
న్యూఢిల్లీ: కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో చైనా కంపెనీలు వ్యక్తిగత రక్షణ ఉపకరణాల(పీపీఈ) కిట్లను ప్రపంచ దేశాలకు భారీగా ఎగుమతి చేస్తున్నాయి. అయితే, వీటిలో నాణ్యత లోపించిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏప్రిల్ 5వ తేదీన చైనా నుంచి 1,70,000 పీపీఈ కిట్లు భారత్‌కు చేరుకున్నాయి. ఇందులో 50 వేల కిట్లు నాణ్యతా పరీక్షలో విఫలమైనట్లు ఓ పత్రిక వెల్లడించింది. గ్వాలియర్‌లోని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీవో)ప్రయోగశాలలో ఈ నాణ్యతా పరీక్ష నిర్వహించినట్లు పేర్కొంది. ఈ 1,70,000 కిట్లు చైనా నుంచి విరాళంగా వచ్చినట్లు సమాచారం. తాము చైనా నుంచి సీఈ/ఎఫ్‌డీఏ సర్టిఫైడ్ పీపీఈ కిట్లను మాత్రమే దిగుమతి చేసుకుంటున్నట్లు కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు.
నాణ్యతపై సందేహాలు వద్దు
చైనా సంస్థలు సరఫరా చేస్తున్న పీపీఈ కిట్ల నాణ్యతపై సందేహాలు అక్కర్లేదని భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం అధికార ప్రతినిధి రోంగ్ చెప్పారు. నాణ్యమైన కిట్లను చైనా ఎగుమతి చేస్తోందని చెప్పారు. ఫ్రాన్స్, జర్మనీ తదితర దేశాల నుంచి టెస్టింగ్ కిట్లు, వైద్య పరికరాలు దిగుమతి చేసుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు ప్రభుత్వ అధికార వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment