పండ్లరసాలతో దంతాలకు చేటు..
పండ్లు ఆరోగ్యానికి మంచివే! అలాగని అతిగా పండ్లరసాలు తాగితే దంతాలకు చేటు తప్పదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కూరగాయలతో పాటు పండ్లను కూడా నేరుగా తింటే విటమిన్లతో పాటు పీచుపదార్థం శరీరానికి అందుతుందని, అలా కాకుండా జ్యూస్‌లు, స్మూతీలు ఎడా పెడా తాగేస్తుంటే, వాటిలోని చక్కెర, ఆమ్లా ల ప్రభావం వల్ల దంతాలపై ఉండే ఎనామి ల్ పొర దెబ్బతింటుందని లండన్ స్మైలింగ్ డెంటల్ గ్రూప్ నిపుణుడు డాక్టర్ ఉచెనా ఒకోయే చెబుతున్నారు.
యవ్వనం తొణికిస లాడేలా కనిపించేందుకు ఇదివరకు ఎనర్జీ డ్రింక్స్‌ను ఎక్కువగా తాగేవారని, ఇటీవలి కాలంలో పండ్లరసాలను, జ్యూస్‌లను ఎక్కు వగా తాగుతున్నారని, ఇవేవైనా అతిగా తాగ డం దంతాల ఆరోగ్యానికి ఏమాత్రం మంచి ది కాదని ఆయన అంటున్నారు. పండ్ల రసాలు ఎక్కువగా తాగేవారు వాటిలోని చక్కెర ప్రభావం ఎక్కువైతే ఆందోళన తట్టుకోలేక పళ్లు కొరకడానికి అలవాటు పడతారని, ఫలితంగా దంతాలు మరింత బలహీనపడతాయని హెచ్చరిస్తున్నారు.