారు వాటిలోని చక్కెర ప్రభావం ఎక్కువైతే ఆందోళన తట్టుకోలేక పళ్లు కొరకడానికి అలవాటు పడతారని, ఫలితంగా దంతాలు మరింత బలహీనపడతాయని హెచ్చరిస్తున్నారు. -
పండ్ల రసం తాగి.. ఇద్దరు చిన్నారులు మృతి
కర్నూలు: జిల్లాలోని కోసిగి మండలం శాంతనూర్ గ్రామంలో గురువారం విషాదం చోటుచేసుకుంది. పండ్ల రసం తాగిన ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. విషపూరితమైన పండ్ల రసాన్ని తాగిన కొద్ది క్షణాల్లోనే చిన్నారులు ప్రాణాలు విడిచారు. దీంతో శాంతనూర్ గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. అందిన ప్రాథమిక సమాచారం మేరకు.. బంధువులైన సరళ, గోవర్థన్ అనే మూడేళ్ల చిన్నారులు కర్నూలు జిల్లాలోని శాంతనూర్ గ్రామంలో జరిగే జాతరను చూసేందుకు వచ్చారు. జాతరలో ఓ పండ్ల రసం బాటిల్ ను కొనుగోలు చేసి తాగి మృతిచెందారు. దాంతో విగతజీవులైన తమ పిల్లలను చూసి తల్లిదండ్రులు కన్నీటపర్యంతమైయ్యారు. జాతర చూసేందుకు వెళ్లిన చిన్నారులు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారంటూ ఆవేధన వ్యక్తం చేశారు. విషపూరితమైన పండ్లరసం తాగడం వల్లే తమ పిల్లలు చనిపోయారంటూ చిన్నారుల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
మేని బంగారానికి మేలిమి గింజలు
అందానికి ఫేస్‌ప్యాక్‌లు, ఆరోగ్యానికి పండ్లరసాలపైనే దృష్టిపెడతారు చాలామంది. వీటితో పాటు పండ్లు, కూరగాయల నుంచి లభించే గింజలను కూడా రోజూ కొంత మోతాదులో తీసుకోవడం అవసరం. నల్ల నువ్వులు నిద్రలేమి, మద్యం సేవించడం, ఆకలి లేకపోవడం వంటి సమస్యలకు నల్లనువ్వులు చక్కని పరిష్కారం. నువ్వులలో ఉండే కొవ్వు, అమినోయాసిడ్స్, పొటాషియం, పీచుపదార్థాలు చర్మానికి మేలు చేస్తాయి. చర్మం సాగే గుణాన్ని నివారిస్తాయి. ఇలా చేయండి: నువ్వులను పచ్చిగా లేదా వేయించి పండ్లు, కూరగాయల సలాడ్స్‌లో కలిపి తీసుకోవచ్చు. గుమ్మడి గింజలు జింక్, విటమిన్ ఇ, సల్ఫర్, ఒమెగా 3 నూనెలలో ఉండే సహజగుణాల వల్ల చర్మం నిస్తేజంగా మారదు. పైగా తనను తాను రిపేర్ చేసుకుంటుంది. గుమ్మడి గింజల్లో వేడి చేసే గుణం ఉండటం వల్ల కొవ్వు కరుగుతుంది. ఇలా చేయండి: గుమ్మడి గింజలను పచ్చిగానే తీసుకోవచ్చు లేదా గింజలను గ్రైండ్‌చేసి, సలాడ్స్‌లో కలిపి తీసుకోవచ్చు. దోస గింజలు: చాతిలో మంట తగ్గించడం, కిడ్నీల పనితీరును, జీర్ణవ్యవస్థ పనితీరును మెరుగుపరిచే గుణాలు వీటిలో ఉన్నాయి. ఎ, బి, సి విటమిన్లు ఉండటం వల్ల శక్తి పెరుగుతుంది. వీటిలో ఉండే పోషకాలు శిరోజాలకు, గోర్లకు బలాన్ని ఇస్తాయి. చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. ఫలితంగా చర్మం నిగారింపు పెరుగుతుంది. ఇలా చేయండి: రోజూ సలాడ్‌లో టీ స్పూన్ వేయించిన దోస గింజలను కలిపి తీసుకోండి. ఆరోగ్యానికి ఆరోగ్యం. అందానికి అందం.