జకార్తా: నెల రోజుల క్రితం పామాయిల్ ఎగుమతులపై విధించిన నిషేధాన్ని తొలగిస్తున్నట్లు ఇండోనేసియా ప్రభుత్వం గురువారం తెలిపింది. దేశీయంగా సరఫరా పెరగడం, చమురు ధరలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది. వంటనూనె ఎగుమతులు సోమవారం నుంచి తిరిగి ప్రారంభమవుతాయని అధ్యక్షుడు జొకొ విడొడొ తెలిపారు. ప్రపంచ పామాయిల్ ఉత్పత్తిలో ఇండోనేసియా, మలేసియాలు 85% వాటా కలిగి ఉన్నాయి. ఈ రెండు దేశాలకు పామాయిల్ ఎగుమతులే ప్రధాన ఆదాయ వనరు. నిషేధం తొలగడంతో, భారత్‌లో పామాయిల్ ధరలు దిగివస్తాయని భావిస్తున్నారు.
చదవండి: అదృష్టం అంటే వీరిదే.. లాటరీలో రూ.1,800 కోట్లు గెలుచుకున్న జంట
Palm Oil: పామాయిల్ ఎగుమతులకు ఇండోనేసియా ఓకే
Published Fri, May 20 2022 8:36 AM | Last Updated on Fri, May 20 2022 11:21 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment